bride jewellery robbery
-
కోడలి నగలు భద్రపరచడం క్రూరత్వం కాదు
న్యూఢిల్లీ: కోడలి నగలను అత్తింటి వారు భద్రపరిస్తే భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 498–ఏ సెక్షన్ ప్రకారం అది క్రూరత్వం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్తింటి వారు తన నగలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తనను వేధిస్తున్నారన్న ఆరోపణలపై భర్త, అత్త, బావపై పంజాబ్‌కు చెందిన ఒక మహిళ కేసు పెట్టింది. ఇలా నగలు తీసుకోవడం అత్తింటివారు కోడలిపై క్రూరత్వాన్ని ప్రదర్శించడమేనంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త తిరిగి వెళ్లడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఆ భర్త వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరిల ధర్మాసనం విచారించింది. ఎన్ని నగలు తీసుకున్నారో, వాటి విలువ ఎంత అనే వివరాలేవీ పిటిషనర్ వెల్లడించలేదని, తన జీవితం ఏ విధంగా నాశనం చేశారనే విషయాలనూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయినా ఈ కేసులో నగలు తీసుకోవడం సెక్షన్ 498ఏ కింద క్రూరత్వం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు పంజాబ్ , హరియాణా హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఫోన్ సంభాషణను రికార్డు చేయడం గోప్యతకు భంగం కలిస్తుందా? భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణను రికార్డు చేయడం గోప్యతకు భంగం కలిస్తుందా? అనే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 12 డిసెంబర్ 2021న పంజాబ్–హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2009లో వివాహం చేసుకున్న వ్యక్తి 2017లో తనకు విడాకులు కావాలంటూ బటిండా ఫ్యామిలీ కోర్టులో కేసు వేశాడు. అందుకు కారణంగా భార్య ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాడు. 2020లో బటిండా ఫ్యామిలీ కోర్టు ఆ రికార్డులను అంగీకరించింది. సంభాషణల రికార్డును పరిగణనలోకి తీసుకోవడం తన గోప్యతకు భంగం కలిగించడమేనని ఆ మహిళ పంజాబ్,హరియాణా హైకోర్టులో అప్పీలు చేసింది. ఆమె వాదనలతో హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఏకీభవించింది. -
పెళ్లిలో 53 తులాల నగలు మాయం..నిందితుడి అరెస్ట్
సాక్షి, విశాఖ : రిసార్ట్‌లో నిర్వహించిన పెళ్లివేడుకలో జరిగిన చోరీ ఘటనను విశాఖ పోలీసులు చేధించారు. పెళ్లివేళ వధువుకు చెందిన యాభై మూడు తులాల బంగారాన్ని పాత నేరస్తుడే చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖలోని ఓ రిసార్టులో మరికొద్ది సేపట్లో వివాహతంతు జరగాల్సి ఉండగా పెళ్లికూతురు నగలు మాయం కావడం కలకలం రేగిన సంగతి తెలిసిందే. వధువును అలకరించేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో ఆభరణాలన్నీ మాయమవ్వడంతో పెళ్లికూతురు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు మాత్రం పెద్ద మనసు చేసుకొని నిరాడంబరంగానే పెళ్ళికి అంగీకరించారు. మొత్తానికి పెళ్లయితే జరిగింది. విశాఖలోని అనకాపల్లి మండలం మునగపాక గ్రామానికి చెందిన అలేఖ్యకు అదే గ్రామానికి చెందిన యువకుడితో డిసెంబర్ నెల 24వ తేదీన సాయి ప్రియ రిసార్ట్స్ లో వివాహం జరిపించేందుకు నిశ్చయించారు. పెళ్లికూతురు అలంకరించే సమయంలో చూస్తే 53 తులాల బంగారం మాయం అయ్యింది. దీంతో అలేఖ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (ప్రేమోన్మాది ఢిల్లీబాబు ఆత్మహత్య) పోలీసుల ప్రాథమిక విచారణలో రిసార్ట్‌లోని సీసీ ఫుటేజ్‌లో ఎలాంటి దృశ్యాలు కనిపించలేదు కానీ రిసార్ట్స్ వెనక కిటికీ తొలగించి ఉన్నట్టు గుర్తించారు. దీంతో అటుగా దారితీసిన దాదాపు కిలోమీటరు దూరం సి సి ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. ఈ పరిస్థితుల్లో దాదాపు 300 మందిని పోలీసులు విచారించగా కొంత క్లూ లభించింది. ఒడిస్సా కి చెందిన గంగాధర్ అనే పాత నేరస్తుడు సీసీ కెమెరా లో కనిపించడంతో అతన్ని విచారించారు. కోవిడ్ ముందు వరకు విశాఖలోని హోటల్లో పని చేసిన గంగాధర్ ఉపాధి కోల్పోవడంతో దొంగతనాలు ప్రారంభించాడు.ఆ క్రమంలో సాయి ప్రియ రిసార్ట్స్ వద్ద రెక్కీ నిర్వహించి పెళ్లికూతురు అలేఖ్య కుటుంబానికి చెందిన యాభై మూడు తులాల బంగారాన్ని చోరీ చేశాడు. అందులో మూడు తులాల బంగారాన్ని వదిలిపెట్టి మిగతా బంగారాన్నంతా ఎత్తుకెళ్లాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీని చేధించారు. పెళ్లికూతురికి చెందిన 53 తులాల బంగారు ఆభరణాలు దొరకడంతో ఇరువురి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (‘పింక్ డైమండ్’ పిల్‌ను తోసిపుచ్చిన హైకోర్టు) -
కాసేపట్లో పెళ్లి... వధువు నగలు మాయం
హిందూపురం: కాసేపట్లో పెళ్లి అనగా వధువు నగలు మాయం అయిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. 16 లక్షల రూపాయల విలువైన 60 తులాల బంగారం కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హిందూపురంలోని కంచి కామాక్షి కళ్యాణ మండపంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లికూతుర్ని చేసిన తర్వాత గురువారం రాత్రి కళ్యాణ మండపంలో నిద్రపోయారు. ఈ ఉదయం లేచి నగల కోసం అవి కనిపించలేదు. అయితే తెలిసినవారే ఈ దొంగతనానికి పాల్పడ్డారా, బయటి నుంచి వచ్చిన దుండగులెవరైనా చోరీ చేశారా అనే దాని గురించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, నగలు లేకపోయినా పెళ్లి జరగడంతో వధువు తరపువారు ఊపిరి పీల్చుకున్నారు. -
కాసేపట్లో పెళ్లి... వధువు నగలు మాయం