
సాక్షి, అనంతపురం జిల్లా: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఫ్యాన్ స్పీడ్‌కు ప్రత్యర్థులు నలవలేకపోతున్నారు. తాజాగా, పలు పంచాయితీలు, వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ తగిలింది. చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు విజయం సాధించారు. 337 ఓట్లతో సర్పంచ్‌గా ఉపేంద్రరెడ్డి గెలుపొందారు.
తాడిపత్రిలో..
తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment