నటుడి అల్లుడు ఇంట్లో 21 కేజీల బంగారం చోరీ | gold theft at Actor Doddanna relative home | Sakshi
Sakshi News home page

నటుడి అల్లుడు ఇంట్లో 21 కేజీల బంగారం చోరీ

Published Wed, Sep 13 2017 7:47 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

నటుడి అల్లుడు ఇంట్లో 21 కేజీల బంగారం చోరీ

నటుడి అల్లుడు ఇంట్లో 21 కేజీల బంగారం చోరీ

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో భారీ చోరీ చోటుచేసుకుంది. కోట్లాది రూపాయల విలువచేసే బంగారు బిస్కెట్లు, కడ్డీలను దొంగలు దోచుకెళ్లడం సంచలనం రేపుతోంది. కన్నడ నటుడు దొడ్డణ్ణ అల్లుడు కేసీ.వీరేంద్ర అలియాస్‌ పప్పి ఇంట్లో దొంగలు పడి 21 కేజీల బంగారు బిస్కెట్లు, కడ్డీలను దోచుకెళ్లారు. ఈ ఘటన చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరగ్గా ఆలస‍్యంగా వెలుగుచూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. చెళ్లకెరె పట్టణంలోని పాత టౌన్‌లో కేసీ.వీరేంద్ర నివాసముంటున్నారు.

సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దుండగులు ఇంటి తాళం బద్దలు చొరబడి లాకర్‌ను పగలగొట్టి అందులో ఉన్న రూ.6.30 కోట్ల విలువ చేసే 21 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అంతేగాక ఇతడి ఇంటికి వందమీటర్లు దూరంలో ఉన్న కేసీ.వీరేంద్ర సోదరుడు తిప్పేస్వామి ఇంటినీ వదల్లేదు. ఆ ఇంట్లోనూ చొరబడి లాకర్‌లో ఉన్న రూ.10.70 లక్షల నగదు అపహరించుకెళ్లారు. ఈ రెండు ఘటనలపై భాదితులు చెళ్లకెరె పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్ధలానికి డాగ్‌స్క్వాడ్, వేలిముద్ర నిపుణులతో పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకుని తనిఖీ చేసి దుండగుల ఆచూకీకోసం గాలింపు చేపట్టారు.

ఎస్పీ శ్రీనాథ్‌జోషి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానంతో ఇద్దరు పని మనుషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, గత కొద్దినెలల కిందట ఐటీ శాఖ దాడుల్లో కేసీ.వీరేంద్ర ఇంటి బాత్‌ రూమ్‌ గోడ సీక్రెట్‌ లాకర్‌లో దాచిపెట్టిన రూ.6 కోట్లు నగదు లబించిన విషయం తెలిసిందే. తాజా దోపిడీ ఆ కుటుంబానికి బాగా తెలిసినవారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement