హిందూపురం అర్బన్ : హిందూపురం రైల్వేస్టేషన్ శనివారం రాత్రి బెంగళూరు నుంచి వస్తున్న దంపతుల వద్ద 10 తులాలు బంగారు నగలు అపహరించుకుపోయినట్లు బాధితులు రాధాకృష్ణ, మమతలు వాపోయారు. బెంగళూరు నుంచి కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి 8 గంటల సమయంలో హిందూపురం రైల్వేస్టేషన్‌లో దిగారు. వీరిని అనుసరిస్తున్న దొంగ బంగారు నగలు కలిగిన బ్యాగ్‌ను లాక్కొని పరారు అయ్యాడు. దొంగను పట్టుకోవడానికి రాధాకృష్ణ ప్రయత్నించా ఫలితం లేకపోయింది. దీంతో రైల్వే పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయాన్ని తెలియజేసి కేసు నమోదు చేయాలని కోరారు. అయితే పోలీసులు ఎస్‌ఐ అందుబాటులో లేరని ఫిర్యాదు తీసుకోలేమని చెబుతున్నట్లు బాధితులు వాపోయారు.