
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ స్కాంలో అరెస్టుల సంఖ్య పదికి చేరింది. తాజాగా మరో వ్యక్తిని ఏసీబీ అరెస్ట్ చేసింది. విజయవాడ భవానీపురంలో తిరుమల మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న తెలకపల్లి కార్తీక్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. నకిలీ కొటేషన్‌లతో అధిక ధరలకు ఆర్డర్లు పొందినట్టు ఏసీబీ నిర్ధారించింది. ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడితో సహా నిందితులందరి బెయిలు పిటిషన్లను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.(అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ తిరస్కరణ)
Comments
Please login to add a commentAdd a comment