సెలవులకు ఊరు వెళ్తే..... | house robbery in guntur district | Sakshi
Sakshi News home page

సెలవులకు ఊరు వెళ్తే.....

Published Tue, Oct 27 2015 12:38 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

house robbery in guntur district

చెరుకుపల్లి: తెలుగు రాష్ట్రాల్లో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుని దోచేస్తున్నారు. పండుగ సెలవులకు  బంధువుల ఇళ్లకు వెళ్ళడంతో దొంగలు ఏదేచ్ఛగా తెగపడుతున్నారు.

గుంటూరు జిల్లాలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. చెరుకుపల్లి మండలం భవానీపురం ప్రాంతానికి చెందిన ప్రతాప్ నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి ఊరెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు సోమవారం రాత్రి తాళాలు పగుల గొట్టి బీరువాలో ఉన్న రూ.1.50 లక్షల విలువైన 5 సవర్ల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. మంగళవారం ఉదయం గమనించిన బంధువులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement