Chittoor: మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌ చల్‌ | Cheddi Gang House Robbery In Chittoor | Sakshi
Sakshi News home page

Chittoor: మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌ చల్‌

Published Mon, Oct 4 2021 8:06 PM | Last Updated on Mon, Oct 4 2021 8:42 PM

Cheddi Gang House Robbery In Chittoor - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరుపతి: టెంపుల్‌ సిటీ తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్‌ అలజడి రేపింది. నిన్న (సోమవారం) అర్ధరాత్రి విద్యానగర్‌ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర ప్రణీతారెడ్డి అపార్ట్‌మెంట్‌లో ఈ గ్యాంగ్‌ చోరీకి పాల్పడ్డారు. నిన్న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ముఠా..  సెక్యురిటీ ఇంటికి బిగాలు ఏర్పాటు చేసి మొదటి ఫ్లోర్‌లో ఉంటున్న విజయలక్ష్మీ ఇంట్లో ప్రవేశించారు. ఆ తర్వాత , వీరు బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.

మూడెళ్ల తర్వాత మరోసారి చెడ్డిగ్యాంగ్‌ అలజడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. అపార్ట్‌మెంట్‌లో ఉండే వారంతా.. తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ముఠాకు సంబంధించి తిరుపతి ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలన్నింటిని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు.  ఈ గ్యాంగ్‌కు ఇతర నేరస్థులతో ఉన్న సంబంధాలపై  కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: Telugu Academy: రూ.64 కోట్లు మాయం.. వారి ఖాతాలో చిల్లిగవ్వ లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement