
ప్రతీకాత్మక చిత్రం
హిందూపురం(అనంతపురం): పట్టణ సమీపంలోని కొట్నూరు జాతీయ రహదారిపై ట్రాన్స్‌జెండర్ నిహారిక (35) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. హిందూపురం ఒకటో పట్టణ సీఐ బాలమద్దిలేటి సమాచారం మేరకు.. పరిగి మండలం యర్రగుంటపల్లి చెందిన ట్రాన్స్‌జెండర్ నిహారిక.. హిందూపురంలోని ఇందిరమ్మ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని భిక్షాటనతో జీవనం సాగిస్తోంది.
కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ ఆమెతో చనువుగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే నిహారిక తాను దాచుకున్న రూ. 3లక్షలను రాజశేఖర్‌కు అందజేసింది. శుక్రవారం రాత్రి కొట్నూరు జాతీయ రహదారిపై రాజశేఖర్, నిహారిక కలిసి మద్యం సేవించి, ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో కత్తితో నిహారిక గొంతును రాజశేఖర్ కోసేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ బాలమద్దిలేటి తెలిపారు.
చదవండి:
ఘోరం: అందరూ చూస్తుండగానే...
యువకుడి నగ్న వీడియోలు రికార్డు చేసి..
Comments
Please login to add a commentAdd a comment