ప్రతీకాత్మక చిత్రం
రాజస్థాన్: దొంగతనాలకు సంబంధించిన నేరాల్లో ముందుగా ఇంటి దొంగల హస్తం ఉంటుందన్నది పోలీసుల నమ్మకం. అయితే రాజస్థాన్‌లో ఓ చోరీ కేసులోనూ పోలీసులు ఇదే రకంగా అనుమానం వ్యక్తం చేశారు. చివరకు వారి అనుమానమే నిజమైంది. అయితే ఇక్కడ చోరీకి పాల్పడింది ఎవరో తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.
పోలీసులు తెలిపిన వివరాలు.. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని సెంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ. 33 వేల రూపాయల నగదుతో పాటు రూ. 4 లక్షల రూపాయల విలువైన నగలు మాయమయ్యాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని విచారన చేపట్టారు. ఇంట్లో తవ్వి దాచిపెట్టిన బంగారాన్ని తీసుకెళ్లడం ఇతరులకు సాధ్యం కాదు కాబట్టి ఇంట్లో వాళ్లే ఎవరో దీని వెనుక ఉన్నారని అనుమానించిన పోలీసులు ఆ ఇంటి యజమాని చిన్న కూతురు(17) ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. తనకు ఈ దొంగతనానికి కచ్చితంగా సంబంధం ఉందని భావించారు. చివరికి ఆమెను తమదైన శైలిలో విచారించగా జరిగిన విషయం నిందితురాలు బయటపెట్టింది.
అదే ఊరిలో తనతో కలిసి చదువుతున్న తన ప్రియుడే ఈ చోరీ చేశాడని తెలిపింది. అయితే దీనికి కూడా ఓ కారణం ఉందని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 17 ఏళ్ల వయసు ఉన్న ఆ అమ్మాయి మరో ఏడాదికి తన మైనారిటీ తీరుతుందని అప్పుడు ప్రియుడిని పెళ్లి చేసుకుంటే ఇబ్బంది ఉండదని ప్లాన్ చేసింది. అందుకే ముందుగానే ఇంట్లో ఉన్న నగలు దోచుకోవాలని ప్రియుడికి సలహా ఇచ్చిందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment