ఏసీబీ గాలానికి చిక్కిన ఇంజనీర్‌.. | ACB Officials Arrested AO In Guntur | Sakshi
Sakshi News home page

ఏసీబీ గాలానికి చిక్కిన ఇంజనీర్‌..

Published Wed, May 30 2018 3:20 PM | Last Updated on Thu, Mar 28 2019 5:12 PM

ACB Officials Arrested AO In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : పట్టణంలో మరో అవినీతి అధికారి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు ఏసీబీ అధికారులు. ఏఓగా పనిచేస్తున్న మధవరావు అక్రమాస్తుల చిట్టా ఒక్కక్కటిగా విప్పారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం ఇతనికి ఇరవై విలువైన ఇళ్ల స్థలాలు, నాలుగు నివాస గృహాలకు సంబంధించిన రికార్డులను గుర్తించారు. అంతేకాక ఏడు లక్షల రుపాయల నగదు, పెద్దఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్‌ లెక్కల ప్రకారం దాదాపు ఆరు కోట్ల రుపాయలు. ఏకకాలంలో ఇతని బంధువుల ఇంటిపై కూడా అధికారులు దాడి చేశారు. పొన్నూరు మండలం మాచవరంలో ఇతని బినామీ చిట్టిబాబు ఇంట్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement