వైద్యులు అమర్చిన యూరిన్ బ్యాగ్‌తో ప్లీనరీ ప్రాంగణంలో వీరారెడ్డి
జి.కొండూరు(ఎన్టీఆర్ జిల్లా): అభిమానం అనారోగ్యాన్ని లెక్క చేయనివ్వలేదు. నిన్న మొన్నటి వరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వ్యక్తి.. ఇల్లు దాటడానికే ఇబ్బంది పడుతున్న పెద్దాయన తమ అభిమాన నాయకుడిని చూడాలనే ఆరాటంతో కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. యూరిన్ బ్యాగ్ చేత్తో పట్టుకుని ప్లీనరీ ప్రాంగణానికి వచ్చిన అభిమానిని చూసి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.
చదవండి: జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నా..ఇక షర్మిలకు అండగా
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పోతురెడ్డి వీరారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వీరారెడ్డికి వైద్యులు యూరిన్ బ్యాగ్ ఆమర్చారు. ఇటీవల ఇంటికి వచ్చిన ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడకపోయినప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌పై గల అభిమానంతో శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలో శుక్రవారం జరిగిన వైఎస్సార్ సీపీ ప్లీనరీకి హాజరయ్యారు.
ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతం
ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. వర్షంలోనూ ఇబ్బంది లేకుండా వాటర్‌ప్రూఫ్ టెంట్లు వేయడం, మాంసాహార, శాఖాహార వంటకాలతో భోజనం, వాటర్ బాటిళ్లు, మజ్జిగ పంపిణీ అన్నీ బాగున్నాయి.
– జి.శ్రీనివాసరావు, ఎంపీపీ.. నక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లా
మళ్లీ జగన్ సీఎం అవడం తథ్యం
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారీ్టలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అధిక ప్రాధాన్యం ఇచి్చంది. మళ్లీ జగనన్నే సీఎం అవడం తథ్యం.
– తెన్నేటి ప్రకాష్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్,
కృష్ణా జిల్లా టీడీపీ వారు సిగ్గుపడుతున్నారు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి టీడీపీ వారు సిగ్గుపడుతున్నారు.
వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయకపోయినా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఎకరం మిరప పంట నష్టపోయిన వారికి భారీగా పంట నష్ట పరిహారం రావడం నిజంగా అద్భుతం.
– డి.శివానంద, నరిగన్న, బెళుగప్ప మండలం, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment