supporter
-
ఫ్యాన్ ప్రభంజనం.. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం జిల్లా: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఫ్యాన్ స్పీడ్‌కు ప్రత్యర్థులు నలవలేకపోతున్నారు. తాజాగా, పలు పంచాయితీలు, వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ తగిలింది. చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు విజయం సాధించారు. 337 ఓట్లతో సర్పంచ్‌గా ఉపేంద్రరెడ్డి గెలుపొందారు. తాడిపత్రిలో.. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. -
వైఎస్సార్సీపీ మద్దతుదారుడి హత్య
-
పంజాబ్‌లో హైటెన్షన్.. అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్
ఛండీఘర్: పంజాబ్‌లో హైటెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా పంజాబ్ పోలీసులు ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని పలు జిల్లాల్లో పోలీసులు ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. వివరాల ప్రకారం.. ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్‌ను పోలీసులు జలంధర్‌లో శనివారం అరెస్ట్ చేశాడు. దాదాపు 50 పోలీసులు వాహనాలు అతడిని వెంబడించి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అమృత్ పాల్ సింగ్ అనుచరులు దాడులకు, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాల్లో పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అలాగే, భద్రతను పటిష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్ సింగ్ ‘వారిస్ పంజాబ్ దే’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ద్వారా పంజాబ్‌లో ఖలిస్తాన్ అనుకూల భావజాలాన్ని పోత్సహిస్తున్నాడు. దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో పోలీసులు అతడిపై నిఘా వేశారు. ఈ క్రమంలో అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఇటీవలే అమృత్‌పాల్ సింగ్ దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని పోలీసులకే సవాల్ విసిరాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌తో సహా అతడి అనచరులు ఆరుగురిని జలంధర్‌లో అరెస్ట్ చేశారు. అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో అలర్ట్ అయిన పంజాబ్ పోలీసులు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా చదవండి: అస్సాంలోని మదర్సాలన్నిటినీ మూసేస్తాం -
అంతులేని అభిమానం.. తీవ్ర అనారోగ్యంలోనూ ప్లీనరీకి..
జి.కొండూరు(ఎన్టీఆర్ జిల్లా): అభిమానం అనారోగ్యాన్ని లెక్క చేయనివ్వలేదు. నిన్న మొన్నటి వరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వ్యక్తి.. ఇల్లు దాటడానికే ఇబ్బంది పడుతున్న పెద్దాయన తమ అభిమాన నాయకుడిని చూడాలనే ఆరాటంతో కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. యూరిన్ బ్యాగ్ చేత్తో పట్టుకుని ప్లీనరీ ప్రాంగణానికి వచ్చిన అభిమానిని చూసి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. చదవండి: జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నా..ఇక షర్మిలకు అండగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పోతురెడ్డి వీరారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వీరారెడ్డికి వైద్యులు యూరిన్ బ్యాగ్ ఆమర్చారు. ఇటీవల ఇంటికి వచ్చిన ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడకపోయినప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌పై గల అభిమానంతో శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలో శుక్రవారం జరిగిన వైఎస్సార్ సీపీ ప్లీనరీకి హాజరయ్యారు. ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతం ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. వర్షంలోనూ ఇబ్బంది లేకుండా వాటర్‌ప్రూఫ్ టెంట్లు వేయడం, మాంసాహార, శాఖాహార వంటకాలతో భోజనం, వాటర్ బాటిళ్లు, మజ్జిగ పంపిణీ అన్నీ బాగున్నాయి. – జి.శ్రీనివాసరావు, ఎంపీపీ.. నక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లా మళ్లీ జగన్ సీఎం అవడం తథ్యం రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారీ్టలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అధిక ప్రాధాన్యం ఇచి్చంది. మళ్లీ జగనన్నే సీఎం అవడం తథ్యం. – తెన్నేటి ప్రకాష్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, కృష్ణా జిల్లా టీడీపీ వారు సిగ్గుపడుతున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి టీడీపీ వారు సిగ్గుపడుతున్నారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేయకపోయినా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఎకరం మిరప పంట నష్టపోయిన వారికి భారీగా పంట నష్ట పరిహారం రావడం నిజంగా అద్భుతం. – డి.శివానంద, నరిగన్న, బెళుగప్ప మండలం, అనంతపురం జిల్లా -
డొనాల్డ్ ట్రంప్ అనూహ్య చర్య
వాషింగ్టన్: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో జగడాలమారిగా పేరు తెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సామాన్యుడికి స్నేహహస్తం అందించారు. తనలోని మరో కోణాన్ని బయట పెట్టుకున్నారు. ఫ్లోరిడాలోని మెల్ బోర్న్ లో శనివారం ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాను ప్రసంగిస్తుండగా జనం మధ్యలో ఉన్న జీన్ హబర్ అనే వ్యక్తిని హఠాత్తుగా వేదికపైకి పిలిచారు. ట్రంప్ పిలుపుకు వెంటనే స్పందించిన హంబర్.. బారియర్స్ పైనుంచి దూకి పోడియం వద్దకు చేరుకున్నాడు. వేదికపైకి వెళ్లి ట్రంప్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఒక సామాన్యుడు వచ్చి అధ్యక్షుడిని హత్తుకోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత విషయం తెలుసుకుని కూల్ అయ్యారు. ట్రంప్ కు హబర్ వీరాభిమాని. ఆరు అడుగుల కటౌట్ ను తన ఇంటిలో పెట్టుకున్నాడు. ప్రతిరోజు ట్రంప్ కటౌట్ కు సెల్యూట్ కూడా చేస్తానని హబర్ తెలిపాడు. తానెంతో అభిమానించే నాయకుడు స్వయంగా తనను గుర్తించి వేదికపైకి పిలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. బోయిన్టన్ బీచ్ కు చెందిన హబర్.. కారు సేల్స్ మేన్ గా పనిచేస్తున్నాడు. తమ కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ట్రంప్ నిలబెట్టుకున్నారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. హబర్ ను ట్రంప్ వేదిక మీదకు పిలవడం కాకతాళీయమా, ముందుగానే నిర్ణయించుకుని చేశారా అనే దానిపై స్పష్టత లేదు. ట్రంప్ చర్యతో హంబర్ వార్తల్లోకి ఎక్కాడు. -
వీళ్లు.. మనుషులా.. రాక్షసులా?
అలీగఢ్: పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాడనే నెపంతో ఓ వ్యక్తిని చితక్కొట్టారు. ఏమాత్రం జాలి, కరుణ దయ లేకుండా నిర్ధాక్షిణ్యంగా కిందపడేసి చావు దెబ్బలు కొట్టారు. ఇంత జరుగుతున్న అక్కడ చుట్టూఉన్నవారంతా తాఫీగా ప్రేక్షకులుగా చూస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూసిన ఈ వీడియో పలువురికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ వీడియోలో చూపించిన ప్రకారం ఓ యువకుడిని ముందుగా కిందపడేశారు. మరో వ్యక్తి అతడిని కదలకుండా పట్టుకోగా ఓ వ్యక్తి చేతిలో పెద్ద కర్ర తీసుకొని గొడ్డును బాదినట్లు బాదాడు. ఆ తర్వాత ఓ రాయి తీసుకొచ్చి కాళ్లపైన, ముఖంపైన అదే పనిగా దాడి చేశాడు. దీంతో ఆ యువకుడు సొమ్మసిల్లిపోయాడు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
'అదంతే.. నేనసలే చాలా వైలెంట్'
న్యూయార్క్: తనకు హానీ కలిగించాలని ప్రయత్నించిన వ్యక్తి బహుషా ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారు అయి ఉండొచ్చని డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. అందుకే అతడు అలా చేసి ఉండొచ్చని అన్నాడు. డేటన్లో ట్రంప్ ప్రచార సభలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి బారికేడ్లను దాటుకొని వేగంగా అతడివైపు దూసుకొని వచ్చాడు. ట్రంప్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి వెంటనే స్పందించిన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి తీసుకెళ్లారు. 'అతడిని జైలులో పెట్టాలి. అతడికి దేశంపట్ల ప్రేమలేదు. ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారు అయ్యి ఉండొచ్చు. మన న్యాయస్థానాలు కఠినమైనవి, తెలివైనవి. అంత తేలికగా అతడ్ని వదలవని అనుకుంటున్నాను. నేను ఎందుకు ఉగ్రవాదం విషయంలో కఠినంగా ఉన్నానంటే నేనసలే చాలా వాయిలెంట్' అని ట్రంప్ అన్నాడు. ఇప్పటికే ట్రంప్ పట్ల కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ వల్ల డోనాల్డ్ ట్రంప్ తన షికాగో ప్రచార ర్యాలీని రద్దు చేసుకోగా ఇది మరో ఘటన. -
మోడీకి కిరణ్‌బేడీ బహిరంగ మద్దతు
-
సమైక్యవాదిపై చేయిచేసుకున్న చంద్రబాబు