
సాక్షి, గుంటూరు: ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్నాయుడు అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్లు పెట్టుకోగా తిరస్కరణకు గురయ్యాయి. ఇక అచ్చెన్నాయుడుతోపాటు ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టయిన ఏ1 రమేష్ కుమార్, పితాని సత్యనారాయణ పీఏ మురళి, మరో నిందితుడు సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
(ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేటు దందా)
Comments
Please login to add a commentAdd a comment