శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో దొంగలు గురువారం అర్ధరాత్రి సమయంలో హల్‌చల్ చేశారు. రెండిళ్లలో భారీ చోరీలకు పాల్పడ్డారు. ఓ ఇంటి ఊచలు తొలగించుకుని లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు 22 తులాల బంగారు నగలు, రూ.లక్షకు పైగా నగదును అపహరించి పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం గ్రామంలోని చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.