కరీంనగర్(వీనవంక): కరీంనగర్ జిల్లాలోని వీనవంక మండలంలోని గణుముక్కల గ్రామం నాగిడి శివారెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం, 40 తులాల వెండి నగలను ఎత్తుకెళ్లారు. ఈ నగలను పడక గదిలోని గోడకు రంధ్రం చేసి అందులో భద్రపరిచారు.
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఎత్తుకెళ్లారు. తెలిసిన వాళ్లే చేసుంటారని అనుమానిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానం వచ్చిన ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
10 తులాల బంగారం అపహరణ
Published Thu, Feb 5 2015 9:48 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM
Advertisement
Advertisement