బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్‌నెం–12లోని ఎమ్మెల్యే కాలనీ ఉంటున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నివాసంలో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటనలో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 6న లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ ఓ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చి ఆభరణాలను నగల పెట్టెలో పెట్టి బీరువాలో భద్రపర్చింది.
శుక్రవారం రాత్రి మరో శుభకార్యానికి వెళ్ళేందుకు ముస్తాబై ఆభరణాల కోసం చూడగా కనిపించలేదు. ఈ నెల 8న పనిమనిషి నగల పెట్టెను తస్కరించినట్లు అనుమినించిన పోలీసులు ఇద్దరు పని మనుషులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ మిస్టరీ వీడినట్లేనని ఓ అధికారి తెలిపారు. ఆభరణాలు యథాతథంగా నిందితులు దాచిపెట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. నేడో రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment