house robbery
-
పండక్కి ఊరెళుతున్నారా.. మీ ఇల్లు జరభద్రం
సాక్షి, హైదరాబాద్ : దసరా సెలవులు వచ్చేశాయి. క్రమంగా నగరవాసులు సొంతూర్లకు పయనమవుతున్నారు. ఇదే చోరులకు సరైన సమయం. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలలో చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది దసరా పండుగ నేపథ్యంలో గ్రేటర్లో అధికంగా ఇళ్లలో చోరీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈసారి పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పోలీసులు నైట్ పెట్రోలింగ్ పెంచారు. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, వ్యక్తిగత గృహాలపై నిరంతరం నిఘా పెట్టారు. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులు, నేపాలీ పని మనుషుల కదలికలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.పండగ సమయాల్లో అధికంగా చోరీలు.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు, స్థానికంగా ఇతర జిల్లాల్లో ఉండే చోరులు పండుగ సమయాలను అనువుగా భావిస్తుంటారు. రైళ్లు, బస్సుల్లో నగరానికి చేరుకొని, శివారు ప్రాంతాల్లో తలదాచుకుంటారు. రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతుంటారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే పండగ వేళ చోరీలు అధికంగా నమోదవుతున్నాయి. ఎక్కువగా శివారు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలో సైకిల్, నైట్ పెట్రోలింగ్‌లతో గల్లీగల్లీలో నిఘా పెట్టాలని, నిరంతరం సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.సైబరాబాద్ పోలీసుల సూచనలివీ.. u బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. u సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ తాళం ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. u మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేయండి. నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డుగా నియమించుకోవాలి. u మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు వంటివి జమ కానివ్వకుండా చూడాలి. వాటిని గమనించి ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. u ఇంటి లోపల మరియు బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిది. u సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు. -
డిప్యూటీ సీఎం ఇంట్లో భారీ చోరీ.. నిందితులు అరెస్ట్
-
ప్రియురాలితో పెళ్లి కోసం.. టీవీ షో చూసి దొంగతనం.. చివరకు
న్యూఢిల్లీ: సాధారణంగా టీవీలలో, సీరియల్స్లలో కల్పిత పాత్రలతో క్రైమ్ వార్తలను ప్రసారం చేస్తుంటారు. దొంగతనాలు, కిడ్నాప్‌లు ఆయా ఘటనలకు సంబంధించి కల్పిత పాత్రలను.. ప్రేక్షకుల కంటికి కట్టినట్లు చూపించడానికి టీవీలలో అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాల వలన నేరం చేస్తే.. పడే శిక్షలను పరోక్షంగా చూపిస్తుంటారు. కొందరు వీటిని చూసి తమ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకుంటే.. మరికొందరు కేటుగాళ్లు మాత్రం టీవీలలో చూపించే కల్పిత దృశ్యాలను అనుసరించి అడ్డంగా బుక్కైపోతారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మొహమ్మద్ ఫహీముద్దీన్ అనే వ్యక్తి లాహోరి గేట్ అనే ప్రాంతంలో ఉంటున్నాడు. ఇతను జనవరి 18న వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్లాడు. ఆ తర్వాత రాత్రికి ఇంటికి చేరుకుని చూసేసరికి ఇంటి మెయిన్ గేట్ తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులు చిందర వందరగా పడేసి ఉండటాన్ని గమనించాడు. వెంటనే షాక్‌కు గురైన ఫహీముద్దీన్.. అదే రోజు తన ఇంట్లో డబ్బు, బంగారం పోయినట్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆ ప్రాంతాలలోని దాదాపు 200ల సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరకు నిందితుడిని కాట్రా హిందు ప్రాంతంలో కనుగొన్నారు. నిందితుడిని ఫయాజ్గాను.. అతడికి 20 ఏళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఇంట్లో నుంచి దాదాపు 2,15,000 డబ్బు స్వాధీనం చేసుకున్నారు. రెండు బంగారు గొలుసులు, ఒక రింగ్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు. స్థానిక టీవీ క్రైమ్ షో ‘సావధాన్ ఇండియా’ స్ఫూర్తితో చోరీకి పాల్పడినట్లు తెలిపాడు. ఆ షోలో చోరీచూసి ఎలా తప్పించుకోవచ్చో చూశానని .. అలానే చేశానని తెలిపాడు. తాను.. నెలకు 8వేలను సంపాదిస్తున్నానని.. అది చాలకే చోరీల బాట ఎంచుకున్నట్లు వివరించాడు. వచ్చే ఫిబ్రవరి 14న తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా తెలిపాడు. అతగాడి సమాధానాలు విని పోలీసులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చదవండి: ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే -
కానిస్టేబుల్ ఇంట్లో భారీ చోరీ
సాక్షి, నేరేడుచర్ల (నల్లగొండ): తాళం వేసి ఉన్న కానిస్టేబుల్ ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నేరేడుచర్ల పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఉపేందర్ కుటుంబంతో కలిసి పట్టణంలో నివాసముంటున్నాడు. కాగా, ఉపేందర్ భార్య కోటేశ్వరి సోమవారం కోదాడలో ఉంటున్న బంధువుల ఇంట్లో జరుగుతున్న పుట్టిన రోజు వేడుకకు వెళ్లగా రాత్రి అతను ఇంటికి తాళం వేసి విధులకు హాజరయ్యేందుకు వెళ్లాడు. గమనించిన దుండగులు ఇంటి తలుపుల గడియ పగులగొట్టి, లోనికి ప్రవేశించారు. బీరువా పగులగొట్టి అందులోని నక్లెస్, హారాలు, గొలుసులు చెవుల దిద్దులు తదితర 25 తులాల బంగారు ఆభరణాలతో పాటు 4 లక్షల నగదును అపహరించుకుపోయారు. మంగళవారం ఉదయం ఉపేందర్ ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు తీసి ఉండడంతో చోరీ విషయాన్ని గుర్తించి నేరేడుచర్ల ఎస్సై నవీన్‌కుమార్‌కు తెలియజేయగా ఘటనస్థలాన్ని పరిశీలించారు. సూర్యాపేట నుంచి క్లూస్‌టీం బృందం వచ్చి వేలు ముద్ర నమూనాలను సేకరించారు. కోదాడ డీఎస్పీ రఘు, హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, పాలకవీడు ఎస్సై సైదులు కానిస్టేబుల్ ఉపేందర్ నివాసానికి వచ్చి వివరాలు అడిగి తెలసుకున్నారు. ఉపేందర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీ¯Œ కుమార్ తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీ చిట్యాల: గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని గుండ్రాపల్లి గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ అనుముల సతీష్ కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల క్రితం ఊరికి వెళ్లారు. కాగా, మంగళవారం వారి ఇంటికి తాళం ఊడి పోయి ఉండటంతో గుర్తించిన చుట్టపక్కల వాళ్లు సతీష్‌కు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి చూడగా ఇంట్లోని బీరువా తలుపులు పగులగొట్టి దానిలో ఉంచిన రెండు తులాల బంగారు ఆభరణాలు, ఏడు వేల రూపాయల నగదుతో పాటు నలభై ఇంచులు టీవీని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. కాగా గ్రామంలో చోరీలను అరికట్టేందుకు అసరమైన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆ గ్రామానికి టీఆర్ఎస్ నాయకులు బోడిగె అంజయ్యగౌడ్ ఒక ప్రకటనలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను, అధికారులను కోరారు. -
Crime: పగలు రెక్కీ.. రాత్రికి చోరీ! తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా..
సాక్షి, విశాఖపట్నం: పగలు ఆటో నడుపుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి... రాత్రి వేళ ఆ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాలులో క్రైం ఏడీసీపీ శ్రావణ్‌కుమార్ మీడియాకు శుక్రవారం వెల్లడించారు. రైల్వే న్యూ కాలనీ సమీప శివాలయం వీధికి చెందిన షేక్ సహీద్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. పగలు అంతా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటో నడుపుతూ... ఆ సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రెక్కీ నిర్వహించేవాడు. అనంతరం రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి వేపగుంట సమీప నాయడుతోట అప్పలనర్సయ్య కాలనీలో మున్సి లియాకత్ కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన గత ఏడాది డిసెంబర్ 27న కుమారుడి రిసెప్సన్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. ఆ ఇంటిని, వారి కదలికలను నిశితంగా గమనిస్తున్న షేక్ సహీద్ అదే రోజు రాత్రి ఆ ఇంటిలో చోరీకి పాల్పడ్డాడు. ఇంటి వెనక డోర్ తాళం పగలుగొట్టి 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.30 లక్షల నగదు అపహరించుకుపోయాడు. మీడియాతో మాట్లాడుతున్న క్రైం ఏడీసీపీ శ్రావణ్‌కుమార్ పట్టించిన సీసీ కెమెరాలు కుమారుడి రిసెప్సన్ కార్యక్రమం తర్వాత మరుసటి రోజు డిసెంబర్ 28న ఇంటికి వచ్చిన మున్సి లియాకత్ చోరీ జరిగిందని గుర్తించి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏసీపీ పెంటారావు నేతృత్వంలో సీఐలు లూథర్‌బాబు, సింహాద్రినాయుడు, ఎస్ఐలు ఎం.రాధాకృష్ణ, డి.కాంతారావు, ఎం.గణపతిరావు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చోరీ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా షేక్ సహీద్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించడంతోపాటు మరో ఐదు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కంచరపాలెం పీఎస్ పరిధిలో ఒక చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. మొత్తం 17 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.3.80 లక్షల నగదు చోరీ చేయగా... 15 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.2.45 లక్షల నగదు, ఒక బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దొంగలించిన బంగారం కొనుగోలు చేస్తూ సహకరించిన పుట్టా భరత్‌కుమార్, బిక్కలు కళావతి, లంకా కామేశ్వరిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సమావేశంలో ఏసీపీ పెంటారావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. చదవండి: Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు -
దొంగల బీభత్సం.. ఒక్కరాత్రే 11 ఇళ్లకు కన్నం
సాక్షి, నందిపేట్(నిజామాబాద్): నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ మంగళవారం రాత్రి దొండలు అలజడి సృష్టించారు. ఏకంగా తాళం వేసిన 11 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. నగదు, నగలు, ఇతర సామగ్రిని దోచుకెళ్లారు. కుద్వాన్‌పూర్‌లో పలు కుటుంబాలు తమ బంధువుల ఇళ్లలో శుభకార్యాలు ఉండడంతో తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. కాగా మంగళవారం అర్దరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఉదయం తలుపులు తెరిచి ఉండడంతో చుట్టుపక్కల వారు చూసి బాధితులకు ఫోన్లలో సమాచారం అందించారు. వారి వచ్చి చూడగా ఇళ్లంతా చిందరవందరగా వస్తువులు పడి ఉన్నాయి. పోలీసులు క్లూస్‌టీంతో ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల అపహరణ బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. జాతీయ రహదారి పక్కన ఉన్న పంట భూముల్లోని 202, 203 నంబర్లు ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను ఎత్తుకెళ్లి వాటి నుంచి కాపర్ తీగ, ఆయిల్ చోరీ చేశారు. దీంతో బుధవారం ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్ పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకెళ్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మరో ఆసక్తికర పరిణామం.. జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!? -
గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా..
విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాలో సంచలనం రేపి.. జనాల్లో భయాందోళనలు కలుగజేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులు పోలీసులకు చిక్కారు. ఈ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలోని ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండీ స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె. రాణా ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుజరాత్ నుంచి రెండు గ్రూపులుగా.. ►గుజరాత్‌లోని దాహోద్, మధ్యప్రదేశ్‌లోని జుబువా ప్రాంతాల నుంచి 10 మంది కరుడుగట్టిన దొంగలు గత నెల 26వ తేదీన విజయవాడ నగరానికి చేరుకున్నట్లు సీపీ చెప్పారు. ఈ గ్రూపుల సభ్యుల రాష్ట్రాలు వేరైనప్పటికీ ఒకరికొకరు పరిచయస్తులేనన్నారు. ఈ ముఠా సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి నగర శివారు ప్రాంతాల్లోని విల్లాలను, ఖరీదైన అపార్ట్మెంట్లను టార్గెట్ చేస్తుంటారన్నారు. చోరీ చేసే సమయంలో వీరు బన్నీ, నిక్కర్ మాత్రమే ధరిస్తారన్నారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో దొంగతనాలకు చేస్తుంటారని సీపీ వెల్లడించారు. ►గత నెల 28వ తేదీ రాత్రి చిట్టీనగర్ మిల్క్ ప్రాజెక్ట్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ వద్ద అక్కడున్న వాచ్‌మెన్‌ను మారణాయుధాలతో బెదిరించి, ఓ ఫ్లాట్‌లోకి చొరబడి బంగారు, వెండి వస్తువులతో పాటు నగదును దోచుకెళ్లారన్నారు. ►ఈ నెల ఒకటో తేదీన ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గ్రామంలో ఓ అపార్ట్మెంట్లోకి ఇదే తరహాలో చొరబడి.. ఇనుపరాడ్లతో ఫ్లాట్ తాళాలు పగులగొట్టే సమయంలో చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యారన్నారు. ►రెండో తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మూడు అపార్ట్మెంట్లలోకి చొరబడ్డారని, అయితే అక్కడ వీరికి ఏం దొరకకపోవడంతో నాల్గో తేదీన కుంచనపల్లి గ్రామంలోని ఓ అపార్ట్మెంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు చెప్పారు. ►ఆరో తేదీన పోరంకిలోని ఓ అపార్ట్మెంట్లో వెండి, బంగారం, నగదు దోచుకెళ్లినట్లు వివరించారు. చోరీ చేసే సమయంలో ఎవరైన అడ్డుగా వస్తే దాడి చేసేందుకు ఈ ముఠా సభ్యులు కర్రలు, ఇనుపరాడ్డులు వినియోగిస్తారని సీపీ చెప్పారు. ►నగర ప్రజలను కలవరపాటుకు గురిచేసిన ఈ అంతరాష్ట్ర ముఠాను పట్టుకునేందుకు ఎంతో శ్రమించినట్లు సీపీ పేర్కొన్నారు. ఇక్కడ చోరీలు చేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులు విజయవాడ నుంచి ఈ నెల 8వ తేదీన వారి సొంత గ్రామాలకు బయలుదేరారన్నారు. చోరీ జరిగిన ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, వేలి ముద్రలు పరిశీలించిన అనంతరం దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. డీసీపీలు హర్షవర్థన్‌రాజు, బాబురావు నేతృత్వంలో టూ టౌన్ సీఐ మోహన్‌రెడ్డి, సీఐ సత్యనారాయణ, సీసీఎస్ సిబ్బందితో మూడు బృందాలు ఏర్పాటుచేసి వివరాలు రాబట్టామన్నారు. చదవండి: 18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!! Vijayawada city police have arrested three members of the Cheddi gang from Gujarat for committing various crimes in the jurisdiction of vijayawada police commissionerate Vijayawada City Police have constituted three special ..@APPOLICE100 @dgpapofficial pic.twitter.com/AHgVhaqp1Z — Vijayawada City Police (@VjaCityPolice) December 17, 2021 -
టీనేజర్ భారీ స్కెచ్.. ప్రియుడితో కలిసి సొంత ఇల్లు లూటీ
రాజస్థాన్: దొంగతనాలకు సంబంధించిన నేరాల్లో ముందుగా ఇంటి దొంగల హస్తం ఉంటుందన్నది పోలీసుల నమ్మకం. అయితే రాజస్థాన్‌లో ఓ చోరీ కేసులోనూ పోలీసులు ఇదే రకంగా అనుమానం వ్యక్తం చేశారు. చివరకు వారి అనుమానమే నిజమైంది. అయితే ఇక్కడ చోరీకి పాల్పడింది ఎవరో తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని సెంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ. 33 వేల రూపాయల నగదుతో పాటు రూ. 4 లక్షల రూపాయల విలువైన నగలు మాయమయ్యాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని విచారన చేపట్టారు. ఇంట్లో తవ్వి దాచిపెట్టిన బంగారాన్ని తీసుకెళ్లడం ఇతరులకు సాధ్యం కాదు కాబట్టి ఇంట్లో వాళ్లే ఎవరో దీని వెనుక ఉన్నారని అనుమానించిన పోలీసులు ఆ ఇంటి యజమాని చిన్న కూతురు(17) ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. తనకు ఈ దొంగతనానికి కచ్చితంగా సంబంధం ఉందని భావించారు. చివరికి ఆమెను తమదైన శైలిలో విచారించగా జరిగిన విషయం నిందితురాలు బయటపెట్టింది. అదే ఊరిలో తనతో కలిసి చదువుతున్న తన ప్రియుడే ఈ చోరీ చేశాడని తెలిపింది. అయితే దీనికి కూడా ఓ కారణం ఉందని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 17 ఏళ్ల వయసు ఉన్న ఆ అమ్మాయి మరో ఏడాదికి తన మైనారిటీ తీరుతుందని అప్పుడు ప్రియుడిని పెళ్లి చేసుకుంటే ఇబ్బంది ఉండదని ప్లాన్ చేసింది. అందుకే ముందుగానే ఇంట్లో ఉన్న నగలు దోచుకోవాలని ప్రియుడికి సలహా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. -
ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే, మీ ఇల్లు భద్రమే
దసరాకు ఊరెళ్లే హడావుడిలో చాలా మంది ఇంటి భద్రత పట్టించుకోరు. ఇదే అదనుగా దొంగలు తమ పని కానిచ్చేస్తారు. ఇళ్లలో చొరబడి ఉన్నదంతా దోచేస్తారు. పండగ సందర్భంగా చోరీల నివారణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సైబరాబాద్ పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ఊరెళ్లే ముందుకు ఇంట్లో ఉన్న నగలు, నగదును బ్యాంకు లాకర్లో పెట్టుకోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల్లో దాచడం వల్ల, ఎటువంటి ఆందోళన లేకుండా పండుగను సంతోషంగా జరుపుకోవచ్చని చెబుతున్నారు. ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు తప్పనిసరి ప్రయాణంలోనూ వీలైనన్ని జాగ్రత్తలు పాటించాలని పోలీసులు అంటున్నారు. దొంగతనాల నివారణపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలి్పస్తున్నారు. ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసి మైక్‌లో ప్రచారం నిర్వహించడంతో పాటుగా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. చాలా మంది సీట్లలో బ్యాగ్‌లను వదిలి తినుబండారాలు, తాగునీటి కోసం బస్సులు దిగుతుంటారు. ఇలాంటి సమయంలో దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రయాణాల్లో మహిళలు, చిన్నారులు బంగారు ఆభరణాలు ధరించకపోవడమే మంచిదంటున్నారు. కార్లలో వెళ్లే వారు సైతం అప్రమత్తంగా ఉండాలని, దొంగలు అద్దాలు పగలగొట్టి అందులోని సామగ్రిని దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పోలీసుల సూచనలు ► ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పీఎస్‌లో సమాచారం ఇవ్వాలి ► ద్విచక్ర వాహనాలను ఇంటి ఆవరణలో పార్కు చేసి లాక్ వేయాలి ► ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చుకుని వాటిని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఊరెళ్లే ముందు ఇంటి ఆవరణలో లైట్లు వేసి ఉంచాలి. ► సోషల్ మీడియాలో బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు. ఇంట్లో నమ్మకమైన వారినే సెక్యూరిటీ గార్డ్‌గా పెట్టుకోవాలి. ► ఇంట్లో ఉండే బీరువాలు, అల్మారా, కప్‌బోర్డుల తాళాలను జాగ్రత్తగా ఉంచాలి. వీలైతే ఇంటి గేటుకు లోపల తాళం వేయడం మంచిది. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టం తాళంను అమర్చుకోవాలి. ప్రత్యేక పోలీసు బృందాలు దొంగతనాల నివారణకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం. ఉదయం, రాత్రి వేళల్లో విస్తృతంగా పెట్రోల్, తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే వారు పోలీసులకు సమాచారం అందించాలి. ప్రయాణ సమయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. – నవీన్‌కుమార్, సీఐ షాద్‌నగర్ లాకర్లలో భద్రపర్చుకోవాలి విలువైన బంగారు నగలు, డబ్బులు ఉంటే బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలి. దుకాణాల్లో, ఇళ్లల్లో విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. దొంగతనాలు జరగకుండా శాఖా పరంగా ప్రత్యేక చర్యలు చేపట్టాం. చోరీల నివారణపైప్రజల్లో అవగాహనకల్పిస్తున్నాం. – భూపాల్ శ్రీధర్, సీఐ -
Chittoor: మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్
తిరుపతి: టెంపుల్ సిటీ తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ అలజడి రేపింది. నిన్న (సోమవారం) అర్ధరాత్రి విద్యానగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర ప్రణీతారెడ్డి అపార్ట్మెంట్లో ఈ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డారు. నిన్న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ముఠా.. సెక్యురిటీ ఇంటికి బిగాలు ఏర్పాటు చేసి మొదటి ఫ్లోర్లో ఉంటున్న విజయలక్ష్మీ ఇంట్లో ప్రవేశించారు. ఆ తర్వాత , వీరు బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. మూడెళ్ల తర్వాత మరోసారి చెడ్డిగ్యాంగ్ అలజడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. అపార్ట్మెంట్లో ఉండే వారంతా.. తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ముఠాకు సంబంధించి తిరుపతి ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలన్నింటిని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ గ్యాంగ్‌కు ఇతర నేరస్థులతో ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: Telugu Academy: రూ.64 కోట్లు మాయం.. వారి ఖాతాలో చిల్లిగవ్వ లేదు -
ఘరానా దొంగ: కారులో రెక్కీ.. ఇళ్లలో చోరీ
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): కుటుంబ పోషణ కోసం ఏర్పాటు చేసుకున్న కిరాణం సరిగా నడవలేదు. వచ్చిన డబ్బు జల్సాలు, కుటుంబ పోషణకు సరిపోలేదు. దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. కారులో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడుతున్నాడు. ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన దొంగను మంచిర్యాల పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. రూ.9.21లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.30వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మంచిర్యాల పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్‌మహాజన్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన రాయపాటి వెంకయ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. అయిన వాళ్లు ఎవరూ చేరదీయకపోవడంతో కొరటిపాడు పట్టణంలోని కిరాణ దుకాణంలో నెల జీతానికి కొంతకాలం పని చేశాడు. ఆ తర్వాత సొంతంగా కిరాణం దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగించాడు. దుకాణం సరిగా నడవకపోవడం, జల్సాలకు అలవాటు పడడం, వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో, బైక్ దొంగతనాలు చేశాడు. 2008 రాజమండ్రి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లాడు. అక్కడ కొందరితో పరిచయాలు ఏర్పర్చుకుని విడుదలైన తర్వాత నెల్లూరు, తిరుపతి ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. 2009లో పోలీసులు మరోసారి నెల్లూరు సెంట్రల్‌జైలుకు పంపించారు. ఆరు నెలల జైలు శిక్షణ అనంతరం దొంగతనాలకు పాల్పడగా.. తెలంగాణ రాష్ట్రంలో 19, ఆంధ్రప్రదేశ్‌లో 71, కర్ణాటకలో 4, కేరళలో 1, తమిళనాడు రాష్ట్రంలో 5 కేసులు నమోదయ్యాయి. ఐదు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన వెంకయ్య జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్, కరీంనగర్లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. కారులోనే చోరీ సొత్తు వెంకయ్య ఉరఫ్ వెంకటేష్ ఒక్కడే లేదా జైల్లో పరిచయమైన దొంగ స్నేహితులతో కలిసి కారులో తిరుగుతూ పగలు రెక్కీ నిర్వహించేవాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గమనిస్తూ రాత్రి వేళ చోరీలకు పాల్పడేవాడు. కారులో కత్తులు, వేటకొడవళ్లు, స్క్రూడైవర్, ఇనుప రాడ్లు ఉండవి. ఎవరైనా అడ్డుకుంటే వాటితో దాడి చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. చోరీ సొత్తును కారులోనే దాచి ఉంచుతూ పెద్దమొత్తంలో ఒకేసారి విక్రయించేవాడు. సొత్తు అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సా చేసేవాడు. దొంగతనానికి వెళ్తూ.. చోరీ సొత్తును కారులోనే ఉంచి బెల్లంపల్లిలో మరో దొంగతనానికి కారు (ఏపీ28డీఎం 6110)లో వెళ్తుండగా ఏసీసీ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. 424.3 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి, రూ.30వేలు నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ. 9.21లక్షలు ఉంటుందని, ఐదు వేట కొడవళ్లు, రెండు కత్తులు లభించాయని ఏసీపీ వెల్లడించారు. మంచిర్యాల సీసీఎస్ పోలీసులు, స్థానిక సీఐ నారాయణ్‌నాయక్, సీసీఎస్ సీఐ, ఎస్సైలను అభినందించి నగదు రివార్డులు అందజేశారు. చదవండి: ఆర్ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం -
నేపాలీ దంపతుల చోరీ కేసు: దేశం విడిచిపెట్టి పోలేదు!
సాక్షి, హైదరాబాద్: టెలికంనగర్‌లోని వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం చేసి పరారైన నేపాలీ దంపతులు దేశం విడిచిపెట్టి పోలేదని పోలీసులు తెలిపారు. మూడు ప్రత్యేక బృందాలు దేశ సరిహద్దు ప్రాంతాలలో విస్తృతంగా గాలింపులు చేపట్టాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ వంటి నాలుగు రాష్ట్రాలలో నిఘా పెట్టామని చెప్పారు. ఇప్పటికే పలు కీలక సాంకేతిక ఆధారాలు లభ్యమయ్యాయని.. వచ్చే రెండు రోజుల్లో నిందితులు ఇద్దరినీ పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొస్తామని ఓ పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. మరిన్ని వివరాలను సేకరించే ప్రయత్నం చేయగా.. ‘తినబోతూ రుచులు ఎందుకని’ సదరు ఉన్నతాధికారి సంబోధించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికంనగర్‌లోని వ్యాపారి బీరం గోవిందరావు ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులు లక్ష్మణ్ (34), పవిత్ర (30)లు గత ఆదివారం 120 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు చోరీ చేసి పరారైన విషయం తెలిసిందే. కేసు నమోదు కాగానే వెంటనే అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు నేపాల్ దంపతులు దేశం దాటకుండా చర్యలు చేపట్టారు. నేపాల్‌కు పారిపోకుండా దేశ సరిహద్దు భద్రతా దళాలకు నిందితుల ఫొటోలు పంపి అప్రమత్తం చేశారు. చోరీ చేయగానే ప్రైవేట్ క్యాబ్‌లో నేరుగా ముంబైకి వెళ్లి అక్కడ్నుంచి విమానంలో నేపాల్‌కు పారిపోవాలని నిందితులు ప్లాన్ వేశారు. కానీ పోలీసుల నిఘా ఉండటంతో ప్లాన్ ఫలించలేదు. నిందితులు ఇద్దరు ముంబై విమానాశ్రయం వద్దే తిరిగినట్లు కీలక సమాచారం పోలీసులకు లభించింది. ఇద్దరు నిందితులతో పాటు వీరికి సహాయపడిన పలువురుని అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. చదవండి: Gachibowli: భారీ చోరీకి పాల్పడిన ‘నేపాల్’ వాచ్మెన్ దంపతులు -
Medak: ఒకేరోజు ఏడు చోట్ల చోరీలు మరువక ముందే..
సాక్షి, జోగిపేట(మెదక్): జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో అందోలులో ఇంటికి తాళాలు వేసి ఎక్కడికైనా వెళ్లాలంటే స్థానికులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం ఒకేరోజు ఏడు చోట్ల దొంగతనాలు జరిగిన సంఘటన మరువకముందే శనివారం మరోసారి దొంగలు రెచ్చిపోయారు. రొయ్యలగూడెం కాలనీలో వరుసగా తాళాలు వేసిన ఏడు ఇళ్లు, రెండు కిరాణ దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. ఇళ్లకు వేసిన తాళాలు పగులగొట్టి నగదు, బియ్యం బస్తాలను అపహరించారు. ► రొయ్యల యాదమ్మ ఇంటి తాళం పగులగొట్టి క్వింటాల్ బియ్యం, ఎల్లమ్మ ఇంట్లో నుంచి 50 కిలోల బియ్యం, బంగారం, లచ్చమ్మతో పాటు మరో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ నాలుగు ఇళ్లవారు హైదరాబాద్‌లో ఉన్న కారణంగా ఇంట్లో ఏఏ వస్తువులు పోయాయో పూర్తి వివరాలు తెలియరాలేదు. ► రాజుకు చెందిన కిరాణా షాప్‌లో రూ.5వేల నగదు, సిగరెట్ ప్యాకెట్లు, డీవీడీ రాజుకు చెందిన కిరాణా డబ్బా షట్టర్ కట్ చేసి వెళ్లిపోయారు. ► ఈ విషయమై ఎస్ఐ వెంకటేష్‌ను వివరణ కోరగా రొయ్యల యాదమ్మ, రాజులు మాత్రమే ఫిర్యాదు చేశారన్నారు. సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు. చదవండి: దారుణం: 8 మందిని బలిగొన్న నిర్లక్ష్యం -
అన్నదమ్ముల పక్కా స్కెచ్.. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్..
సాక్షి, సర(హైదరాబాద్): తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములతోపాటు చోరీ సొత్తు విక్రయించేందుకు సహకరించిన మరో వ్యక్తిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ. 8.90 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం కీసర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి వెల్లడించారు. గత నెల 27న నాగారం నవత అవెన్యూలో నివసించే కె.రమణయ్య ఇంటికి తాళం వేసి వనస్థలిపురంలోని అత్తగారింటికి వెళ్లారు. వచ్చేసరికి గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బెడ్రూంలో ఉన్న బీరువా ఓపెన్ చేసి 600 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు నగదు ఎత్తుకెళ్లారు. రమణయ్య ఇంటిపక్కనే ఉంటే సయ్యద్‌మహ్మద్ ఇంటి తాళాలు పగలగొట్టి వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. వీటితోపాటు నాగారంలోని పలు ఇళ్లలో చోరీలు జరుగుతుండటంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు కీసర ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. శనివారం కీసర పోలీసులు నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న జి.యోగేందర్(27), జి.నాగేందర్(21)తోపాటు ఎన్.స్నేహాత్‌రాజ్(30)ను అదుపులోకి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. యోగేందర్, నాగేందర్‌లు సోదరులు. చెడు అలవాట్లకు బానిసలై దొంగలుగా మారారు. పెయింటర్స్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బు సరిపోక దొంగతనాలు చేస్తున్నారు. యోగేందర్ పలు కేసులో నిందితుడని.. ఇతడిపై పీడీ యాక్ట్ నమోదై ఉంది. క్రైం డీసీపీలు యాదగిరి, షేక్ సాలి, మల్కాజిగిరి జోన్ అదనపు డీసీపీ శివకుమార్, కుషాయిగూడ ఏసీపీ వెంకన్ననాయక్, మల్కాజిగిరి సీసీఎస్ బాలు చౌహాన్, కీసర ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
దైవదర్శనానికి వెళితే ఇల్లు దోచారు
సాక్షి, సఖినేటిపల్లి (తూర్పుగోదావరి) : విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని ఆ కుటుంబం తిరిగి వచ్చేసరికి ఇంటిని దొంగలు దోచేశారు. వివరాల్లోకి వెళితే.. సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన గుబ్బల నాగేశ్వరరావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులు గల్ఫ్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇద్దరు కోడళ్లు వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కుమార్తె అత్తవారింట్లో ఉంది. నాగేశ్వరరావు దంపతులు తొలి ఏకాదశి సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకొనేందుకు శుక్రవారం వేకువజామున విజయవాడ వెళ్లారు. వారు తిరిగి శనివారం రాత్రికి ఇంటికి చేరుకున్నారు. ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండడం గమనించిన నాగేశ్వరరావు ఇంట్లోకి వెళ్లకుండా కిటికీలోంచి చూసేసరికి బీరువాలో బంగారం దాచుకున్న బ్యాగ్ మంచంపై ఖాళీగా కనిపించింది. దాంతో దొంగలు పడ్డారని గ్రహించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు తీసుకునేంతవరకు నాగేశ్వరరావు దంపతులు బయటే ఉన్నారు. రాజోలు సీఐ కేఎన్ మోహన్‌రెడ్డి ఆదివారం సంఘటన స్థలాన్ని సందర్శించి సంఘటన జరిగిన తీరుపై నాగేశ్వరరావును ఆరా తీశారు. కాకినాడ నుంచి ఆదివారం వచ్చిన క్లూస్ టీమ్‌తో పాటుగా నాగేశ్వరరావు దంపతులు ఇంట్లోకి వెళ్లారు. క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. దొంగలు ఇనుప బీరువాలను బద్దలుకొట్టి వాటిలోని బట్టలు, ఆభరణాలు దాచుకున్న సొరుగులు మంచంపై పడేశారు. రూ. 2 లక్షలు విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు, పది తులాల వెండి ఆభరణాలు, నగదు రూ. లక్ష, ఎలక్ట్రికల్ సామగ్రి పోయినట్టు నాగేశ్వరరావు పోలీసులకు తెలిపారు. నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పీవీఎస్‌ఎస్‌ఎన్ సురేష్ తెలిపారు. -
చిదంబరం ఇంట్లో చోరీ.. ట్విస్ట్
సాక్షి, చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగింది. నుగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్ లో ఉన్న ఆయన ఇంట్లో లూటీ జరిగింది. చిదంబరం భార్య నళినీ చిదంబరం నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లి, గత రాత్రి తిరిగొచ్చారు. తలుపులు తెరిచి చూసేసరికి అల్మరాలు ఓపెన్ చేసి ఉండటంతో దోపిడీ జరిగిన విషయాన్ని ఆమె గుర్తించారు. వెంటనే పోలీసులకు ఆమె సమాచారం అందించారు. విలువైన ఆభరణాలు, రూ. 1.50 లక్షల నగదు, ఆరు విలువైన చీరలు చోరీ అయినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. తొలుత ఈ ఘటన వెనుక తమ ఇంట్లో పనిచేసే ఇద్దరు పనిమనుషుల హస్తం ఉండొచ్చని ఆమె అనుమానించారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తే, మాస్క్‌లు ధరించిన ఇద్దరు మహిళలు ఇంట్లోకి వెళుతుండటం కనిపించింది. పదిరోజుల క్రితమే ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు వెనక్కి.. అయితే ఈ వ్యవహారంలో ఎలాంటి అరెస్టులు జరగలేదు. పోలీసు ఫిర్యాదుతో కంగారుపడ్డ ఆ పని మనుషుల కుటుంబ సభ్యులు.. చోరీకి గురైన సొత్తు వెనక్కి ఇస్తామని చిదంబరం ఫ్యామిలీకి చెప్పారు. దీంతో ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదివారం ఉదయం కార్తీ చిదంబరం కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఆభరణాలు ఏవీ చోరీ కాలేదని, కేవలం డబ్బు మాత్రమే అయిందని కార్తీ తెలిపారు. -
ఎమ్మెల్యే అనుచరుడి ఇంట్లో చోరీ
గన్నవరం : ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రధాన అనుచరుడైన ఓలుపల్లి మోహన్‌రంగా ఇంట్లో చోరీ జరిగిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు లోపలికి చొరబడి సుమారు రూ.3.75 లక్షల విలువైన సొత్తును అపహరించుకుపోయారు. పోలీసుల సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఇస్లాంపేట సమీపంలో నివసిస్తున్న మోహన్‌రంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న కుమారైల చదువుల నిమిత్తం రెండేళ్లుగా కుటుంబంతో సహా ఏలూరులో ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన ఆయన.. తన మేనల్లుడిని వాటర్ బాటిల్ కోసం మొదటి అంతస్తులోని తన నివాసానికి పంపించాడు. అయితే, ఇంట్లోని ఉత్తరం వైపు తలుపులు తెరచి ఉండి, బెడ్రూమ్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో విషయాన్ని రంగాకు చెప్పారు. ఆయన వచ్చి చూడగా బీరువాలోని విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు, ఇతర సామాగ్రి కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్దారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈస్ట్ జోన్ ఏసీపీ వి. విజయభాస్కర్, సీఐ కె. శ్రీధర్‌కుమార్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు. శుక్రవారం రాత్రి చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరం వైపున ఉన్న తలుపును బలంగా నెట్టి ఇంట్లోని ప్రవేశించి స్క్రూ డ్రైవర్, కిచెన్‌లోని చాకుతో బీరువా లాకును వంచి వస్తువులను అపహరించుకుపోయారు. సుమారు 152 గ్రాముల బంగారు వస్తువులు, 200 గ్రాముల వెండి వస్తువులు, ఖరిదైన వాచీలు, తదితర సామాగ్రి చోరీకి గురైనట్లు పోలీసులు తేల్చారు. -
ఫేస్బుక్లో పోస్ట్.. ఇల్లు గుల్ల
యశవంతపుర: తాను ఊరికి వెళ్తున్నట్లు ఒక మహిళ ఫేస్బుక్లో పోస్ట్ చేయడం, ఆ తరువాత ఆమె ఇంట్లో దొంగలు పడి రూ. 5 లక్షలు విలువ గల బంగారు అభరణాలను దోచుకుపోయిన ఘటన బెంగళూరు ఆర్టీ నగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఆర్టీ నగరలో నివాసముంటున్న ప్రేమ అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలసి శని, ఆదివారం సొంతూరికి వెళ్లింది. ‘రెండు రోజులు ఫేస్‌బుక్‌కు విరామం. నేను మా ఊరికి వెళ్తున్నాను’ అని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఇది గమనించిన దొంగలు ఇంటి తాళాలను బద్దలుకొట్టి బీరువాలోని రూ. 5 లక్షలు విలువ గల బంగారు అభరణాలను దోచుకెళ్లారు. సోమవారం ఉదయం ఊరి నుంచి తిరిగొచ్చిన ప్రేమ ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదరుగా ఉండడంతో ఆర్టీ నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఊరికి వెళ్తున్నట్లు ఫేస్బుక్లో చేసిన పోస్ట్ గురించి ఆమె పోలీసులకు తెలిపారు. ఆ విషయమే దోపిడికి కారణమంటూ ప్రేమ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఎంపీ సుమన్ ఇంట్లో చోరీ
మంచిర్యాలక్రైం : మంచిర్యాలలోని గౌతమినగర్‌లో గల పెద్దపెల్లి ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దుండగులు తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఇంట్లోని సామాన్లను చిందరవందరగా పడేశారు. ఈ ఘటనలో ఎంపీ ఇంట్లో నుంచి ఎలాంటి సొత్తు చోరీకి గురికాలేదని టౌన్ ఎస్సై శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఎంపీ సుమన్ గతంలో పక్కనే ఉన్న మరో ఇల్లును అద్దెకు తీసుకున్నారు. ఇటీవలే ప్రస్తుత ఇంట్లోకి మారారు. ఇక్కడ సెక్యూరిటీ కానీ, సీసీ కెమెరాలు గానీ ఏర్పాటు చేసుకోలేదు. ఎంపీ సుమన్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంచిర్యాలకు వచ్చినప్పుడు ఈ ఇంట్లో రెండు మూడు రోజులు ఉండి వెళ్లిపోతారు. ఆయన పీఏ మాత్రం రోజూ ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్తారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం ఇక్కడికి వచ్చిపోతుంటారు. శనివారం ఉదయం పీఏ వచ్చేసరికి తాళం పగులగొట్టి, లోపల వస్తువులు చిందరవందర చేసి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) రవికుమార్ ఎంపీ ఇంటిని సందర్శించి, వివరాలు సేకరించారు. ఇంటిలో నుంచి ఎలాంటి వస్తువులు అపహరణకు గురికాలేదని పేర్కొన్నారు. మరో మూడు ఇళ్లలోనూ.. కాగా ఎంపీ సుమన్ ఇంటి పక్కనే ఉన్న వ్యాపారులు తునికిపాటి అమరాచారి, మామిడి సందీప్‌కుమార్ (బిజినేస్) ఇళ్లలో కూడా దొంగలు చోరీకి పాల్పడి విలువైన సొత్తును అపహరించారు. సందీప్ ఇంటి పక్కనే ఉన్న తిరుమల అపార్ట్మెంట్లో ఉంటున్న కనకయ్య ఇంట్లో దొంగతనానికి యత్నించి విఫలమయ్యారు. కాగా అమరాచారి కుటుంబంతో కలిసి ఈ నెల 5న హైదరాబాద్ వెళ్లారు. శనివారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పక్కింటి వారు వెళ్లి చూడగా తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గమనించి పోలీసులకు, అమరాచారికి సమాచారం అందించారు. అమరాచారి ఇంట్లో జరిగిన దొంగనతంలో 20 గ్రాముల బంగారు రుద్రాక్షమాల రూ.2వేలు ఎత్తుకెళ్లారు. అలాగే సందీప్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 2న స్వగ్రామం బెల్లంపల్లికి వెళ్లారు. తాళం పగలగొట్టి ఉండడంతో దొంగలు పడ్డారని భావించిన సందీప్ పోలీసులకు సమాచారం అందించారు. సందీప్ ఇంట్లో రూ.70వేలు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఫింగర్ ఫ్రింట్ నిపుణులు వేలిముద్రలు సేకరించారు. కాగా ఈ దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. -
పనిమనుషుల పనే..?
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్‌నెం–12లోని ఎమ్మెల్యే కాలనీ ఉంటున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నివాసంలో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటనలో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 6న లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ ఓ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చి ఆభరణాలను నగల పెట్టెలో పెట్టి బీరువాలో భద్రపర్చింది. శుక్రవారం రాత్రి మరో శుభకార్యానికి వెళ్ళేందుకు ముస్తాబై ఆభరణాల కోసం చూడగా కనిపించలేదు. ఈ నెల 8న పనిమనిషి నగల పెట్టెను తస్కరించినట్లు అనుమినించిన పోలీసులు ఇద్దరు పని మనుషులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ మిస్టరీ వీడినట్లేనని ఓ అధికారి తెలిపారు. ఆభరణాలు యథాతథంగా నిందితులు దాచిపెట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. నేడో రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. -
ఇంటి యజమాని కళ్లుగప్పి చోరీ..అరెస్ట్
హైదరాబాద్ : నమ్మకంగా ఉంటూ పని చేస్తున్న చోటే దొంగతనానికి పాల్పడిన మహిళను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. తూర్పు గోదావరి జిల్లా మూలాపేట కొత్తపల్లి మండలం ఇంద్రకొలిమి గ్రామానికి చెందిన ఏడిద లక్ష్మి(37) కొంత కాలంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-10 ఎమ్మెల్యే, ఎంపీల కాలనీకి చెందిన అనిల్ గగ్గర్ నివాసంలో పని చేస్తోంది. ఈ నెల 6వ తేదీన యజమాని కప్‌బోర్డ్‌లో ఉన్న రూ.2 లక్షలను కాజేసి, సొంతూరుకు వెళ్లిపోయింది. 8వ తేదీన యజమాని డబ్బు కోసం కప్‌బోర్డులో చూడగా కనిపించలేదు. అప్పటి నుంచి లక్ష్మి ఫోన్లో కూడా అందుబాటులో లేకుండాపోయింది. దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీని అంగీకరించింది. రూ.1.75 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు సోమవారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
చోరీకి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి
పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు చేర్యాల : ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన మండలంలోని కొమురవెల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ... మహారాష్ట్రలోని భువనపటాకు చెందిన పరమానంద్ అనే వ్యక్తి కొమురవెల్లిలోని బత్తిని నర్సింహులు అనే చిరు వ్యాపారి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. నర్సింహులు కుటుంబసభ్యులు తాళం వేసి పొలానికి వెళ్లగా పరమానంద్ ఇంట్లోకి చొరబడి కిరాణా షాపులోని చిల్లర సరుకులు, గల్లాపెట్టెలోని నగదు తీసుకున్నాడు. ఈ విషయం గమనించిన పొరుగువారు నర్సింహులుకు సమాచారం అందించారు. నర్సింహులు ఇంటికి రాగానే అతడితో పాటు స్థానికులు పరమానంద్‌ను స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వద్ద ఎలాంటి ఐడీ అడ్రసులు లేవు, అతడు కూడా గంటకో పేరు చెపుతూ, హిందీలో మాట్లాడుతూ పిచ్చిగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులకు సైతం అర్థం కాలేదు. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇంటి తాళాలు పగలగొట్టి...
చాపాడు: వైఎస్సార్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చాపాడు మండలం ఖాదర్‌పల్లె గ్రామంలో చోరికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మునీరా ఇంటికి తాళాలు వేసి అందరూ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న దాదాపు 135 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.40వేల నగదును ఎత్తుకుపోయారు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో డీఎస్పీ పూజిత సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సెలవులకు ఊరు వెళ్తే.....
చెరుకుపల్లి: తెలుగు రాష్ట్రాల్లో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుని దోచేస్తున్నారు. పండుగ సెలవులకు బంధువుల ఇళ్లకు వెళ్ళడంతో దొంగలు ఏదేచ్ఛగా తెగపడుతున్నారు. గుంటూరు జిల్లాలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. చెరుకుపల్లి మండలం భవానీపురం ప్రాంతానికి చెందిన ప్రతాప్ నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి ఊరెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు సోమవారం రాత్రి తాళాలు పగుల గొట్టి బీరువాలో ఉన్న రూ.1.50 లక్షల విలువైన 5 సవర్ల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. మంగళవారం ఉదయం గమనించిన బంధువులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్పత్రికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
సదుం (చిత్తూరు): వైద్యం కోసం ఉదయం ఇంటికి తాళం వేసి వెళ్లి సాయంత్రం తిరిగొచ్చే సరికి దొంగలు ఆ ఇంటిలో విలువైన సొత్తును మాయం చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సదుం మండలం బుడ్డారెడ్డిగారిపల్లెలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన భాస్కరాచారి, భార్యతో కలసి వైద్యం కోసం శనివారం ఉదయం పుంగనూరు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగిరాగా.. తలపులు తెరచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 105 గ్రామలు బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.