సాక్షి, విజయవాడ: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు శుక్రవారం కొట్టేసింది. కాగా, ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈఎస్‌ఐలో జరిగిన రూ.150 కోట్లకు పైగా స్కామ్‌తో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసే దిశగా ఏసీబీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడితోపాటు మరో 18 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన ఏసీబీ ఆయనతో సహా 9 మందిని అరెస్ట్ చేసింది.
(‘మనసా, వాచా ఆయన వైఎస్సార్‌సీపీతో లేరు’)
అచ్చెన్నాయుడుకు చుక్కెదురు
Published Fri, Jul 3 2020 5:51 PM | Last Updated on Fri, Jul 3 2020 8:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment