స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు | Cbi Ex Jd Lakshmi Narayana Key Comments On Visakha Steel Plant Privatisation | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Published Tue, Nov 26 2024 3:53 PM | Last Updated on Tue, Nov 26 2024 5:12 PM

Cbi Ex Jd Lakshmi Narayana Key Comments On Visakha Steel Plant Privatisation

సాక్షి, హైదరాబాద్‌: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఉక్కు సత్యాగ్రహం మూవీ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపుతున్నామని కేంద్రమంత్రి చెప్పి మూడు నెలలైంది.. ఇప్పటివరకు దాని ఊసే లేదన్నారు.

కాగా, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళ, రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని ఆ సంఘాల నేతల విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కర్మాగారంపై, కార్మికులపై రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలను తక్షణం విరమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరుతున్నారు.
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement