suffering ill health
-
అంతులేని అభిమానం.. తీవ్ర అనారోగ్యంలోనూ ప్లీనరీకి..
జి.కొండూరు(ఎన్టీఆర్ జిల్లా): అభిమానం అనారోగ్యాన్ని లెక్క చేయనివ్వలేదు. నిన్న మొన్నటి వరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వ్యక్తి.. ఇల్లు దాటడానికే ఇబ్బంది పడుతున్న పెద్దాయన తమ అభిమాన నాయకుడిని చూడాలనే ఆరాటంతో కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. యూరిన్ బ్యాగ్ చేత్తో పట్టుకుని ప్లీనరీ ప్రాంగణానికి వచ్చిన అభిమానిని చూసి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. చదవండి: జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నా..ఇక షర్మిలకు అండగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పోతురెడ్డి వీరారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వీరారెడ్డికి వైద్యులు యూరిన్ బ్యాగ్ ఆమర్చారు. ఇటీవల ఇంటికి వచ్చిన ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడకపోయినప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌పై గల అభిమానంతో శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలో శుక్రవారం జరిగిన వైఎస్సార్ సీపీ ప్లీనరీకి హాజరయ్యారు. ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతం ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. వర్షంలోనూ ఇబ్బంది లేకుండా వాటర్‌ప్రూఫ్ టెంట్లు వేయడం, మాంసాహార, శాఖాహార వంటకాలతో భోజనం, వాటర్ బాటిళ్లు, మజ్జిగ పంపిణీ అన్నీ బాగున్నాయి. – జి.శ్రీనివాసరావు, ఎంపీపీ.. నక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లా మళ్లీ జగన్ సీఎం అవడం తథ్యం రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారీ్టలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అధిక ప్రాధాన్యం ఇచి్చంది. మళ్లీ జగనన్నే సీఎం అవడం తథ్యం. – తెన్నేటి ప్రకాష్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, కృష్ణా జిల్లా టీడీపీ వారు సిగ్గుపడుతున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి టీడీపీ వారు సిగ్గుపడుతున్నారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేయకపోయినా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఎకరం మిరప పంట నష్టపోయిన వారికి భారీగా పంట నష్ట పరిహారం రావడం నిజంగా అద్భుతం. – డి.శివానంద, నరిగన్న, బెళుగప్ప మండలం, అనంతపురం జిల్లా -
కన్నీళ్లకే కన్నీరొచ్చే.. కష్టాలకే కష్టం వేసే..!
కోడూరు మండలం లింగారెడ్డిపాలెం దళితవాడకు చెందిన నాగేసు, రజనీరాణి దంపతుల దుస్థితిని చూస్తే కన్నీళ్లకే కన్నీరొస్తుంది. కష్టాలకే కష్టం వేస్తుంది. ఆ దంపతులది 65 ఏళ్లు పైబడిన వయసు. మంచానికే పరిమితమైన కుమార్తె. కర్రసాయమైనా లేనిదే నిలబడలేని కుమారుడు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. వృద్ధాప్యంలో బిడ్డలే లోకంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులను చూస్తే ఎవరైనా అయ్యోపాపం ఎంత కష్టం అంటూ జాలిపడతారు. ప్రభుత్వం దివ్యాంగ పింఛన్లు మంజూరుచేసి తల్లిదండ్రులకు అండగా నిలిచింది. అయితే ఆ పింఛన్లు ఇవ్వాల్సిన అధికారుల మనసు మాత్రం కఠినంగా మారింది. పింఛన్ డబ్బులు కావాలంటే మండలకేంద్రమైన కోడూరుకు రావాల్సిందేనంటూ భీష్మించారు. చేసేదేమీలేక ఆ వృద్ధదంపతులు పిల్లలిద్దరినీ చక్రాల కుర్చీలపై కూర్చోబెట్టి ఆరు కిలోమీటర్ల దూరం నెట్టుకెళ్లి, తిరిగా రావాల్సి వస్తోంది. కోడూరు(అవనిగడ్డ): మండలంలోని లింగారెడ్డిపాలెం దళితవాడకు చెందిన 68 ఏళ్ల నాగేసు, 64 ఏళ్ల రజనీరాణి దంపతులు. వారికి 34ఏళ్ల కుమారుడు వెంకయ్య, 30 ఏళ్ల కుమార్తె ఆశాజ్వోతి ఉన్నారు. ఇద్దరికీ చిన్నప్పుడే పోలియో సోకడంతో ఆశాజ్వోతి మంచానికే పరిమితమైంది. బయటకు వెళ్లాలంటే ఎత్తుకుని తీసుకెళ్లాలి. వెంకయ్య కర్రసాయం లేనిదే లేచి నిలబడలేని పరిస్థితి. వారిద్దరికీ దివ్యాంగ పింఛన్ వస్తోంది. తండ్రి నాగేసు పొలాల్లో కాపలా ఉంటూ రైతులు ఇచ్చే ధాన్యంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆశాజ్యోతి చేతివేలి ముద్రలు సరిగా పడక పోవడంతో నాగేసు వేలిముద్రలను ఆమె పింఛన్‌కు లింకు చేశారు. కదలలేని పరిస్థితిలో ఉన్న ఆశాజ్యోతి, వెంకయ్యకు ఇంటికొచ్చి పింఛన్ ఇవ్వాల్సి ఉంది. మందపాకలలో ఉన్న బ్యాంకు కరస్పాండెంట్ వారికి పింఛన్ ఇస్తుంటారు. అయితే ఇంటికొచ్చి ఇవ్వకుండా, ప్రతినెలా మందపాకలకు రమ్మనడంతో కదలలేని కుమార్తె, నడవలేని కుమారుడిని వృద్ధ తల్లిదండ్రులు చక్రాల బండిలో రెండున్నర్ర కిలో మీటర్ల దూరం ఉన్న మందపాకలకు తీసుకెళ్తున్నారు. అక్కడా వేలిముద్రలు పడకపోతే మండల కేంద్రమైన కోడూరు ఎస్బీఐ బ్యాంకుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. గత నెలలో ఇలాగే గ్రామం నుంచి మందపాకల, అక్కడ నుంచి కోడూరుకు ఐదున్నర్ర కిలోమీటర్లు దూరం చక్రాల బండిలో బ్యాంకు తీసుకెళ్లి వేలిముద్రలు వేసిన తరువాతనే అధికారులు పింఛన్ ఇచ్చారు. సోమవారం వీరిద్దరినీ మందపాకలకు తీసుకెళ్లగా, మళ్లీ కోడూరు వెళ్లాలని చెప్పడంతో వృద్ధ తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు. తమ పిల్లలను చక్రాల బండిలో తీసుకెళ్లాలంటే ప్రాణం పోతోందని వాపోతున్నారు. ఆశాజ్యోతి నోటి నుంచి సొంగపడుతుందంటూ ఆటో డ్రైవర్లు ఎక్కించుకోవడంలేదని చేసేదేమీలేక చక్రాల కుర్చీల్లో తీసుకెళ్లాల్సి వస్తోందని వివరించారు. ఉన్నతాధికారులు స్పందించి ఇంటికొచ్చి వచ్చి పింఛన్ ఇచ్చేలా కనికరించండి సారూ అంటూ వారు వేడుకొంటున్నారు. దివ్యాం గులు ఆశాజ్యోతి, వెంకయ్య పింఛను కోసం వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపై ఎంపీడీఓ బి.వెంకటేశ్వరరెడ్డిని వివరణ కోరగా తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. పింఛన్ కరస్పాండెంట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
విషాహారం తిని 12 మందికి అస్వస్థత
కావలి : విషాహారం తిని 12 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరారు. విశాఖపట్టణం, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన 12 మంది జలదంకిలో జామాయిల్ కర్ర నరికే పని కోసం వచ్చారు. శనివారం చికెన్‌తో భోజనం చేసిన వీరికి ఆదివారం తెల్లవారు జాము నుంచి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. నీరసించిన వీరిని స్థానికులు 108 సాయంతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.