
కాసేపట్లో పెళ్లి... వధువు నగలు మాయం
హిందూపురం: కాసేపట్లో పెళ్లి అనగా వధువు నగలు మాయం అయిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. 16 లక్షల రూపాయల విలువైన 60 తులాల బంగారం కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హిందూపురంలోని కంచి కామాక్షి కళ్యాణ మండపంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పెళ్లికూతుర్ని చేసిన తర్వాత గురువారం రాత్రి కళ్యాణ మండపంలో నిద్రపోయారు. ఈ ఉదయం లేచి నగల కోసం అవి కనిపించలేదు. అయితే తెలిసినవారే ఈ దొంగతనానికి పాల్పడ్డారా, బయటి నుంచి వచ్చిన దుండగులెవరైనా చోరీ చేశారా అనే దాని గురించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, నగలు లేకపోయినా పెళ్లి జరగడంతో వధువు తరపువారు ఊపిరి పీల్చుకున్నారు.