Gold theft
-
7.5 కిలోల బంగారంతో పరారీ
జగ్గయ్యపేట అర్బన్: హైదరాబాద్ నుంచి విజయవాడలోని షాపునకు బంగారు నగలు డెలివరీ కోసం కారులో నగల వ్యాపారి గుమాస్తాలతో బయలుదేరిన కారు డ్రైవర్ తనకు నిద్ర వస్తుంది టీ తాగుదామని చెప్పి కారు ఆపి టీ తాగుతుండగా, మంచినీటి బాటిల్ కారులో నుంచి తీసుకొస్తానని చెప్పి కారు వద్దకు వెళ్లి బంగారు నగలతో కారులో ఉడాయించిన సంఘటన శనివారం రాత్రి జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని షేర్‌మహ్మద్‌పేట క్రాస్ రోడ్డు ఫుడ్‌ప్లాజా వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో సూత్రావ్ బాలకిషన్ ఏడేళ్లుగా బంగారం వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడలోని డీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ ప్రైవేటు లిమిటెడ్ షాపు వారికి 7.5 కిలోల బంగారు నగలు ఆర్డర్ ప్రకారం ఇవ్వడానికి ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటలకు కారులో హిమయత్‌నగర్ నుంచి బాలకిషన్, గుమస్తా అంబాదాస్ షిండే, డ్రైవర్ జితేష్ అద్వాల్ బయలుదేరారు. కాగా డ్రైవర్ జితేష్ అద్వాల్ తనకు నిద్ర వస్తుందని చెప్పడంతో జగ్గయ్యపేట సమీపంలోని షేర్‌మహ్మద్‌పేట క్రాస్ రోడ్ ఫుడ్ ఫ్లాజా వద్ద మధ్యాహ్నం 12.30 సమయంలో కారు ఆపారు. ముగ్గురు టీ తాగుతుండగా మంచినీటి బాటిల్ కారులో ఉంది తీసుకొస్తానని చెప్పి కారు డ్రైవర్ జితేష్ అద్వాల్ కారు దగ్గరకు వెళ్లి కారు స్టార్ట్ చేసి విజయవాడ వైపు ఉడాయించాడు. కారుకు జీపీఎస్ ట్రాక్ ఉండటంతో నందిగామ సమీపంలోని మునగచర్ల వద్ద కారును వదిలేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసి నగల బ్యాగ్‌తో పరారయ్యాడు. నందిగామ ఏసీపీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేయగా, సంఘటన జగ్గయ్యపేట పట్టణ పరిధిలో జరగడంతో కేసును జగ్గయ్యపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయగా, పట్టణ ఎస్ఐ జి.రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా జగ్గయ్యపేట సీఐ లేకపోవడంతో నందిగామ సీఐ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టి కేసు విచారణ ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
బస్సులో 600 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ
మడకశిర/ హిందూపురం అర్బన్: ిహందూపురం నుంచి మడకశిరకు వస్తున్న ఆర్టీసీ బస్సులో బుధవారం మధ్యాహ్నం 600 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు... మడకశిరకు చెందిన ఆదినారాయణ సతీమణి విజయలక్ష్మి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గత శనివారం హిందూపురంలోని తన కుమార్తె సంధ్య ఇంటికి వెళ్లింది. బుధవారం కుమార్తె ఇంటి నుంచి మడకశిరకు బయలుదేరింది. దాదాపు 600 గ్రాముల బంగారు ఆభరణాలను ఒక బ్యాగులో ఉంచుకుని మధ్యాహ్నం హిందూపురంలోని పరిగి బస్టాండ్‌లో వచ్చి అక్కడ మడకశిర వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఇంటికి చేరుకున్న బాధితురాలు బంగారు ఆభరణాలున్న బ్యాగు చూసుకోగా ...కనిపించలేదు. మార్గంమధ్యలోనే బంగారు ఆభరణాల బ్యాగు చోరీ గురైనట్లు ఆమె తెలుసుకుంది. కుటుంబీకులతో కలిసి బుధవారం రాత్రి హిందూపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కంజాక్షన్ బాధితురాలికితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పరిగి బస్టాండు వద్ద తన పక్కనే ఇద్దరు మహిళలు కూర్చుని వెంటనే వెళ్లిపోయారని ఫిర్యాదులో బాధితురాలు విజయలక్ష్మి పేర్కొన్నారు. -
అత్తారింటికే కన్నమేశాడు!
పామిడి: అంగన్వాడీ కార్యకర్త ఇంటిలో చోరీ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. అత్తింటికే మేనల్లుడు కన్నమేశాడు. రూ.లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు, ఏటీఎం కార్డు అపహరించుకెళ్లాడు. వివరాలను మంగళవారం సాయంత్రం పామిడి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య వెల్లడించారు. మంగళవారం ఉదయం పామిడి 44వ జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ యువకుడు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి యువకుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో గత నెల 17న పామిడిలో నివాసముంటున్న గజరాంపల్లి అంగన్వాడీ కార్యకర్త శైలజ కుమారి ఇంటిలో రూ. లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు, నగదు అపహరించుకెళ్లిన విషయం వెలుగు చూసింది. యువకుడిని గజరాంపల్లికి చెందిన నరిగమ్మగారి రఘునాథరెడ్డిగా గుర్తించారు. శైలజ కుమారికి మేనల్లుడవుతాడు. ఈ నెల 17న శైలజ కుమారి విధుల నిమిత్తం గజరాంపల్లికి చేరుకున్నప్పుడు ద్విచక్ర వాహనంపై పామిడిలోని అత్తింటికి చేరుకుని తలుపు తాళం బద్ధలుగొట్టి బీరువా తెరిచి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేలతో పాటు ఏటీఎం కార్డు అపహరించుకెళ్లాడు. బంగారు ఆభరణాలను పామిడిలో విక్రయించేందుకు వస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్‌లో చొరవ చూపిన పామిడి సీఐ ఈరన్న, ఎస్ఐ చాంద్‌బాషా, సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. -
టీనేజర్ భారీ స్కెచ్.. ప్రియుడితో కలిసి సొంత ఇల్లు లూటీ
రాజస్థాన్: దొంగతనాలకు సంబంధించిన నేరాల్లో ముందుగా ఇంటి దొంగల హస్తం ఉంటుందన్నది పోలీసుల నమ్మకం. అయితే రాజస్థాన్‌లో ఓ చోరీ కేసులోనూ పోలీసులు ఇదే రకంగా అనుమానం వ్యక్తం చేశారు. చివరకు వారి అనుమానమే నిజమైంది. అయితే ఇక్కడ చోరీకి పాల్పడింది ఎవరో తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని సెంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ. 33 వేల రూపాయల నగదుతో పాటు రూ. 4 లక్షల రూపాయల విలువైన నగలు మాయమయ్యాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని విచారన చేపట్టారు. ఇంట్లో తవ్వి దాచిపెట్టిన బంగారాన్ని తీసుకెళ్లడం ఇతరులకు సాధ్యం కాదు కాబట్టి ఇంట్లో వాళ్లే ఎవరో దీని వెనుక ఉన్నారని అనుమానించిన పోలీసులు ఆ ఇంటి యజమాని చిన్న కూతురు(17) ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. తనకు ఈ దొంగతనానికి కచ్చితంగా సంబంధం ఉందని భావించారు. చివరికి ఆమెను తమదైన శైలిలో విచారించగా జరిగిన విషయం నిందితురాలు బయటపెట్టింది. అదే ఊరిలో తనతో కలిసి చదువుతున్న తన ప్రియుడే ఈ చోరీ చేశాడని తెలిపింది. అయితే దీనికి కూడా ఓ కారణం ఉందని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 17 ఏళ్ల వయసు ఉన్న ఆ అమ్మాయి మరో ఏడాదికి తన మైనారిటీ తీరుతుందని అప్పుడు ప్రియుడిని పెళ్లి చేసుకుంటే ఇబ్బంది ఉండదని ప్లాన్ చేసింది. అందుకే ముందుగానే ఇంట్లో ఉన్న నగలు దోచుకోవాలని ప్రియుడికి సలహా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. -
Medak: ఒకేరోజు ఏడు చోట్ల చోరీలు మరువక ముందే..
సాక్షి, జోగిపేట(మెదక్): జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో అందోలులో ఇంటికి తాళాలు వేసి ఎక్కడికైనా వెళ్లాలంటే స్థానికులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం ఒకేరోజు ఏడు చోట్ల దొంగతనాలు జరిగిన సంఘటన మరువకముందే శనివారం మరోసారి దొంగలు రెచ్చిపోయారు. రొయ్యలగూడెం కాలనీలో వరుసగా తాళాలు వేసిన ఏడు ఇళ్లు, రెండు కిరాణ దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. ఇళ్లకు వేసిన తాళాలు పగులగొట్టి నగదు, బియ్యం బస్తాలను అపహరించారు. ► రొయ్యల యాదమ్మ ఇంటి తాళం పగులగొట్టి క్వింటాల్ బియ్యం, ఎల్లమ్మ ఇంట్లో నుంచి 50 కిలోల బియ్యం, బంగారం, లచ్చమ్మతో పాటు మరో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ నాలుగు ఇళ్లవారు హైదరాబాద్‌లో ఉన్న కారణంగా ఇంట్లో ఏఏ వస్తువులు పోయాయో పూర్తి వివరాలు తెలియరాలేదు. ► రాజుకు చెందిన కిరాణా షాప్‌లో రూ.5వేల నగదు, సిగరెట్ ప్యాకెట్లు, డీవీడీ రాజుకు చెందిన కిరాణా డబ్బా షట్టర్ కట్ చేసి వెళ్లిపోయారు. ► ఈ విషయమై ఎస్ఐ వెంకటేష్‌ను వివరణ కోరగా రొయ్యల యాదమ్మ, రాజులు మాత్రమే ఫిర్యాదు చేశారన్నారు. సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు. చదవండి: దారుణం: 8 మందిని బలిగొన్న నిర్లక్ష్యం -
పెళ్లికి వస్తారు.. గిఫ్టులు ఎక్కడున్నాయో తెలుసుకుని..
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: బంధువుల వలే వివాహాలకు హాజరై అదును చూసి విలువైన వస్తువులు, నగుదును కాజేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఆరు సంవత్సరాల బాలిక కూడా ఉంది. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్ జిల్లాకు చెందిన ప్రశాంత్ (22), శ్రావణ్ (21)తోపాటు ఓ మహిళ, ఆరు సంవత్సరాల బాలికతో నెలరోజుల క్రితం నగరానికి వచ్చారు. కారును అద్దెకు తీసుకోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ఫంక్షన్‌హాల్స్‌లో జరిగే శుభకార్యాల్లో బంధువుల వలే హాజరయ్యేవారు. ఆయా శుభకార్యాల్లో బంధువులు ఇచ్చిన ఖరీదైన గిప్టులను ఎక్కడ పెట్టారో తెలిపి బాలికను పంపించే వారు. ఆడుకుంటూ వెళ్లి ఆ చిన్నారి వాటిని తీసుకువచ్చి ఆ మహిళకు అందించేది. దొంగలించిన సొత్తుతో నిమిషాల వ్యవధిలో శుభకార్యం నుంచి వెళ్లిపోయే వారు. మైలార్‌దేవ్‌పల్లితో పాటు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలా మూడు దొంగతనాలకు పాల్పడ్డారు. గతనెల మూడో వారంలో జరిగిన శుభకార్యంలో విందు నిర్వహించిన కుటుంబ సభ్యులు విలువైన వస్తువులతో పాటు నగదును ఓ బ్యాగ్‌లో వేసి స్టేజిపైనే ఉంచారు. ఈ శుభకార్యంలో పాల్గొన్న చిన్నారి చాకచక్యంగా దానిని తీసుకోని ఉడాయించింది. విందులో ఏర్పాటు చేసిన వీడియో కెమెరాలో చిన్నారి బ్యాగ్ తీసుకువెళ్లిన సంఘటన రికార్డయ్యింది. కుటుంబ సభ్యులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శంషాబాద్ ఎస్ఓటీ సహాయాన్ని కోరారు. ఆ రోజు ఫంక్షన్‌హాల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు బయటకు వెళ్లిన వాహనాల పూర్తి వివరాలను సేకరించి బుధవారం నిందితులైన ఇద్దరు యువకులు, మహిళ, చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐ20 కారు, నాలుగు సెల్ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించారు. -
దొంగను పట్టించిన బైక్ పెనాల్టీ
మందమర్రిరూరల్(చెన్నూర్): తోటి ఉద్యోగుల కుటుంబాలతో కలివిడిగా ఉంటూ వారు లేని సమయంలో వారి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగను బైక్ పెనాల్టీ పట్టించింది. పట్టుకుని ముప్పై రెండున్నర తులాల బంగారాన్ని, బైక్‌ను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో దేవపూర్ ఎస్సై దేవయ్య, కాసిపేట ఎస్సై భాస్కర్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మందమర్రిలోని సర్కిల్ ఇన్సపెక్టర్ కార్యాలమంలో ఏసీపీ బాలుజాదవ్ సమక్షంలో శనివారం మంచిర్యాల డీసీపీ రక్షిత కే మూర్తి వివరించారు. వివరాల ప్రకారం... తూముల శ్రీకాంత్ (29) 2013 నుంచి దేవపూర్‌లోని సిమెంట్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. (ప్రస్తుతం వైజాక్‌లోని గాజువాకలో పని చేస్తున్నాడు). చదువుకున్న వాడు కావడంతో తోటి పనివారితో, వారి కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండేవాడు. ఈ క్రమంలో ఒక మిత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లిన సమయంలో వారి ఇంట్లోకి చొరబడి 17తులాల, మరోసారీ మరో మిత్రుడు కుటుంబ సభ్యులతో ఊరికి వెళ్లి నప్పుడు వారి ఇంట్లోని పదిహేనున్నర తులాల బంగారాన్ని దొంగిలించాడు. బాధితుల దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసినా శ్రీకాంత్ మీద మాత్రం ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త బడ్డారు. ఈ విషయం ఇలా ఉంటే అదే కంపేనీలో పని చేసే మరో మిత్రుని ద్విచక్ర వాహనం కూడా దొంగిలించి కరీంనగర్ ప్రాంత వాసికి అప్పగించగా ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న వ్వక్తి చేసిన తప్పిదం వలన రిజిస్ట్రేషన్ ఉన్న కంపెనీ ఉద్యోగి ఇంటికి (దేవాపూర్) ఫెనాల్టి రసీదు వచ్చింది. అప్పటికే వరుస దొంగతనాలు జరుగుతున్నందున్న బాధితులతో టచ్‌లోని ఎస్సై దేవయ్యకు బాధితుడు ఫెనాల్టీ రసీదు చూపించగా దాని లొకేషన్ వివరాలు ఆరా తీసారు. శనివారం సోమగూడం ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా శ్రీకాంత్ అనుమానంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో దొంగతనం గురించి వివరించాడు. ఈ కేసును చేధించిన సీఐ, దేవాపూర్ ఎస్సైలను డీజీపీ అభినందించారు. -
నకిలీ బంగారం ఉచ్చువేసి.. ఆపై చిత్తు
సాక్షి, నెల్లూరు: మాటలునేర్చిన మాయగాళ్లు వారు. అమాయకంగా కన్పించేలా నటిస్తారు. మాటల గారడితో దగ్గరవుతారు. అడవిలో పట్టే కముజు పిట్టలను విక్రయిస్తుంటారు. రోజుకోసారి వచ్చి మంచి అడవి కముజు పిట్ట ఉచ్చులో పడింది ఆ మాంసం తినండి సారూ అంటూ చెబుతారు. ఎదుటి మనిషి మాటలను బట్టి వారిలో అత్యాశ ఉందని గ్రహిస్తారు. వారి దగ్గరవుతున్నట్లు ప్రేమ ఒలకబోస్తూ వారి ఫోన్ నంబర్లు తీసుకుంటారు. వారం తర్వాత సారూ.. రాజుల కాలం నాటి బంగారు నగలు తవ్వకాల్లో దొరికాయని, మాకు ఎలా విక్రయించాలో తెలియదని? అవి సగం ధరకే అమ్మిపెట్టమని మొదట కొంత బంగారం నగలు ఇచ్చి నమ్మిస్తారు. వారి మాటలు నమ్మారో అంతే ఫేక్బంగారం అంటగట్టి రూ.లక్షల్లో దోచుకుంటారు. ఇలాంటి అంతర్జిల్లా కేటుగాళ్లు ప్రస్తుతం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తిరుగుతున్నారు. వారి మాయమాటలు నమ్మి లక్షలు పోగొట్టుకున్న సంఘటనలు ఒక నెలలోనే రెండు వెలుగులోకి వచ్చాయి. మోసం చేసేది ఇలా.. అడవిలో తిరిగే కముజు పిట్టలను పట్టి విక్రయించే ముఠా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తిరుగుతోంది. కొందరు యువకులు కముజు పిట్టలను పట్టి విక్రయిస్తామంటూ ఊరూర తిరుగుతూ వ్యవసాయం చేసుకునే కొందరిని టార్గెట్ చేస్తున్నారు. రోజు వారీగా పిట్టలను పట్టి రైతులకివ్వడం వారిని మంచి చేసుకుంటారు. అలా కొందరు అమాయక వ్యక్తులతో మాటలు కలిపి వారితో స్నేహంగా ఉంటారు. స్నేహం ముసుగులో వారి ఫోన్ నంబర్లు సేకరిస్తారు. రోజువారీగా కముజుపిట్టలను పట్టి పిట్ట మాంసం మంచిదన్న తినండి అంటూ వారిపై ప్రేమ ఒలకపోస్తారు. అలా నమ్మించే ఆ ముఠా సభ్యులు వారం కన్పించకుండాపోయి ఫోన్లోనే టచ్‌లో ఉంటారు. ఆపై మెల్లిగా పక్కా ప్లాన్‌తో ఫోన్‌చేసి కర్ణాటక ప్రాంతంలోని మైసూర్ ఏరియాలో మా స్నేహితుడు జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని చెబుతారు. పురాతన భవనం తవ్వుతుంటే రాజుల కాలం నాటి బంగారు ఆభరణాలు దొరికాయని నమ్మబలుకుతారు. కానీ ఆ బంగారం విక్రయించాలంటే మాకు ఎవరూ తెలియదని? వాటిని విక్రయించిపెడితే అందులో కొంత కమిషన్ ఇస్తామంటూ చెబుతారు. ముందుగా బంగారు ఆభరణాలు ఉన్నాయని, వచ్చి పరిశీలించుకోమని నమ్మిస్తారు. వారి మాటలను నమ్మిన వెళ్లిన వారికి ఫేక్ బంగారం నగలు చూపించి అందులో నాలుగుచోట్ల స్వచ్ఛ బంగారం పూసలు పెట్టి వారి ముందే ఆ పూసలు కట్‌చేసి పరిశీలించుకోమని నమ్మబలుకుతారు. ఆ బంగారు పూసలు తీసుకెళ్లి షాపులో చూపిస్తే మేలిమి బంగారమేనని తేలుతుంది. అంతే సగం ధరకే మేలిమి బంగారు ఆభరణాలు వస్తాయని నమ్మి కేటుగాళ్లకు డబ్బు కట్టి తీసుకుంటారు. ఆపై ఆ ముఠా సభ్యుల ఫోన్ నంబర్ మూగబోతుంది. నగలు ఇంటికి తీసుకెళ్లి మళ్లీ పరిశీలించుకుంటే అది ఫేక్ బంగారం తెలిసిపోయి బాధితులు లబోదిబోమంటున్నారు. నెలలో రెండు సంఘటనలు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను టార్గెట్ చేసిన ఆ ముఠా సభ్యులు ఒక నెల వ్యవధిలోనే రెండు జిల్లాలో బురిడీ కొట్టించి రూ.లక్షలు దోచుకున్నారు. గత నెలలో సంగం మండల కేంద్రంలో ఇదే తరహాలో నకిలీ బంగారం అంటగట్టి రూ.లక్షలు కొట్టేసిన ఇద్దరు సభ్యులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సంగంలో కేబుల్ యజమానిని ఇదే తరహాలో బురిడీ కొట్టించి మోసం చేసి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన సింగరాయకొండ వాసులకు కూడా మరో ముగ్గురు సభ్యులు బురిడీకొట్టి నకిలీ బంగారం అంటగట్టి దాదాపు రూ.18 లక్షల నగదుతో ఉడాయించారు. అయితే నకిలీ బంగారం లావాదేవీలు కావలి కేంద్రంగా జరగడంతో బాధితులు కావలి పోలీసులను ఆశ్రయించారు. రాయచోటి వాసులుగా గుర్తింపు నకిలీ బంగారం ఉచ్చువేసి సొమ్ము చేసుకునే ముఠా సభ్యులు రాయచోటి ప్రాంత వాసులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ ముఠా విడిపోయి జిల్లాలవారీగా తిరుగుతూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. వారి నకిలీ బంగారం ఉచ్చులో చిక్కుకున్న చాలామంది బయటకు పొక్కితే పరువుపోతుందని చెప్పుకోలేక పోతున్నారు. తాజాగా ఈ రెండు సంఘటనలతో పోలీసులు ఇలాంటి వారి పట్ల జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు. -
నకిలీ పోలీసుల హల్చల్
సాక్షి, టెక్కలి రూరల్: నియోజకవర్గ కేంద్రం టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి కొడ్రవీధి జంక్షన్ వద్ద ఆదివారం పట్టపగలే నడిరోడ్డుపై వృద్ధురాలి వద్ద పోలీసుల పేరుతో(నకిలీ పోలీసులు) ఇద్దరు వ్యక్తులు బంగారాన్ని తరస్కరించారు. సీనీ ఫక్కీలో జరిగిన ఈ చోరీపై వృద్ధురాలు దండా హేమలత తెలిపిన వివరాల ప్రకారం.. హేమలత టెక్కలి మెయిన్ రోడ్డులో నివాసముంటుంది. బంధువుల ఇంటికి కొడ్రవీధి నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె ముందు ఆగారు. తాము పోలీసులమంటూ వారి దగ్గరున్న డమ్మీ ఐడీ కార్డు చూపించారు. మెడలో అంత బంగారం వేసుకోని తిరగవద్దని, ఈ ప్రాంతంలో దొంగలు ఉన్నారని చెప్పారు. బంగారమంతా తీసి ఆమెతో తెచ్చుకున్న బ్యాగ్‌లో పెట్టుకోమని చెప్పారు. ఆమె అనుమానంగా చూడటంతో వీధిలోంచి మరో వ్యక్తి వచ్చాడు. అతనికి కూడా అలాగే చెప్పారు. అతను తన చైన్, బంగార వస్తులు, డబ్బులు బ్యాగ్‌లో పెట్టుకోని వెళ్లిపోయాడు. అతనిని అనుసరిస్తూ ఆమె కూడా అదేవిధంగా తాళిబొట్టు, చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు తీసి బ్యాగ్‌లో పెట్టింది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బంగారం అంతా భద్రంగా ఉందో, లేదో చూస్తానని బ్యాగ్ అడిగాడు. వస్తువులన్నీ సరిగానే ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి ఆమెను పంపించేశారు. ఇంటికి వెళ్లి తాళి, గాజు లు వేసుకోడానికి బ్యాగ్ చూసేసరికి అందులో ఆ వస్తువులు కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై టెక్కలి సీఐ నీలయ్య బాధితురాలు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేతి గాజులు, తాళిబొట్టు కలిపి సుమారు 5 తులాలు ఉంటాయని బాధితురాలు రోదిస్తోంది. సీఐ నీలయ్య, ఎస్ఐ గణేష్‌లు ఘటన స్థలానికి చేరుకొని స్థానికుల వద్ద వివరాలు సేకరించారు. బాధితురాలు హేమలత, భర్త శ్రీరామ్మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోచోట విఫలయత్నం.. పై ఘటన జరగక ముందు గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు స్థానిక సంతోషిమాత గుడి సమీపంలో భవానీనగర్‌కు చెందిన విజయలక్ష్మి అనే మహిళను కూడా ఇలాగే నమ్మబలికారని పోలీసులు తెలిపారు. ఇక్కడ దొంగలు ఉన్నారని చెప్పారు. బంగారం తీసి దాచుకోవాలని సూచించడంతో ఆమె బంగారం అంతా తీసి తన చీరలో కట్టివేసింది. దీంతో చేసేది ఏమి లేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొంత సమయానికే వృద్ధురాలి వద్ద బంగారం అపహరించారు. -
బంగారు షాపులో భారీ చోరీ
పిట్లం (జుక్కల్): పిట్లం మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. బస్టాండ్ ప్రాంతంలో గల లక్ష్మీ ప్రసన్న బంగారు దుకాణంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి, సుమారు రూ.30 లక్షలకు పైగా విలువైన సొత్తును దోచుకెళ్లారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం రద్దీగా ఉండే రహదారి సమీపంలో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. పిట్లం గ్రామానికి చెందిన అవుసుల సుదర్శన్ చారి తన ఇద్దరు కుమారులతో కలిసి రెండేళ్లుగా బస్టాండ్ ఎదుట లక్ష్మీప్రసన్న జువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి వెళ్లారు. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో దుకాణం పక్కనే చాయ్ హోటల్ నిర్వహిస్తున్న రసూల్ తన హోటల్ వెనుక భాగం కిటికి తెరిచి ఉండటంతో పాటు బంగారు దుకాణానికి కన్నం వేసినట్లు గమనించి సుదర్శన్ కుమారుడు సంతోష్‌కు సమాచారమిచ్చాడు. హుటాహుటిన సంతోష్ షాప్‌కు వచ్చి షెట్టర్ తెరిచి చూడగా, లోపల సామగ్రి చిందరవందరగా కనిపించాయి. షాప్‌లోని బంగారు, వెండి ఆభరణాలు మాయమవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దొంగతనం జరిగిన ప్రాంతాన్ని అడిషనల్ ఎస్పీ అన్యోన్య, బాన్సువాడ డీఎస్పీ యాదగిరి, బాన్సువాడ రూరల్ సీఐ టాటాబాబు, బిచ్కుంద సీఐ నవీన్, ఎస్సైలు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. దొంగతనం చేయడంలో నైపుణ్యం ఉన్న వారే ఈ పని చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో దొంగతనం జరగడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షాప్‌లో ఉంచిన 433 గ్రాముల బంగారం, సుమారు 45 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ అన్యోన్య వెల్లడించారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ కేసును సవాల్‌గా తీసుకుంటున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే నైపుణ్యం ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చన్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ మస్తాన్ అలీ, పిట్లం, నిజాంసాగర్, పెద్దకొడప్గల్, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ ఎస్సైలు సుధాకర్, సాయన్న, నవీన్‌కుమార్, అభిలాష్, కృష్ణ, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. -
భారత సంతతి ఇళ్లే టార్గెట్
లండన్: బ్రిటన్‌లో బంగారం దొంగలు అత్యధికంగా భారత సంతతి ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు శనివారం ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. గత ఐదేళ్లలో రూ. 1,280 కోట్ల విలువైన బంగారం బ్రిటన్‌లో చోరికి గురైందనీ, అందులో అత్యధికం భారత సంతతి ప్రజలదేనని బీబీసీ పరిశోధనలో తేలింది. 2013 నుంచి చూస్తే 28 వేల బంగారం దొంగతనాలు జరిగాయి. గత ఐదేళ్లలో గ్రేటర్ లండన్‌లో రూ. 1,050 కోట్ల విలువైన బంగారం దొంగతనానికి గురయ్యింది. ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా బంగారం ఎంతున్నా దొంగలు కొట్టేస్తున్నారనీ, బంగారాన్ని చాలా తక్కువ సమయంలో, చాలా సులువుగా నగదుగా మార్చుకునే అవకాశం ఉండటం ఇందుకు ఓ కారణమని పోలీసులు భావిస్తున్నారు. చెషైర్ పోలీస్ దళంలో నేరాల విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆరోన్ దుగ్గన్ అనే అధికారి మాట్లాడుతూ ‘సెకండ్ హ్యాండ్ నగలు కొనే వ్యాపారులు అమ్ముతున్న వ్యక్తి ఎవరు? ఆ నగలు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? అని తెలుసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. ఈ దేశంలో బంగారం తునక ముక్కలు అమ్మడం కన్నా సెకండ్ హ్యాండ్ నగలు అమ్మడమే సులభం’ అని తెలిపారు. దసరా, దీపావళి సమయాల్లోనే ఎక్కువ దీపావళి, దసరా తదితర భారత ప్రధాన పండుగల సమయంలో ప్రజలు బంగారం ఎక్కువగా ధరించి ఆలయాలు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తారనీ, ఆ పండుగల సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని లండన్ పోలీసులు అంటున్నారు. ప్రతీ ఏడాది ఈ పండుగల సమయంలో తాము హెచ్చరికలు కూడా చేస్తామన్నారు. 2017–18లో లండన్‌లోనే 3,300 దొంగతనాలు జరిగాయి. రూ. 193 కోట్ల విలువైన బంగారం చోరీకి గురయ్యింది. పశ్చిమ లండన్‌లోని సౌథాల్‌లో ఆసియా స్టైల్ బంగారం నగలు అమ్మే సంజయ్ కుమార్ మాట్లాడుతూ బంగా>రం ఆభరణాలకు సంప్రదాయాల పరంగా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవాలనీ, బీమా కూడా చేయించుకోవాలని తానెప్పుడూ తన దగ్గర బంగారం కొనేవారికి చెబుతుంటానని ఆయన తెలిపారు. ‘బంగారం కొనడమంటే పెట్టుబడి పెట్టడమనీ, అది అదృష్టాన్ని కూడా తెస్తుందని పిల్లలకు వారి తల్లిదండ్రులు చెబుతారు. ఆసియా ప్రజలు ఇదే చేస్తారు. వాళ్లు ఇక్కడకొచ్చినా ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు’ అని సంజయ్ కుమార్ వివరించారు. బంగారు ఆభరణాలు కేవలం విలువైనవేగాక, వాటి యజమానులకు వాటితో ప్రత్యేక అనుబంధం ఉంటుందనీ, అవి పోయినప్పుడు యజమానుల మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని లండన్ పోలీసు విభాగంలో డిటెక్టివ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లీసా కీలే చెప్పారు. తమ చర్యల కారణంగా ఈ దొంగతనాలు కొంచెం తగ్గాయనీ, అయినా చేయాల్సింది ఇంకెంతో ఉందని ఆమె తెలిపారు. బంగారం దొంగలను పట్టుకోడానికి, దొంగతనాల సంఖ్యను తగ్గించడానికి లండన్ పోలీసులు ప్రత్యేకంగా ‘ఆపరేషన్ నగ్గెట్’ పేరిట ఓ∙కార్యక్రమాన్ని సైతం ఆచరణలోకి తెచ్చారు. -
చెన్నైలో చోరీచేసి రైలులో పరార్
సాక్షి,విజయవాడ: చెన్నైలోని ఒక బంగారం వ్యాపారి ఇంట్లో రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను చోరీ చేసి పరారవుతున్న ఇద్దరు దొంగలను విజయవాడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బంగారం, వెండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హంసరాజ్ సింగ్ (27), హరీంద్రసింగ్ (26) చెన్నైలో చోరీ చేసి రైలులో విజయవాడ వైపు పారిపోతున్నారని చెన్నై జాయింట్ కమిషనర్ నుంచి రైల్వే సీనియర్ డీఎస్పీ ఎస్‌ఆర్‌గాంధీకి మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. దొంగల ఫోన్‌ను ట్రాకింగ్ చేయడం ద్వారా చెన్నై నుంచి వచ్చే మూడు రైళ్లలో దొంగలు వచ్చే అవకాశం ఉందని భావించారు. గూడూరులోని రైల్వే పోలీసులు తనిఖీలు చేసి 2 రైళ్లలో దొంగలు లేరని నిర్ధరించుకున్నారు. సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ (12651)లో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్నారు. రంగంలోకి విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు చెన్నై బయలుదేరితే విజయవాడ వరకు ఆగదు. విజయవాడలో దొంగలు తప్పించుకునే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి రైలు తెనాలిలో కొన్ని క్షణాలు ఆపించి రైల్వే ఆర్పీఎఫ్ స్పెషల్ టీమ్‌ను రైలులోకి ఎక్కించారు. వీరు మూడు బృందాలుగా విడిపోయి ప్రతిబోగీని తనిఖీ చేశారు. చివరికి దొంగలను గుర్తించి రైలు విజయవాడకు చేరగానే అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5 కోట్ల విలువైన 13.5 కేజీల బంగారం, 67 కేజీల వెండి, 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి చెన్నై పోలీసులకు అప్పగించారు. దేశ రైల్వే చరిత్రలోనే అతి పెద్ద రికవరీల్లో ఇది ఒకటని అధికారులు చెబుతున్నారు. -
సర్ఫ్ ప్యాకెట్లు అమ్మేవాళ్లమంటూ..
పార్వతీపురం : మత్తుమందు చల్లి మహిళ మెడలోని బంగారు ఆభరణాలు దోచుకున్న సంఘటన పార్వతీపురం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని ముత్తావారివీధికి చెందిన ఓ మహిళ ఇంటికి కొంతమంది వ్యక్తులు సర్ఫ్ అమ్మే వ్యక్తులుగా వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలు భోగి విజయలక్ష్మి తెలియజేసిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు బంగారం, వెండి, ఇత్తడి, తదితర వస్తువులకు మెరుగు పెట్టే సర్ఫ్ ఉందని చెప్పారు. దీంతో బాధితురాలు వారిని ఇంటిలోకి రమ్మంది. ఇంతలో తమకు దాహం వేస్తుందని మంచినీరు కావాలని అపరిచిత వ్యక్తులు మహిళను కోరారు. ఇంటిలో నుంచి మంచినీరు తెచ్చేలోపు ఆమె వెనుకాల వెళ్లి ముక్కు వద్ద మత్తు మందు పెట్టి 3 తులాల బంగారం పుస్తులతాడు, 3 తులాల బంగారం చైన్, 2 తులాల బంగారం గాజులను తీసుకొని పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత మత్తు నుంచి బయటపడిన బాధితురాలు లబోదిబోమంటూ విషయాన్ని తన భర్త చక్రధర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. ఆయన సూచన మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
చిదంబరం ఇంట్లో భారీ చోరీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు తెలిసింది. కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ కేసులో ఇద్దరు పనిమనుషులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దొంగతనం జరిగిందని తొలుత చేసిన ఫిర్యాదును చిదంబరం భార్య నళిని చిదంబరం ఆదివారం రాత్రి వెనక్కి తీసుకోవడం గమనార్హం. తమ నివాసంలో ఎలాంటి దొంగతనం జరగలేదన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం...చెన్నై నుంగంబాక్కం ఫైవ్‌క్రాఫ్ట్స్ రోడ్డులోని ఇంట్లో చిదంబరం, భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధి నివసిస్తున్నారు. ఓ కార్యక్రమానికి వెళ్లడానికి ముందు నగలు అలంకరించుకునేందుకు నళిని శనివారం తన గదిలోని బీరువా తెరచిచూడగా అందులో పెట్టిన పురాతన మరకతాలు, బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా, వారు ఇంటి ప్రాంగణంలో అమర్చిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుమారు నెల క్రితం ఇద్దరు మహిళలు ముఖాలకు ముసుగేసుకుని నళిని గదిలోకి వెళ్లడం, కొద్దిసేపటి తరువాత ఒక సంచితో బయటకు వచ్చిన దృశ్యాలు అందులో నమోదయ్యాయి. వాటిలోని వ్యక్తుల రూపురేఖల ఆధారంగా, చిదంబరం ఇంట్లో పనిచేస్తున్న వెన్నెల, విజిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఉద్యోగం దొరకలేదని చోరీ
సాక్షి,అన్నానగర్ : ఉద్యోగం దొరకలేదని విరక్తితో ఎంబీఏ పట్టభద్రుడు 12 సవర్ల నగలను చోరీ చేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై తిరువికనగర్ ప్రభు వీధికి చెందిన అరివళగన్. ఇతను కుటుంబంతో మంగళవారం బయటికి వెళ్లి ఇంటికి వచ్చాడు. అప్పుడు తలుపులు తెరచి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 12 సవర్ల నగలు చోరీ అయినట్టు తెలిసింది. అరివళగన్ తిరువికనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సహాయ కమిషనర్ హరికుమార్ ఆధ్వర్యంలో సీఐ రమణి, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశారు. అప్పుడు బీరువాలో ఉన్న రూ. 70వేలు నగదు చోరీకి గురికాలేదు. దీంతో అరివళగన్‌కి తెలిసిన వారు ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు. బాడుగకు ఉన్నవారి వద్ద పోలీసులు విచారణ చేశారు. అప్పుడు తూత్తుకుడి జిల్లా ఉడన్‌కుడికి చెందిన ఇళమదిని పోలీసులు విచారణ చేశారు. విచారణలో అతను నగలు చోరీ చేసినట్లు నేరం అంగీకరించాడు. పోలీసుల విచారణలో ఇళమది ఎంబీఏ చదివి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఇతను అరిశలగన్ ఇంట్లో మూడు నెలల ముందు బాడుగకు చేరాడు. అరివళగన్ లగ్జరీ జీవితం చూసిన ఇళమది అతని ఇంట్లో చోరీ చేయాలని పథకం వేశాడు. దీని ప్రకారం మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగలను చోరీ చేసిన ఇళమది వాటిని తన భార్యకు ఇచ్చాడు. భార్య మందలిచ్చి తీసిన స్థలంలో నగలను పెట్టాలని బుద్ధి చెప్పింది. నగలను బీరువాలో పెట్టడానికి ఇళమది వెళ్లేలోపు అరివళగన్ వచ్చాడు. దీంతో నగలను ఓ బంధువు వద్ద ఇచ్చి ఇళమది ఇంటికి వచ్చాడు. ఫిర్యాదు ఇచ్చిన ఆరుగంటల సమయంలోనే ఇళమదిని అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
అక్రమార్జనలో రారాజు
సాక్షి, విశాఖ క్రైం : మున్సిపాలిటీలో వెలుగులు నింపాల్సిన ఆ అధికారి అవినీతి మురుగులో పీకల్లోతున కూరుకుపోయాడు. ఉద్యోగంలో చేరింది మొదలు... అందినకాడికి వెనకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగడంతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టేశాడు. ఎట్టకేలకు పాపం పండడంతో అక్రమార్జనలో రారాజుగా వెలుగొందిన శ్రీకాకుళం మున్సిపాలిటీ డీఈఈ గొట్టిముక్కల శ్రీనివాసరాజుతోపాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకకాలంలో సోదాలు చేసి రూ.30 కోట్లకు పైగా అక్రమాస్తులు వెనకేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర వెల్లడించారు. బంగారమే బంగారం శ్రీనివాసరాజు ఇంటిలో సోదాల సమయంలో 423.3గ్రాముల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు అక్కయ్యపాలెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని లాకర్లో భార్య పేరు మీద 151.78గ్రాములు బంగారు వస్తువులు, డాబాగార్డెన్స్‌లో గల బ్యాంకు ఆఫ్ ఇండియాలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద లాకర్లో 221.970 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 795 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలు గుర్తించారు. 1548 గ్రాముల వెంటి వస్తువులు లభ్యమయ్యాయి. అదేవిధంగా నగదు రూ.12 లక్షల 27వేలు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.5లక్షల 45 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వం ధర ప్రకారం రూ.1.64కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ మాత్రం రూ.30 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. గుర్తించిన అక్రమాస్తులివీ... విశాఖ నగర పరిధిలోని సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్స్న్ దరి పాపాహోం సమీపంలో గల ఆర్.ఆర్.రెసిడెన్సీలోని ప్లాట్ నెంబర్ 302లో శ్రీనివాసరాజు నివాసముంటున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోవలి గ్రామంలో ఎక్కువగా శ్రీనివాసరాజు భూమి కొనుగోలు చేశారు. తొలిసారిగా ఈ గ్రామంలో 6.82 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. అదే గ్రామంలో 7.2 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తల్లి జి.స్వరాజ్యం పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 417/1, 418/1లో 3.19 ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో తండ్రి జి.కృష్ణంరాజు పేరు మీద సర్వే నెంబర్ 417/2, 449/2లలో వ్యవసాయ భూమి 2.69 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాస రాజు మామయ్య వి.నారాయణరాజు పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 416/1లో 2.49ఎకరాల వ్యవసాయ భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో సర్వే నెంబర్ 416/52, 416/3, 417 – 1,418 లో 4.71 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాసరాజు అత్తమ్మ వి.వరలక్ష్మి పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 887/1, 887/2లో 3.6ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నర్శింహపురం గ్రామంలో భార్య పేరిట సర్వే నెంబర్ 75/2లో 697.44 గజాల స్థలం. అదే గ్రామంలోని సర్వే నెంబర్ 75/2లో ఖాళీ స్ధలం 7.20 ఎకరాలను కుమార్తె జి.మౌనిక పేరు మీద కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెద్ద అమిరాం గ్రామంలో భార్య రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 487/1, 487/2, 487/2బిలలో 697.44 గజాల స్థలం. విశాఖ జిల్లా అడవివరం గ్రామంలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 275 / 30 – ఎలో 183 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. అలాగే శ్రీనివాస రాజు రెండు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సర్వీసులో 25 ఏళ్లకుపైగా జీవీఎంసీలోనే అవినీతి ఊబిలో కూరుకుపోయిన శ్రీనివాసరాజు తన సర్వీసులో ఎక్కువ కాలంలో జీవీఎంసీలోనే తిష్ట వేశారు. బదిలీపై వెళ్లినప్పటికీ మళ్లీ వెంటనే వెనక్కు వచ్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని వెంప గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు జీవీఎంసీలో 1988లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. అనంతరం 2000వ సంవత్సరంలో ఏఈగా ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి 2012 వరకు జీవీఎంసీలో ఏఈగా పనిచేశారు. 2012లో బొబ్బిలి మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. అక్కడ 18 నెలలు పని చేసి మళ్లీ ఏఈగా జీవీఎంసీకి బదిలీపై వచ్చారు. అనంతరం 2017లో ఉద్యోగోన్నతి రావడంతో శ్రీకాకుళం మున్సిపాలిటీకి డీఈఈగా వెళ్లారు. అయితే జీవీఎంసీలో పనిచేసిన కాలంలో కొందరు అధికారులతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఓ ప్రజాప్రతినిధితో కలిసి బినామీల పేరున భారీగా పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బినామీల గుట్టు విప్పేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : అంతర్ జిల్లా దొంగ రాపాక గిరిబాబు అలియాస్ గిరి ప్రసాద్ అలియాస్ యాదగిరిని సీసీఎస్, టౌన్, తొర్రూరు పోలీసులు అరెస్ట్ చేసి, దొంగిలించిన 30 తులాల బంగా రం, కేజీ 30 గ్రాముల వెండి ఆభరణాలు, ఆటో, రూ.80వేల నగదు (మొత్తం సొత్తు విలువ రూ. 10.50 లక్షలు)ను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మంగళవారం సాయంత్రం అరెస్ట్ వివరాలు వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఎలా చేధించగలిగారో ప్రొజెక్టర్ ద్వారా చూపించి వివరించారు. మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో పగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రి పూట వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను సీసీ కెమెరాల్లో రికార్డయిన ఛాయా చిత్రాల ద్వారా గుర్తిం చామన్నారు. దీంతో మహబూబాబాద్ టౌన్ సీఐ షేక్ అబ్దుల్ జబ్బార్, సీసీఎస్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు అంతర్ జిల్లా దొంగ అయిన రాపాక గిరిబాబును తొర్రూరు నుంచి మహబూబాబాద్‌కు వస్తుండగా మూడుకోట్ల సెంటర్ వద్ద పట్టుకున్నారని తెలిపారు. మానుకోటలోని తొర్రూరు రోడ్లో గల వాటర్‌ట్యాంక్ వద్ద ఉంటూ పండ్ల వ్యాపారం చేసే రాపాక గిరిబాబును పోలీసులు విచారించగా మహబూబాబాద్, తొర్రూరు, ఖమ్మం, పాల్వంచ ప్రాం తాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడన్నా రు. చోరీ ద్వారా సంపాదించిన బంగారు వస్తువులను దాచిపెట్టి వాటిని మహబూబాబాద్ పట్టణంలో రహస్యంగా అమ్మాలని వచ్చినట్లు, తాను చేసి న నేరాలన్నింటినీ అంగీకరించాడని తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై.. రాపాక గిరిబాబు 5వ తరగతి వరకు చదువుకుని ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చిన డబ్బులు సరిపోక చెడు అలావాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని దొంగతనాన్ని వృత్తిగా చేసుకున్నాడు. మొదటగా నాలుగేళ్ల క్రితం ఖమ్మంలో ఆటో దొంగతనం కేసులో అరెస్టై జైలు జీవితం గడిపాడు. ఆ తరువాత కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మళ్లీ కొద్దిరోజులకు రెండోసారి పాల్వంచలో ఆటో దొంగతనానికి పాల్పడి అరెస్ట్ అయ్యాడు. అనంతరం జైలు నుంచి విడుదలై మహబూబాబాద్ గిరిబాబు అత్తగారి ఊరు కావడంతో ఇక్కడే ఉంటూ మధ్యాహ్నం పళ్ల వ్యాపారం చేస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. మానుకోటలో 7,తొర్రూరులో 3 దొంగతనాలు.. సుమారు 6 నెలల క్రితం మహబూబాబాద్‌లోని వెంకటేశ్వర బజార్లో ఓ ఇంటి ముందు తాళం వేసి ఉన్న ఆటోను దొంగిలించాడు. తరువాత సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో గిరిబాబు దొంగతనం చేయడానికి అనుకూలమైన పనిముట్లను జనగామ నుంచి తయారు చేయించుకున్నాడు. దీంతో మహబూబాబాద్‌లోని కృష్ణకాలనీ, సిద్ధార్థనగర్, వెంకటేశ్వరబజార్, కంకరబోడ్ ప్రాంతాల్లో మొత్తం 7 దొంగతనాలు చేశాడు. అనంతరం తొర్రూరు పట్టణంలో మూడు దొంగతనాలు చేశాడు.అధికారులు, సిబ్బందికి ఎస్పీ అభినందనలు..అంతర్ జిల్లా నేరస్తుడు రాపాక గిరిబాబును చాకచక్యంగా పట్టుకుని అతని వద్ద నుంచి సొత్తు ను రికవరీ చేసిన మహబూబాబాద్ టౌన్ ఎస్హెచ్ఓ ఎస్.ఏ జబ్బార్, తొర్రూరు సీఐ వి.చేరాలు, సీసీఎస్ ఎస్సై జి.స్వామిదాస్, సీసీఎస్ ఏఎస్సై పి.వెంకటరమణ, పీసీ సీహెచ్ వేణుగోపాల్, అలాగే నేరస్తుడిని సీసీ కెమెరాల ద్వా రా గుర్తించిన ఐటీకోర్ సీఐ శ్యాంసుందర్, పీసీ లు నాగరాజు, సంతోష్‌కుమార్‌ను ఎస్పీ నంద్యా ల కోటిరెడ్డి అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, మహబూబాబాద్, తొర్రూరు డీఎస్పీలు నరేష్కుమార్, రాజారత్నం, సీఐలు జబ్బార్, చేరాలు, సీసీఎస్ ఎస్సై జి.స్వామిదాస్, ఏఎస్సై పి.వెంకటరమణ, ఐటీకోర్ సీఐ శ్యాంసుందర్, టౌన్, ట్రాఫిక్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, అరుణ్‌కుమార్, రమేష్‌బాబు, అశోక్, పీసీలు వేణుగోపా ల్, నాగరాజు, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. -
ఐదుగురు బైక్ దొంగల అరెస్టు
సాక్షి, గుటూరు : విలాసాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి బైకుల మీద తిరుగుతూ దోపిడీలకు పాల్పడే ఐదుగురి యువకులను తెనాలి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బులు జల్సాలకు సరిపడవని చోరీలకు పాల్పతుండేవారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని వారిని బెదిరిస్తూ వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్ఫోన్లు లాక్కెళ్తుంటారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి మూడు బైకులు, ఒక బంగారు గొలుసు, నాలుగు సెల్పోన్లు స్వాధినం చేసుకునట్లు పోలీసులు తెలిపారు. -
ఏసీబీ గాలానికి చిక్కిన ఇంజనీర్..
సాక్షి, గుంటూరు : పట్టణంలో మరో అవినీతి అధికారి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు ఏసీబీ అధికారులు. ఏఓగా పనిచేస్తున్న మధవరావు అక్రమాస్తుల చిట్టా ఒక్కక్కటిగా విప్పారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం ఇతనికి ఇరవై విలువైన ఇళ్ల స్థలాలు, నాలుగు నివాస గృహాలకు సంబంధించిన రికార్డులను గుర్తించారు. అంతేకాక ఏడు లక్షల రుపాయల నగదు, పెద్దఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం దాదాపు ఆరు కోట్ల రుపాయలు. ఏకకాలంలో ఇతని బంధువుల ఇంటిపై కూడా అధికారులు దాడి చేశారు. పొన్నూరు మండలం మాచవరంలో ఇతని బినామీ చిట్టిబాబు ఇంట్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. -
మానుకోటలో దొంగల బీభత్సం
మహబూబాబాద్ రూరల్ : చోరీ జరిగి 45.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.47వేల నగదు అపహరణకు గురైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు వేర్వేరు చోట్ల చోట్ల జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన జడల లక్ష్మిరేణుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కళాసీబస్తీ ఎంపీపీఎస్‌లో క్లర్క్‌గా పని చేస్తుంది. ఆమె సోదరుడు రిటైర్డ్ ఎస్సై బొగ్గుల సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించడంతో పరామర్శించడానికి గురువారం సాయంత్రం వరంగల్‌కు వెళ్లింది. ఆ రోజు రాత్రి ఆమె అక్కడే బస చేసింది. శుక్రవారం ఉదయం తిరిగి మానుకోటకు చేరుకుని గేట్ తీసే సరికి ఇంటికి వేసిన తాళం లేకుండా తలుపులు తెరిసి ఉండడం చూసింది. ఇంటి లోపలికి వెళ్లి చూసేసరికి రెండు బీరువాల్లోని దుస్తులు, ఇతర సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దొంగలు బీరువాల తలుపులు పగులకొట్టి 45.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.7 వేల నగదును దోసుకెళ్లినట్లు గ్రహించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. డీఎస్పీ ఆంగోత్ నరేష్కుమార్, టౌన్ సీఐ జబ్బార్, ఎస్సైలు అరుణ్‌కుమార్, రమేష్‌బాబు, సీసీఎస్ సీఐ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ తిరుపతి, ఐటీ కోర్ సీఐ శ్యాంసుందర్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్‌టీం బృందాలు డాగ్ స్క్వాడ్‌తో ఇంటి పరిసరాలను తనిఖీ చేశారు. అనంతరం బాధితులరాలు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ క్యాంప్ కార్యాలయం, టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. కిరాణ షాపులో రూ.40 వేల అపహరణ.. జిల్లా కేంద్రంలోని ఇల్లందు రోడ్డులోని కర్లపాటి నారాయణమూర్తికి చెందిన కిరాణ షాపులో చోరీ జరగగా రూ.40 వేలు అపహరణకు గురయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము 3 నుంచి 4 గంటల మధ్యలో ఓ యువకుడు బండరాయితో దుకాణం తలుపు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు సీసీ పుటేజ్‌లో రికార్డు అయింది. బాధితుడు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
4 కిలోల బంగారం దొంగ అరెస్టు
సాక్షి, నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్): వారం రోజుల క్రితం నాలుగు కిలోల బంగారంతో ఉడాయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 3.05 కిలోల బంగారం, 6 డైమండ్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌బెంగాల్ హుగ్లీ జిల్లా కుల్లత్ గ్రామానికి చెందిన భూపాల్ మన్నా ఆర్మూర్‌లో స్థిరపడ్డాడు. బంగారు అభరణాలు తయారు చేస్తూ, నమ్మకంగా ఉండడంతో బంగారు వ్యాపారులు కిలోల కొద్ది బంగారం ఇచ్చి అభరణాలు చేయించుకునే వారు. ఇలా ఆర్మూర్, నందిపేట్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన బంగారు వ్యాపారులు కలిసి నాలుగు కిలోల బంగారాన్ని ఇచ్చారు. పెద్ద మొత్తంలో బంగారం అతని వద్ద ఉండటంతో భూపాల్‌కు దురాలోచన కలిగింది. దీంతో నాలుగు రోజుల క్రితం బంగారంతో ఉడాయించాడు. అయితే, ఆభరణాలు చేయాలని బంగారం ఇచ్చిన జక్రాన్‌పల్లి మండలం మునిపల్లికి చెందిన వ్యాపారి ఆరే శివకుమార్ ఈ నెల 23న వెళ్లగా షాప్ మూసి ఉంది. మిగతా వ్యాపారులు కూడా అక్కడకు చేరుకోవడంతో భూపాల్ ఉడాయించినట్లు తేలింది. శివకుమార్ ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆర్మూర్ ఏసీపీ శివకుమార్ పర్యవేక్షణలో టౌన్ సీఐ సీతారాం, ఎస్సై గోపీ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్ మల్లేశ్ నాగ్‌పూర్ వెళ్లారు. నిందితుడు కటక్ వెళ్లినట్లు గుర్తించి అతడ్ని పట్టుకున్నారు. పోలీసుల ఎదుట తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇతడ్ని అరెస్టు చేసే ముందు ఆర్మూర్ పోలీసులు కటక్ మేజిస్ట్రేట్ ఎదుట శుక్రవారం హాజరు పరిచారు. అనంతరం అరెస్టు చేసి శనివారం ఆర్మూర్‌కు తీసుకువచ్చారు. నిందితుడి నుంచి 3.05 కిలో బంగారు అభరణాలు, 6 డైమండ్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
మహిళ దారుణ హత్య
బషీరాబాద్(తాండూరు) : కట్టుకున్నవాడు కాలం చేయడంతో పదిహేనేళ్లుగా ఒంటరిగా నివసిస్తున్న ఓ ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. హత్యకు ఒక రోజు ముందు బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరైన ఆమె.. అక్కా, చెళ్లెళ్లు బంధుమిత్రులతో సరదాగా గడిపారు. మర్నాడు సొంతూరికి రాగా.. అదే రోజు రాత్రి హత్యకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటన బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీవన్గీ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలంలో సంచలనం సృస్టించిన ఈ హత్యకు సంబంధించి తాండూరు గ్రామీణ సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీవన్గీ గ్రామానికి చెందిన కుర్వ లక్ష్మీ(35)కి 2000 సంవత్సరంలో యాలాల మండలం కిష్టపూర్ గ్రామానికి చెందిన బీరప్పతో వివాహం జరిగింది. అయితే అన్నదమ్ముల గొడవలో 2004లో బీరప్ప హత్యకు గురయ్యాడు. దీంతో లక్ష్మీ కొడుకు మహేష్‌తో కలిసి పుట్టింటికి వచ్చింది. జీవన్గీ గ్రామంలోని బర్కాల్ కాలనీలో ఓ చిన్న ఇంట్లో ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. కొడుకు మహేష్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే రెండు రోజుల కిందట కొడంగల్ మండలం రేగడి మైలారం గ్రామంలో జరిగిన బంధువుల శుభకార్యానికి కొడుకుతో కలిసి వెళ్లింది. బంధువులు, అక్కాచెల్లెళ్లతో సరదాగా గడిపింది. తిరిగి ఈ నెల 25న(బుధవారం)కొడుకును బంధువుల దగ్గర పెట్టి జీవన్గీకి ఒంటరిగా వచ్చింది. అయితే తెల్లవారి చూసేసరికి లక్ష్మీ శవమై కనిపించింది. తల వెనుక భాగంలో గాయమై పడిఉంది. ఒంటిపైనున్న ఆభరణాలు, ఇంట్లో ఉన్న ఇనుప పెట్టె తీసి వస్తువులు, బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి. రంగంలోకి దిగిన క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ హత్య విషయం తెలుసుకున్న బషీరాబాద్ ఎస్సై లక్ష్మయ్య తన సిబ్బందితో కలిసి హుటాహుటిన జీవన్గీ చేరుకున్నాడు. సమాచారం అందుకున్న తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, గ్రామీణ సీఐ సైదిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య మిస్టరీగా మారడంతో పోలీసులు వికారాబాద్ నుంచి క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించారు. ఇంట్లో వస్తువులపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ గ్రామంలోని హతురాలి ఇంటి ముందు, ఓ హోటల్లోకి వెళ్లింది. కానీ ఎలాంటి క్లూ ఇవ్వలేకపోయింది. హత్యపై అనుమానాలు.. భర్త మరణానంతరం ఒంటరిగా జీవిస్తున్న లక్ష్మీ హత్య అనేక అనుమానాలకు తావిస్తోంది. జీవన్గీ బర్కాల్‌లో నివసించే ఆమె.. అదే కాలనీలో నివసించే సేవ్యానాయక్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. చాలా కాలంగా వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. అయితే ప్రియురాలు లక్ష్మీ ప్రవర్తన పట్ల అనుమానం పెంచుకున్న సేవ్యానాయక్ ఆమెను తరచూ కొట్టేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇదిలా ఉంటే లక్ష్మీ హత్య జరిగిన విషయాన్ని మొదట సేవ్యానాయక్ చూసి గ్రామస్తులకు తెలిపాడు. ప్రియుడు హత్య చేస్తే గ్రామస్తులకు ఎందుకు సమాచారం ఇస్తాడన్న ప్రశ్నలు తలెత్తాయి. దీంతోపాటు మృతురాలి శరీరంపై ఉన్న ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఇది దోపిడీ దొంగల పనా లేక తెలిసిన వారెవరైనా చేసిన హత్యా.. అనే కోణంలోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడే హంతకుడు? మృతురాలి తండ్రి బాలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీ ప్రియుడు సేవ్యానాయక్‌కు సీఐ సైదిరెడ్డి అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ప్రియుడే హత్యచేసి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ప్రియురాలిపై అనుమానంతో తరచూ ఆమెను హింసిస్తూ కొట్టేవాడని ఈ క్రమంలోనే బుధవారం రాత్రి గొడవ పడ్డారని, తోపులాటలో తలకు గాయమై చనిపోయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఫిర్యాదులో సేవ్యానాయక్ భార్య తిప్పి భాయి పేరును కూడా చేర్చారు. ఒకట్రెండు రోజుల్లో కేసును ఛేదించి పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని సీఐ పైదిరెడ్డి తెలిపారు. -
మదనపల్లెలో పట్టపగలు భారీ చోరీ
మదపసల్లె క్రైం : మదనపల్లె పట్టణంలో గురువారం పట్టపగలే దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. బీరువా లాకర్లను ధ్వంసంచేసి అందులో ఉన్న 300 గ్రాముల బంగారు నగలు, రూ.లక్ష నగదు అపహరించారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కదిరి రోడ్డు న్యాయమూర్తుల బంగ్లా సమీపంలో నివాసం ఉంటున్న పరుపుల వ్యాపారి దర్బార్‌బాషా, అతని భార్య దిల్షాద్ గురువారం ఉదయం ఇంటికి తాళం వేసుకుని ఎస్టేట్‌లో పరుపులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోనికి వెళ్లి పరిశీలించారు. బీరువాలు, కప్‌బోర్డులను పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఈ విషయమై వన్‌టౌన్ ఎస్ఐ సుమన్‌ను వివరణ కోరగా చోరీపై తమకు ఫిర్యాదు అందిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
అంతా పథకం ప్రకారమే..
గుత్తి : తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు, చే బదులుగా ఇచ్చిన నగదుతో ముత్తూట్ ఫిన్‌కార్ప్ మేనేజర్ రవికుమార్ ఉడాయించాడు. బాధితులు తమ సొమ్ము కోసం ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తిలోని ముత్తూట్ ఫిన్‌కార్ప్ మేనేజర్ రవికుమార్ తమవద్దకు వచ్చే ఖాతాదారులతో పరిచయం పెంచుకుని, వారిని తన బుట్టలో వేసుకున్నాడు. తనకు సంస్థ టార్గెట్ కేటాయిచిందని, మీ బం గారు ఆభరణాలు ఇస్తే.. తర్వాత తిరిగి ఇస్తానని తెలపడంతో దాదాపు 12 మంది అమాయకులు అతడి మాటలు నమ్మి 30 తులాలమేర ఆభరణాలతోపాటు, చేతి బదులు కింద రూ.5 లక్షల నగదు అప్పగించారు. అయితే వారికి ఎటువంటి రసీదూ మేనేజర్ ఇవ్వలేదు. అలా కొద్దిరోజులు గడిచాక తమ సొమ్ము తెచ్చుకునేందుకు కస్టమర్లు కార్యాలయం వద్దకు వస్తున్నారు. అయితే మేనేజర్ లేడని సిబ్బంది చెప్పి పంపుతూ ఉన్నారు. మేనేజర్ ఇంటికి తాళం పడి ఉండటం.. సెల్‌ఫోన్ స్విచాఫ్ కావడం, ఇరవై రోజులు దాటినా లేడని సిబ్బంది నుంచి సమాధానం వస్తుండటంతో ఓపిక నశించిన బాధిత కస్టమర్లు గౌరమ్మ, సరోజ, రంగయ్య(గుత్తి), నరసింహులు( గుత్తి ఆర్ఎస్), విరూపాక్షిరెడ్డి(ఇసురాళ్లపల్లి) మరికొంతమంది మంగళవారం కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ప్రస్తుత మేనేజర్ నౌషద్ స్పందించిత్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
కర్నూలులో కిలో బంగారం చోరీ