jd lakshmi narayana
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఉక్కు సత్యాగ్రహం మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నామని కేంద్రమంత్రి చెప్పి మూడు నెలలైంది.. ఇప్పటివరకు దాని ఊసే లేదన్నారు.కాగా, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళ, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని ఆ సంఘాల నేతల విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కర్మాగారంపై, కార్మికులపై రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలను తక్షణం విరమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరుతున్నారు. -
మైత్రి మూవీస్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ,లక్ష్మీనారాయణల సినిమా
డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం 'భీమదేవరపల్లి బ్రాంచి'. ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. రమేష్ చెప్పాల రచన-దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో ... నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ , సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ , సీనియర్ నేత అద్దంకి దయాకర్ నటించడం సినిమా మీద ఆసక్తి రేకిస్తోంది. ఈ మధ్య "భీమదేవరపల్లి బ్రాంచి" ప్రివ్యూ షో చూసిన సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు.. ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని రచయిత, దర్శకుడు రమేష్ చెప్పాల మీద ప్రశంసలు కురిపించారు. (ఇదీ చదవండి: ఆ చిత్రం రీమేక్‌లో నాగచైతన్య.. క్లారిటీ ఇచ్చిన టీం!) ‘భీమదేవరపల్లి బ్రాంచి" ఒక ఆర్గానిక్ గ్రామీణ చిత్రం. రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్ ఆధారంగా ఈ సినిమాను "నియో రియలిజం" జానర్లో చిత్రీకరించారు. ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. రెండు గంటలు పల్లె వాతావరణం కళ్ళ ముందు కదలాడుతుంది. ప్రతి ఒక్కరిని తమ గ్రామానికి తీసుకెళ్తుంది. ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద ఆసక్తి రేకెత్తించగా ఈ సినిమా కంటెంట్ నచ్చి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. (ఇదీ చదవండి: రజనీ కాంత్ కాదన్న బాబీకి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన బాలకృష్ణ?) -
జీవో నంబర్ 1 సరైనదే.. జేడీ వీవీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
కంచిలి/కాశీబుగ్గ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 సరైనదేనని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కంచిలిలో విలేకరులతో మాట్లాడారు. రోడ్ల మీద సభలు, రోడ్‌షోలు నిర్వహించే సందర్భాల్లో అనువైన స్థలాలను అంచనా వేసేందుకు పోలీసుల అనుమతిని తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్న జీఓ మంచిదని అన్నారు. ఇటీవల జరిగిన ఘటనల దృష్ట్యా ఈ జీఓను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, దీన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని తెలిపారు. అధికార పార్టీకి ఒక విధంగా, ప్రతిపక్ష, విపక్ష పార్టీలకు ఒక విధంగా అమలు చేయకూడదని సూచించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోందని, తాను మాత్రం అలా భావించడం లేదన్నారు. ఎన్నికల నియమావళిలో కూడా సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం ముఖ్యమని, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం వంటి చిన్న రాష్ట్రాల డిమాండ్ సరైంది కాదన్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్టు ప్రకారం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.జగదీష్ పట్నాయక్, మునకాల కృష్ణమూర్తి, సాహుకారి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పనితీరు భేష్.. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చూస్తుంటే ఆనందంగా ఉందని, ఉద్దానం కిడ్నీ రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేపడుతున్నందుకు ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పద్మనాభపురం వద్ద నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిని సందర్శించారు. ఇక్కడి కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని, వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఉద్దానంలో ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించడం గొప్ప పని అన్నారు. ఆయన దత్తత తీసుకున్న సహలాలపుట్టుగను సందర్శించారు. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజుతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. -
జనసేనకు గట్టి షాక్.. ‘జేడీ’ ఔట్
సాక్షి, హైదరాబాద్ : జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడంపై నిరసనగా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీ తీరు, పవన్ కల్యాణ్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న లక్ష్మీనారాయణ... గురువారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు తన రాజీనామా లేఖను పంపారు. ‘పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది. కావున, నేను పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతి కార్యకర్తకి, నాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, వారందరికి మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని జేడీ లేఖలో పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే పవన్, లక్ష్మీనారాయణ మధ్య విభేదాలు వచ్చినట్టు వార్తలొచ్చాయి. అయితే వీటిని ఆయన ఖండించారు. కాగా, ఇటీవల బీజేపీతో జనసేన పొత్తు సహా పలు కీలక అంశాలపై పార్టీ తనను సంప్రదించకపోవడంపై లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో...
సాక్షి, హైదరాబాద్ : సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ‘జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్ బీ ఫారాలు ‘పోగొట్టుకున్నట్టు’ గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి. పాపం! బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మద్ధతు మాత్రం మీకివ్వమని తండ్రీ కొడుకులిద్దరూ కేడర్‌కు చెప్పిన విషయం నిజం కాదా జేడీ గారూ?. ఓట్లు చీల్చి జనాలను వెర్రి పుష్పాలు చేసేందుకు వేర్వేరుగా పోటీ చేశారు. మీ చీకటి పొత్తులను ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారు. హిజ్ మాస్టర్స్ వాయిస్ (హెచ్ఎంవీ) (His Master's Voice (HMV)) అన్న బిరుదు మీకు చక్కగా సరిపోతుంది జేడీ గారూ. తెలుగుదేశంలో చేరాలనుకుని ముహూర్తం కూడా పెట్టుకున్నాక, మీ బాస్ చెప్పినట్టు ఆఖరి క్షణంలో జనసేనలో చేరారు. మీ కమిట్మెంట్ను అభినందించాల్సిందే. ఒకటి నుంచి ఐదు అంకెల్లో ఏది లక్కీ నంబరో వెతుక్కుని లెక్కలు వేసుకోండి. జేడీ గారూ, మీ నాయకుడు కుప్పం, మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో ఒక మాట అడిగి క్లారిటీ ఇవ్వండి. 88 సీట్లు గెలుస్తారో లేదో దీన్ని బట్టే తెలిసి పోతుంది. ‘ప్రశ్న ప్యాకేజీ కోసం రాజీపడి పాదాక్రాంతమైతే’ ప్రజలు నిర్దయగా గుణపాఠం చెబుతారని చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది. ‘లక్ష్మీనారాయణ గారూ మీరు ఈ రోజుకూ జేడీనే. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశానికి-జనసేనకు జాయింట్ డైరెక్టర్!. నేరగాళ్ళ పార్టీకి, విలువల్లేని పార్టీకి తమరే సంయుక్త సంచాలకులు!. మీరు 2 నెలల క్రితం లోక్ సత్తా కండువా కప్పుకోబోయి.. నెల క్రితం భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యి...ఆ తర్వాత 2 రోజుల్లోనే జనసేన తరఫున విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు. 3 నెలల్లో 3 పార్టీలు! అహా ఏమి ప్రజాస్వామిక విలువలు? ఏమి రాజకీయ విలువలు?. మీ టిక్కెట్ల లోగుట్టు అందరికీ తెలిసినదే. తీర్థం (బీఫామ్ మీద సంతకం) జనసేనది. ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీఫామ్‌లు. కాదు మొత్తం తెలుగుదేశం చెపితేనే ఇచ్చాం అని మీరు ఒప్పుకోదలుచుకుంటే మీ ఇష్టం!.’ అంటూ విజయసాయి రెడ్డి వరుసపెట్టి ట్విట్లు చేశారు.’ అంటూ విజయసాయి రెడ్డి శనివారం వరుసపెట్టి ట్విట్లు చేశారు. -
తొలగిన జేడీ లక్ష్మీనారాయణ ముసుగు...
శకునాలు చెప్పే బల్లి కుడిత తొట్లో పడి చచ్చినట్లుగా ఉంది సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) వాసగిరి వెంటక లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ తీరు. అవినీతిని అంతం చేసేందుకు పుట్టిన కారణజన్ముడిగా పాపులర్ అయి, ఆ వాపులో, కైపులో సమాజాన్ని ఉద్దరించేందుకు అభివృద్ధి, సంక్షేమం పునాదిగా సరికొత్త రాజకీయాలు, పాలనను అందించేందుకు కంకణం కట్టుకున్నానని ప్రకటించిన జేడీ అదే రాజకీయ రొచ్చులో కూరుకుపోయాడనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది సీబీఐలో తన పదవికి రాజీనామా చేసిన జేడీ లక్ష్మీనారాయణ ‘వందేమాతరం’ లేదా ’జనధ్వని’ అనే పేరుతో కొత్త పార్టీ పెట్టాలని, జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సులర్ రాజగోపాల్‌తో కలిసి తీవ్రంగా కసరత్తు చేశారు. తర్వాత ఆరెస్సెస్ మహాసభలో జేడీ పాల్గొనడంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు ఫిబ్రవరిలో టీడీపీలే చేరేందుకు ఆహ్వానం అందుకున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. వీటన్నిటిపై ఓ లుక్ వేసిన ఆయన చివరకు సామాజిక రాజకీయ అంశాల్లో గందరగోళ దృక్ఫథం కలిగిన జనసేన పార్టీలో చేరడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయ బాల్యరిష్టం అందరికీ అర్థమైపోయింది. కులం కుడితి తొట్లో ఆయన పడ్డారని పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. సత్యం కంప్యూటర్స్, ఓవోంసీ, ఫోక్స్ వ్యాగన్, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా బనాయించిన కేసులు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రబుద్దీన్, ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్...కేసుల దర్యాప్తు చేసిన జేడీ చివరకు రాజకీయ చదరంగంలో పావుగా మారారు. కేంద్రంలో అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ‘పంజరంలో చిలక’లాగా నడుచుకుంటుందన్న అపఖ్యాతి మూటగట్టుకుని, ఇప్పటికీ అనేక అంతర్గత వివాదాలతో అప్రతిష్ట పాలైన సీబీఐలో పనిచేసే ఒక ఉద్యోగి స్వతహా సంచలనాత్మక దాడులకు పాల్పడటం ఏ మేరకు సాధ్యమో అందరికి తెలిసిన విషయమే. ప్రత్యర్థి రాజకీయ వర్గాలను తీవ్ర ఇబ్బందులు పాలు చేయాలనుకున్న సమయాల్లో అధికార పార్టీ కొందరు ఉన్నతాధికారులను సాధనాలుగా వినియోగించడంతో పాటు, దానికి అనుకూల మీడియాతో వారికి ఎక్కడలేని ప్రచారం తీసుకురావడం వల్ల ఆ అధికారులకు విపరీతమైన పేరు ప్రతిష్టలు రావడం దేశ చరిత్రలో అనేక ఉదంతాలు ఉన్నాయి. ఆ అవసరం తీరిపోయాక వారు గడ్డిపరకతో సమానంగా మారిపోవడం చూస్తునే ఉన్నాం. అలాంటి కోవలోనే జేడీ లక్ష్మీనారాయణ దేశవ్యాప్తంగా సంచలనాత్మక కేసులు అధికార పార్టీ ప్రోద్బలంతో చేపట్టి పాపులర్ అయ్యారు. గిరిగిరా తిరుగుతున్న కుమ్మరి అరె మీద ఎక్కి దానితోపాటే తిరుగుతున్న ఈగ తానే ఆ ఆరెను తిప్పుతున్నానని భ్రమించినట్లు జేడీ లక్ష్మీనారాయణ చేపట్టిన కేసులన్నీ తనవల్లను తెల్లారినట్లు, తన తెలివితేటలు, ఆదర్శాల వల్లే సంచలనాత్మకమైనాయని ఆయన భ్రమించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇక జరగబోయే ఎన్నికల్లో టీడీపీపై ఏర్పడిన వ్యతిరేకత ప్రతిపక్ష పార్టీ ఖాతాలోకి ఓట్లుగా జమ కాకుండా ఉండేందుకు, పవన్ కళ్యాణ్ సినిమా గ్లామర్‌ను వినియోగించుకొని వ్యతిరేక ఓట్లను జనసేన పార్టీకి మళ్లించడం ద్వారా తిరిగి అధికారంలోకి రావచ్చని చంద్రబాబు వ్యూహం. ఆ వ్యూహాన్ని సమర్థంగా అమలు చేస్తున్న పవన్‌తో కలిసి పనిచేయడమంటే కుల, మత, ముఠా రాజకీయాల రొచ్చులో జేడీ దిగబడటమే.13 జిల్లాల్లో రైతు సమస్యలపై అధ్యయన సమావేశాలు, సొంతపార్టీ పెట్టేందుకు హడావుడి, లోక్‌సత్తాకు కాయకల్ప చికిత్స చేసి పునర్జీవనం చేయబోతున్నట్లు పుకార్లు, బీజేపీ, టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు...వెరసి జేడీ చివరకు ఒక అసంబద్ధ, అర్థరాహిత్య పార్టీ పంచన చేరారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఎంపీ బరిలో జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ‘ప్రశ్నిస్తా’ అంటూ అధికార పక్షాలను కాకుండా ప్రతిపక్షాలను ప్రశ్నించే విడ్డూరు రాజకీయ వేత్త పవన్ కల్యాణ్ నాయకత్వంలో జేడీ సమాజాన్ని బాగు చేసేందుకు ఏం చేయగలరో?. ఇక ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖను ఉద్దరించే మొనగాడు అంటూ రాయలసీమకు చెందిన జేడీని ...పవన్ కల్యాన్‌ను ఆకాశానికి ఎత్తేయడం ఒక వైచిత్రి. కరువు కాటకాలతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సీమ బిడ్డగా పుట్టిన జేడీ ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. రైతాంగ సమస్యలు, ఏపీ రాజధాని అమరావతి కోసం భూసేకరణ సమస్యలు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ సమస్యలు, ప్రత్యేక హోదా సహా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కనీస అవగాహన లేని పవన్ మార్గదర్గకత్వంలో ‘రిల్ హీరో’ ప్రస్థానం వెనుక రాజకీయ వ్యూహం ఇప్పటికే తెల్లతేటమైంది. మరోవైపు విశాఖపట్నాన్ని మరో సింగపూర్ చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతూ.. మందీమార్బలంతో హడావుడి చేసి కూడా.. నయాపైసా ఖర్చు కాకుండా నామినేషన్ వేశానని డబ్బా కొట్టుకుంటూ.. ప్రచారంలో నా స్టైలే వేరు అని బీరాలు పోతున్న జేడీ లక్ష్మీనారాయణ ...ఓ కుల పెద్దలతో రహస్య సమావేశాలు నిర్వహించడం నగర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నాలుగు రోజుల కిందట నగరంలోని వాల్తేరు క్లబ్లో ఓ సామాజికవర్గానికి చెందిన 350 మందితో ఆయన సమావేశమయ్యారు. ఆ భేటీలో.. ‘నేను మీ ప్రతినిధిగా పోటీ చేస్తున్నాను.. విశాఖ ఎంపీ అభ్యర్థిగా మీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం వచ్చినట్టుగా భావించి పనిచేయండి..’ అని కోరినట్టు భోగట్టా. అదేవిధంగా ఇటీవల రుషికొండ సమీపంలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ సంస్థలో కూడా ఇదే మాదిరి కుల ప్రతినిధులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికల ముందే జేడీ అసలు రంగు బయటపడినట్లు అయింది. -
అమ్మ.. జేడీ!
వివేకానందుని బోధనలు.. గ్రామ స్వరాజ్యం.. యువశక్తి.. ఇలాంటి సందేశాలెన్నింటినో అనర్గళంగా ప్రవచించేస్తుంటారాయన..అవన్నీ నిజమేనేమో.. నిజంగా ఆయన సంఘ సంస్కర్తేమోనని నమ్మేసి.. రాష్ట్రంలోని చాలా విద్యాసంస్థలు ఆయన్ను పిలిచి మరీ.. తమ విద్యార్థులకు ఆయనగారి సూక్తులు వినిపింపజేస్తుంటాయి..ఆ వ్యక్తి మరెమరో కాదు.. మాజీ సీబీఐ జేడీ, ప్రస్తుత విశాఖ లోక్‌సభ జనసేన అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ.అయితే.. సంస్కర్త అనేది.. ఆయన తొడుక్కున్న ముసుగా?.. ఆయన పైనా ’ఆదాయానికి మించిన ఆస్తులు’ ఆరోపణలున్నాయా..??పోలీసు మార్కు మార్చేసి.. ఇక ఖద్దరు మార్కు చూపిస్తానని చెబుతున్న జేడీ పోలీసు ‘మార్కు’ వెనుక ఎన్నో ‘మైనస్‌లు’ ఉన్నాయా..?!ఎవరు ఏ ప్రశ్న వేసినా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.. అని ఎక్కడికక్కడ తప్పించుకుంటున్న జేడీ.. అసలు విజ్ఞత ఏమిటి..?తాను దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టానని చెప్పుకొంటున్న ఆయన 28 ఏళ్ల సర్వీసులో అందుకున్న జీతభత్యాలతోనే అన్నేసి కోట్ల ఆస్తులు ఎలా సంపాదించేశారు?..నయాపైసా అప్పు లేకుండా.. కోట్ల విలువైన స్థిరచరాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి??..ఇప్పుడు ఇవే ప్రశ్నలు జేడీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి..ఎన్నికల అఫిడవిట్లో స్వయంగా జేడీనే పేర్కొన్న వివరాలు చూస్తే ఎవరికైనా మతిపోకమానదు.. అనుమానమూ రాకమానదు. కావాలంటే మీరు ఆ చిట్టా చూద్దురు గాని రండి.. – గరికిపాటి ఉమాకాంత్సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వి.వి.లక్ష్మీనారాయణ.. అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ.. ఈ పేరును ఓ ’వర్గ’ మీడియా ఎందుకు బలవంతపు సెలబ్రిటీని చేసిందో మళ్లీ మళ్లీ చెప్పనక్కర్లేదు. నిజాయితీ, నిక్కచ్ఛి అధికారి అంటూ పదే పదే బాకా ఊదేసి ప్రజల మీదకు వదిలేసింది. ఇక ఈయన గారేమో చేస్తున్న ఉద్యోగం కూడా వదిలేసి.. వివేకానందుని బోధనలు.. గ్రామ స్వరాజ్యం.. యువశక్తి..లాంటి ఎన్నో షుగర్ కోటెడ్ పలుకులు అనర్గళంగా వల్లిస్తూ.. రాజకీయాల్లోకి వచ్చేశారు. అది కూడా నాటకీయ పరిణామాల మధ్య లోక్‌సత్తా టు జనసేన వయా టీడీపీ.. పక్కా ప్రణాళికతోనే సాగింది. ఇక అసలు విషయానికొస్తే.. జనసేన తరఫున విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఈ లక్ష్మీనారాయణ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న స్థిర, చరాస్తుల వివరాలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి. జీతభత్యాలు తప్పించి తనకు ఎటువంటి వ్యాపారాలు, వ్యాపకాలు లేవని.. వారసత్వంగా కూడా ఎటువంటి ఆస్తులు రాలేదని చెప్పుకొస్తున్న లక్ష్మీనారాయణకు మొత్తంగా రూ. 8.66 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా పూర్తి కాలం సర్వీసు కూడా చేయకుండానే అన్ని ఆస్తులు ఎలా కూడబెట్టారన్నది ప్రశ్నార్ధకమే. పోనీ 2018 మార్చిలో స్వచ్ఛంద విరమణ తర్వాత వచ్చిన బెనిఫిట్స్‌తో కూటబెట్టుకున్న ఆస్తులా.. అంటే.. కానే కావు మొత్తం సర్వీసులో ఉండగానే పోగేసుకున్న ఆస్తులవి. ఆ లెక్క ఎలా ఉందంటే.. మొత్తం ఆస్తులు.. రూ. 8.66 కోట్లు అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం వి.వి. అలియాస్ జేడీ లక్ష్మీ నారాయణ మొత్తం స్థిర, చరాస్తుల విలువ 8.66 కోట్లు. తన వద్ద రూ.1,16,500, భార్య ఊర్మిళ వద్ద రూ.1,70,00, కుమార్తె 22,000 నగదు ఉన్నట్టు పేర్కొన్నారు. తన పేరున యాక్సిస్ బ్యాంకులో రూ. 73,646 , ఆంధ్రా బ్యాంకులో రూ.1,79,450 ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టు వివరించారు. మ్యూచువల్ ఫండ్స్‌లో తన పేరిట రూ.1,33,69,092, భార్య పేరిట రూ.3,65,995 చరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం చరాస్తులు చరాస్తుల లెక్క చూస్తే.. తన పేరిట రూ.6,67,88,695 చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో.. చేతిలో ఉన్న నగదు రూ.1,16,500గా పేర్కొనగా.. ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో రూ.1,33,69,092, ఆంధ్రాబ్యాంక్ క్యాపిటల్ గెయిన్ బాండ్స్‌లో రూ.17,47,630, ఆంధ్రా బ్యాంక్ మరో అకౌంట్లో రూ.1,79,450, ఎస్బీఐలో రూ.93,517, యాక్సిస్ బ్యాంక్‌లో రూ.5,01,285, మరో యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో రూ.71,444, రూ.73,646 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అదేవిధంగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.1,35,001, రూ.85,260 విలువైన ఎల్ఐసీ ప్రీమియం, రూ.87 వేల విలువైన పోస్టల్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల విలువైన పీపీఎఫ్ ఉంది. శంకరపల్లిలో ఎకరం రూ.6లక్షలేనట! ఇక లక్ష్మీనారాయణ తన భార్య ఊర్మిళ పేరుతో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మసనిగూడలో సర్వే నం.249/ఎ2, ఏ7–ఏ10, సర్వే నం.249/ఎఎ2, సర్వే నం.249/ఎఎ1లలో 1.25 ఎకరాలను 2013 అక్టోబర్ 17న కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినప్పుడు దాని విలువ రూ.3,84,707 కాగా.. ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 25లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. అదే గ్రామంలో సర్వే నం.249/ఏ1/2, సర్వే నం.253/ఈ2లో నాలుగు ఎకరాలను 2018 మే 23న కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినప్పుడు విలువ రూ.8,79,333 కాగా.. ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.25 లక్షలని అఫిడవిట్లో పొందుపరిచారు. వాస్తవంగా రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిన నేపథ్యంలో శంకరపల్లి భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఇప్పటికే చుట్టూ రిసార్ట్లు ఏర్పాడ్డాయి. కానీ లక్ష్మీనారాయణ ఇప్పటికీ అక్కడ ఎకరం ధర సుమారు రూ.6.25 లక్షల మేరకే ఉందని పేర్కొన్నారు. అపార్ట్మెంట్ల ధరల్లోనూ అనుమానాలే మహారాష్ట్రలోని పూణెలో ముల్షీ తాలుకా, బవ్దాన్లోని సన్ గ్రాన్డ్యూర్లో 1300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ నం.702ను 2004 జూన్ 17న దాగుడు సురేష్ అనే వ్యక్తి నుంచి రూ. 7,10,667కి కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.75 లక్షలు. ప్రస్తుతం దీన్ని డెవలప్మెంట్కి ఇచ్చారు. వాస్తవంగా పూణె వంటి మహా నగరంలో 1300 చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలం రూ.75 లక్షలు మాత్రమేనని చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. కాగా అదే ప్రాంతంలో ప్లాట్ నెం.701 కూడా తనకున్నట్లు లక్ష్మీనారాయణ గతంలో ప్రభుత్వానికి సమర్పించిన వార్షిక ఆస్తుల వివరాల్లో పేర్కొన్నారు. కానీ ఎన్నికల అఫిడవిట్లో ఆ ప్లాట్ విషయం ప్రస్తావించలేదు. ఇక హైదరాబాద్‌లోని కరోల్‌బాగ్‌లో లక్ష్మణ్ ఎన్‌క్లేవ్‌లో 20.90 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని(బిల్టప్ ఏరియా 880చదరపు అడుగులు) ఫ్లాట్ నం.202ను లక్ష్మీనారాయణ తన భార్యకు 2008 మే 17న గిఫ్ట్‌గా ఇచ్చారు. కొన్నప్పుడు విలువ రూ.5.50 లక్షలనీ ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.27 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. మెహదీపట్నం పక్కనే ఉన్న కరోల్‌బాగ్‌లో కనీసం అర రూ.కోటి పెట్టినా ఫ్లాట్ రావడం గగనమే. మొత్తంగా చూస్తే లక్ష్మీనారాయణ సమర్పించిన ఆస్తుల లెక్క ఎన్నో సందేహాలకు తావిస్తోంది. ముంబైలోరూ.5 కోట్ల ఫ్లాట్ ముంబైలోని వసుంధర కోపరేటివ్ సొసైటీలో ఉన్న ఫ్టాట్‌ను రూ.5 కోట్లకు అమ్మారు. ఆ తర్వాత అదే రాష్ట్రంలో ఎన్సీసీ అర్బన్‌లోని టవర్ నం.1లో 2018 ఏప్రిల్ 5వ తేదీన ఓ ఫ్లాట్ కొనుగోలుకు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ ఫ్లాట్ ధర ఎంత, ఎంత మొత్తం అడ్వాన్స్ ఇచ్చారో అఫిడవిట్లో పొందుపరచలేదు. ఇక ఆయన భార్యకు రూ.28లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నట్టు పేర్కొన్నారు. అంటే సుమారుగా ముప్పావు కేజీ బంగారం ఉందన్న మాట. నాలుగేళ్లలో పది రెట్లు పెరిగిన ఆదాయం అఫిడవిట్లో పేర్కొన్న ఆదాయ వివరాలు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే. ఆదాయపన్ను శాఖకు చెల్లించిన పన్నుల ప్రకారం 2013–14 ఆర్ధిక సంవత్సరంలో లక్ష్మీనారాయణ వార్షికాదాయం రూ. 23 లక్షలు కాగా, 2017–18నాటికి ఏకంగా పదిరెట్లు పెరిగింది. 2017–18లో ఆయన వార్షిక రూ.2కోట్ల 21లక్షల79వేల348గా పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో ఆదాయం అమాంతం పదిరెట్లు ఎలా పెరిగిందన్నది ప్రశ్నార్ధకంగా ఉంది. పవన్‌కు ఎకరా @రూ.27లక్షలు.. జేడీకి ఎకరా@రూ.6.25లక్షలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా అదే శంకరపల్లి మండలం జన్వాడలో భూములున్నాయి. ఆయన తన అఫిడవిట్లో ప్రస్తుతం మార్కెట్లో ఎకరా విలువ రూ.27 లక్షలకు పైగా ఉందని పేర్కొన్నారు. కానీ లక్ష్మీనారాయణ మాత్రం నాలుగు ఎకరాల భూమి కేవలం రూ.25 లక్షలేనని పేర్కొనడం గమనార్హం. కొసమెరుపు ఎవరు ఏ ప్రశ్న వేసినా.. ఏ ఆరోపణ చేసినా.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.. అని ఎక్కడికక్కడ తప్పించుకుంటున్న లక్ష్మీనారాయణా.. అసలు మీ విజ్ఞత ఏమిటి?.. ఎవరి ముసుగు మీరు.. విశాఖకు దిగుమతైన మీ అసలు రూపం ఎవరు.. మీరు చెప్పకపోయినా విజ్ఞులైన విశాఖ ప్రజకు ఆ మాత్రం తెలియకుండా ఉండదు.. ఏమంటారు? మనువాదీ.. వీటికి సమాధానమేదీ? : అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కుల వ్యవస్థను వ్యతిరేకిస్తున్నట్టు పైకి చెబుతూ అసలైన మనువాదిగా వ్యవహరించే జేడీ లక్ష్మీనారాయణ హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంకరాపల్లిలో ఎకరం రూ.2 కోట్ల విలువైన భూమిని నాలుగు లక్షలకే ఎలా కొన్నారో ప్రజలకు చెప్పాలని వైఎస్సార్సీపీ నేత, అమలాపురం ఎంపీ రవీంద్రబాబు డిమాండ్ చేశారు. పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించానని చెప్పుకొనే లక్ష్మీనారాయణ రూ. 6.5 కోట్ల చరాస్తులు ఉన్నట్లు, ముంబయిలో ఐదు కోట్లుకు ఫ్లాట్ అమ్మినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారన్నారు. ఉద్యోగం తప్ప ఏ ఆధారం లేదని చెప్పుకునే ఆయనకు ఏడాదికి రూ.20 లక్షలకు మించి ఆదాయం రాదని, మరి ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రస్తుతం శంకారాపల్లిలో ఎకరా భూమి ఖరీదు రెండు కోట్లని, కానీ జేడీ కేవలం నాలుగు లక్షలకే తన భార్యపేరు మీద కొనుగోలు చేసినట్లు అఫిడవిట్లో జేడీ పేర్కొనడం చూస్తేనే ఆయన నిజాయితీ ఏపాటిదో అర్ధమవుతుందన్నారు. తాను క్వార్టర్స్‌లోనే నివసించేవాడినని చెప్పుకున్న ఆయన 2014లోనే క్వార్టర్స్ ఖాళీ చేశానని అఫడవిట్లో పేర్కొన్నారని, 2018 వరకు ముంబయిలో ఎక్కడున్నారో అఫిడవిట్లో ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు. ఆయన ఆదాయం లెక్కలు చూస్తేనే క్విడ్‌ప్రోకోలో భాగంగానే లక్ష్మీనారాయణ కోట్లు సంపాదించారని అర్థమవుతుందని ఎంపీ రవీంద్రబాబు వ్యాఖ్యానించారు. -
మాజీ జేడీ లక్ష్మీ నారాయణపై ఎంపీ రవీద్రబాబు ఫైర్
-
ముసుగు తొలగించి లక్ష్మీనారాయణ టీడీపీలోకి...
సాక్షి, అమరావతి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటుకు రూ.5 కోట్లు ఆఫర్ ఇస్తూ ఆడియో వీడియో టేపులతో సహా అడ్డంగా దొరికిపోయిన సీఎంను ఈ దేశ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడైనా చూశారా? ఇంత అడ్డంగా దొరికిపోయినప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ నిస్సిగ్గుగా పదవిని పట్టుకుని వేళ్లాడుతున్న బరితెగించిన ఓ వింతజీవిని ఈ ప్రపంచంలో ఇంతకుముందు ఎక్కడైనా ఎవరైనా చూశారా!? గోప్యంగా ఉంచాల్సిన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుని సాక్ష్యాలతో సహా దొరికిపోయిన ప్రభుత్వం గురించి ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా!? ఇలాంటి దిగజారుడు రాజకీయాల గురించి మన రాష్ట్రంలో ఇప్పుడు వింటున్నాం.. కళ్లారా చూస్తున్నాం. కొండలాంటి తండ్రిని కోల్పోయిన యువకుడు... తన తండ్రి కోసం పగిలిన గుండెలను పలకరించదలిచాడు. అధిష్టానం ఒప్పుకోలేదు. అయినా మాట తప్పనన్నాడు. పార్టీ నుంచి వెళ్లగొట్టినా వెరవలేదు. ప్రజల కోసం మొండిగా నిలబడ్డాడు. ఈ యువకుడిని రాష్ట రాజకీయాల నుంచి తప్పిస్తే ఇక తమకు తిరుగుండదని భావించిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో జత కలిసింది. కుట్రలకు తెరలేచింది. పుంఖానుపుంఖాలుగా తప్పుడు కేసులు బనాయించారు. అయినా ఆయన భయపడలేదు. ట్రక్కుల కొద్దీ న్యూస్ ప్రింట్‌పై విష ప్రచారాన్ని గుప్పించారు. ప్రేమించే ప్రజలపై, పూజించే దైవంపై భారం వేసి ఆ యువకుడు నిబ్బరంగా ముందుకే సాగాడు. ఆర్థిక మూలాలు నరకబోయారు. అయినా ధైర్యం వీడలేదు. కపటంతో హత్య చేయాలని చూశారు. అయినా ఎవరికీ తలవంచలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి పాత కథలకు సానబెట్టి మళ్లీ విష ప్రచార వ్వూహాలకు తెరతీస్తున్నారు. సర్వ శక్తిమంతురాలైన సోనియా గాంధీని ఇచ్చిన మాట కోసం ఎదిరించిన ధీరుడిపై అధికార టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. కేసుల భయంతో మోదీకి లొంగిపోయాడంటూ విష ప్రచారం సాగిస్తోంది. ఆరు మాసాల క్రితమే కదా జగన్ భార్య భారతి పేరును కూడా ఈడీ చార్జిషీట్లో చేర్చింది. నిజంగా లొంగిపోయి ఉంటే ఇలా జరుగుతుందా? ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వారైనా ఇలాంటి కారుకూతలు కూస్తారా!? ఎన్నికలంటేనే హడలిపోతున్న ఏపీ సీఎం చంద్రబాబు మరో రాజకీయ కుట్రకు తెరతీస్తున్నారు. తన ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతతో బెంబేలెత్తుతున్న ఆయన ఈడీ, సీబీఐ వంటి సంస్థల్లో ఉన్న తమ అస్మదీయ అధికారులతో కలిసి మరో పన్నాగం పన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పెట్టించిన అక్రమ కేసులను ప్రధానాంశంగా చేసుకుని మరోసారి పెద్ద ఎత్తున అసత్య ప్రచారానికి ఒడిగట్టారు. వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లొంగిపోయారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. దాన్ని తన అనుకూల మీడియా ద్వారా వ్యాప్తిలోకి తెచ్చి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లేందుకు ఉపక్రమించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ చానళ్ల సర్వేలు తేల్చి చెప్పడంతో బాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆయనలోని అసలు మనిషి బయటికొస్తున్నాడు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల్ని తప్పుదారి పట్టించాలన్నదే చంద్రబాబు అండ్ కో మొదలుపెట్టిన కుట్ర. ఈ మేరకు చంద్రబాబు, ఆయన అస్మదీయ అధికారులు, అనుకూల మీడియా పెద్దలు చర్చించుకుని ‘పచ్చ’కుట్రకు రూపకల్పన చేశారు. రానున్న కొద్ది రోజుల్లో రాష్ట్రంలో భారీ దుష్ప్రచారంతో ప్రజల్ని మోసగించాలన్న చంద్రబాబు కుట్ర ఇలా ఉంది. ప్రజా వ్యతిరేకతతో బెంబేలు తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని గుర్తించిన చంద్రబాబు హడలిపోతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా విషయంలో రాజీపడటం, రాజధాని నిర్మాణంలో వైఫల్యం, సంక్షేమ పథకాలు అమల్లో చేతులేత్తేయడం, యథేచ్ఛగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ ప్రభుత్వం అంటేనే ప్రజలు మండిపడుతున్నారు. దాంతో రాష్ట్రంలో చంద్రబాబు గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని ఇంటలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో తనకు అలవాటైన రీతిలో రాజకీయ కుట్రకు బాబు తెరతీశారు. తాము గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన దుష్ప్రచార కుట్రను మరోసారి అమలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పకడ్బందీగా స్కెచ్ వేశారు. మోదీకి లొంగిపోయారంటూ విష ప్రచారం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ పాలనపై మరోసారి తప్పుడు ప్రచారం, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తాము పెట్టించిన అక్రమ కేసుల్లో కదలిక అంటూ హడావుడి చేయడం.. ఆ కేసుల వల్లే ప్రధాని నరేంద్రమోదీకి జగన్ లొంగిపోయారనే దుష్ప్రచారాన్ని తీవ్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పన్నాగం పన్నారు. జగన్‌పై గతంలో తాము పెట్టించిన అక్రమ కేసుల అంశాన్ని ప్రస్తావిస్తూ తమ మీడియాలో అసత్య ప్రచారంతో ఊదరగొట్టాలని నిర్ణయానికొచ్చారు. గతంలో ఈడీ సీబీఐకి రాసినట్లుగా చెబుతూ ఓ లేఖను హఠాత్తుగా టీడీపీ తెరపైకి తెచ్చింది. ఆ లేఖను టీడీపీ సోషల్ మీడియా విభాగం మంగళవారం రాత్రి నుంచి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఈ అసత్య ప్రచారాన్ని తమ రాజకీయ స్వార్థానికి అనుకూలంగా చేసుకుంటూ వై.ఎస్.జగన్‌పై విషం చిమ్మేందుకు పన్నాగం పన్నారు. జగన్‌పై నమోదైన కేసుల విచారణ అంశాలు 2017లోనే కేంద్రానికి చేరినట్లుగా ఓ కథను వినిపిస్తున్నారు. అందుకు భయపడే మోదీకి జగన్ లొంగిపోయారని ప్రజల్ని తప్పుదారి పట్టించాలని భావిస్తున్నారు. ఈ మేరకు తమ మీడియాలో నెలరోజుల పాటు అంటే ఎన్నికల వరకూ రోజుకో రీతిలో పెద్ద ఎత్తున తప్పుడు వార్తలతో ఊదరగొట్టాలన్నదే చంద్రబాబు పన్నాగమని స్పష్టమవుతోంది. బీజేపీతో కలిసి కాపురం చేసింది బాబు కాదా? వాస్తవానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం వెరవకుండా ఆనాడు యూపీఏ ప్రభుత్వంతోనూ, ఈనాడు ఎన్టీయే ప్రభుత్వంతోనూ పోరాడుతోంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే. రాష్ట్ర ప్రగతికి సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జగన్ 2014 నుంచి ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రాన్ని నిలదీస్తూ తమ ఎంపీలతో రాజీనామా చేయించారు. మోదీకి భయపడితే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా!? తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు హడావుడిగా హైదరాబాద్‌ను విడిచి అమరావతికి వచ్చేశారు. ఇక పోలవరం, రాజధాని నిర్మాణ పనుల్లో అక్రమాలు, అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందనే భయంతో ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారు. కేంద్రంలో బీజేపీతో నాలుగేళ్లు కలిసి కాపురం చేశారు. అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ నోరు విప్పిన పాపానపోలేదు. తాజాగా రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమచారాన్ని ప్రైవేటు సంస్థలకు అమ్ముకుని మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఇక ఈడీ గానీ, సీబీఐ గానీ జగన్‌పై పెట్టిన అక్రమ కేసుల విచారణన ఏమాత్రం నెమ్మదించలేదు. జగన్ భార్య భారతికి కొన్ని నెలల క్రితమే ఈడీ నోటీసులు జారీ చేసింది. మోదీకి లొంగి ఉంటే జగన్ భార్యకు నోటీసులు వస్తాయా? ఆ వాస్తవాలను కప్పిపుచ్చుతూ జగన్ ప్రధాని మోదీకి లొంగిపోయారనే దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున తెరపైకి తేవాలని చంద్రబాబు నిర్ణయించారు. ముసుగు తొలగించి లక్ష్మీనారాయణ టీడీపీలోకి... జగన్‌పై దుష్ప్రచారాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌పై పెట్టించిన అక్రమ కేసుల విచారణలో తమ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్(జేడీ) లక్ష్మీనారాయణను అధికారికంగా టీడీపీలోకి చేర్చుకోవాలని నిర్ణయించారు. జగన్ గురించి రాష్ట్రంలో తప్పుడు ప్రచారం చేయించడంలో చంద్రబాబుకు పూర్తిగా సహకరించింది లక్ష్మీనారాయణే. ఆ కేసుల విచారణలో ఆయన ఏమాత్రం నిబంధనలను పాటించలేదు. జగన్ నివాసంలో తనిఖీల పేరిట ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి టీడీపీ అనుకూల మీడియాకు లీకులిచ్చారు. నిబంధనల ప్రకారం సీబీఐ విచారణ అధికారులు మీడియాతో దర్యాప్తు అంశాలు వెల్లడించకూడదు. కానీ లక్ష్మీ నారాయణ మాత్రం టీడీపీ అనుకూల మీడియాతో రోజూ లెక్కలేనన్నిసార్లు మాట్లాడినట్లు ఆయన కాల్‌డేటా అప్పట్లోనే వెల్లడించింది. మరోవైపు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వైఎస్ జగన్ 16 నెలలు జైల్లో ఉండేలా లక్ష్మీనారాయణ చేయాల్సిందంతా చేశారు. బెయిల్ పిటిషన్ విచారణకు వస్తే అడ్డుకునేలా ఉద్దేశపూర్వకంగానే 13 చార్ట్షీట్లు వేశారు. లక్ష్మీనారాయణ తన దర్యాప్తు సందర్భంగా కనీస నిబంధనలను పాటించలేదని అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్‌రెడ్డి కొంతకాలం క్రితం వెల్లడించడం గమనార్హం. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో భాగస్వామి కాని...కనీసం 2004–09 మధ్య కాలంలో ప్రజాప్రతినిధి కాదు కదా కనీసం ఏనాడూ సెక్రటేరియట్‌కు కూడా రాని వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎలా అక్రమ కేసులు పెడతారని నిపుణులు ప్రశ్నించారు. అందుకు తగ్గట్టుగానే జగన్‌పై పెట్టిన అక్రమ కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ, కాంగ్రెస్ చేతుల్లో కీలుబొమ్మగా మారిన లక్ష్మీనారాయణ కుట్ర పూరితంగానే వ్యవహరించారని స్పష్టమవుతోంది. కానీ, ఆ కుట్రలనే ఆధారంగా చేసుకుని ప్రజల్ని తప్పుదారి పట్టించి టీడీపీ 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అనంతరం లక్ష్మీనారాయణతో చంద్రబాబు స్వచ్ఛందంగా పదవీ విరమణచేయించారు. కానీ నేరుగా ఆయన్ని టీడీపీలో చేర్చుకోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే లక్ష్మీనారాయణ దాదాపు రెండేళ్లపాటు తటస్థ ముసుగు వేసుకుని రాష్ట్రంలో పర్యటించారు. ఆహార్యం మార్చుకుని రైతుల కోసం పనిచేస్తానని చెబుతూ ప్రజల్ని ఏమార్చేందుకు యత్నించారు. అనంతరం లక్ష్మీనారాయణతో మరో రాజకీయ నాటకం చంద్రబాబు ఆడించారు. తాను రాజకీయ పార్టీ నెలకొల్పబోతున్నట్లు లక్ష్మీనారాయణ ఏడాది క్రితం ప్రకటించారు. కానీ నెలలు గడుస్తున్నా పార్టీ ఊసే ఎత్తలేదు. చివరికి కొన్ని నెలలక్రితం జయప్రకాశ్ నారాయణ నెలకొల్పిన లోక్‌సత్తా పార్టీకి లక్ష్మీనారాయణ ఇక నుంచి నాయకత్వం వహిస్తారని టీడీపీ అనుకూల మీడియాలో లీకులు ఇచ్చారు. అదీ కార్యరూపం దాల్చలేదు. ఇక త్వరలో ఎన్నికలు రానుండటంతో చంద్రబాబు అసలు విషయానికి వచ్చారు. లక్ష్మీ నారాయణ ముసుగు తొలగిస్తూ ఆయన్ని టీడీపీలోకి అధికారికంగా చేర్చుకోవాలని నిర్ణయించారు. కానీ, ఆ విషయాన్ని టీడీపీ నేరుగా ప్రకటించకుండా తమ అనుకూల మీడియాలో లీకులు ఇచ్చింది. ‘‘ఏదైనా ఎత్తుగడ వేస్తే ఆ విషయాన్ని మీడియా ద్వారా లీకులు ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు. దానిపై స్పందనను గమనించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు’’అని రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గతంలోనే చంద్రబాబు నైజాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. లక్ష్మీనారాయణను టీడీపీలో చేర్చుకునే విషయంలోనూ చంద్రబాబు అదే పంథా అనుసరించారు. లక్ష్మీనారాయణను టీడీపీలో అధికారికంగా చేర్చుకున్న అనంతరం ఆయనను మరోసారి ముందుంచి వైఎస్ జగన్‌పై విష ప్రచారం హోరెత్తించాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకు టీడీపీ అనుకూల మీడియా ఎలాగూ వంతపాడుతుందని బహిరంగ రహస్యమే. ఆ పన్నాగంలో భాగంగానే తాజాగా వైఎస్ జగన్ ప్రధానమంత్రి మోదీకి లొంగిపోయారనే దుష్ప్రచారాన్ని హఠాత్తుగా తెరపైకి తెచ్చారు. ఎన్నికలు ముగిసేంతవరకు అంటే దాదాపు నెలరోజులపాటు ఇదే అసత్య ప్రచారాన్ని పదేపదే ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలను మోసగించాలన్నది చంద్రబాబు కుతంత్రం. -
బాబోరూ! పులిగోరు!!
బాలనాగమ్మ అనే జానపద కథ తెలిసిన తరంవారికి ఆ కథలోని బాలవర్ధిరాజు అనే బాలవీరుని పాత్ర, తిప్పడు అనే దురాశ పరు డైన విదూషకుని పాత్ర గుర్తుండే వుంటుంది. బాలనాగమ్మ సౌందర్యానికి వివశుడైన మాయల పకీరు అనే మాంత్రికుడు ఆమెను అపహరించి తన గుహలో బంధిస్తాడు. యుద్ధా నికి వచ్చిన ఆమె భర్త కారంపూడి పాలకుడు కార్యవర్ధిని శిలగా మారుస్తాడు. వారి కుమారు డైన బాలవర్ధిరాజు తల్లిదండ్రులను వెతుక్కుంటూ బయల్దేరు తాడు. దారిలోని అడవి ప్రాంతంలో ఒక పెద్దపులి సంచరిస్తుం టుంది. పరిసర గ్రామాల ప్రజలు భయంతో ఆ ప్రాంతపు రాజుగారి శరణు వేడుతారు. ఆ పులిని చంపి దాని గోళ్లను ఆనవాళ్లుగా తెచ్చి చూపిన వీరునికి అర్ధ రాజ్యం బహుమతిగా ఇస్తాననీ, తన కుమా ర్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని రాజుగారు చాటింపు వేయించి ఉంటాడు. అడవి మార్గాన వెళుతున్న బాలవర్ధికి పులి ఎదురవుతుంది. ఆ యువకుడు భీకరంగా పోరాడి పులిని హతమారుస్తాడు. అలసి పోయి ఒక చెట్టుకింద నిద్రపోతాడు. దూరంగా ఇదంతా గమని స్తున్న తిప్పడు అనే పొరుగూరి సాధారణ వ్యక్తి మదిలో దురాశ పుడుతుంది. నిశ్శబ్దంగా ఆ పులిగోళ్లను కత్తిరించుకొని రాజాస్థానా నికి చేరుకుంటాడు. ఇలాంటి జానపద కథలన్నింటిలాగే ఈ కథ లోనూ వీరుడెవరో.. విదూషకుడెవరో తెలిసిపోతుంది. ఈ కథతో మన సంబంధం ఇక్కడి వరకే. ఇప్పుడిక్కడ ప్రస్తావించబోయే ఆధునిక పులిగోటి వీరుడు మాత్రం తనను తాను హీరోగా అభివర్ణించుకుంటారు. ఎవ్వరడి గినా అడక్క పోయినా, సందర్భమైనా అసందర్భమైనా సరే... తన అవక్ర విక్రమ పరాక్రమ వీరత్వాన్ని తన్మయత్వంలో రంగరించి చెప్పుకోవడం ఆయనకు అలవాటు. అది ఎటువంటి బంధమో తెలి యదు కానీ, గంటల తరబడి సాగే ఆయన స్వోత్కర్షను మెజారిటీ చానళ్లు లైవ్ టెలికాస్టు చేయాల్సిందే. కొన్ని పత్రికలు రోజూ మోయా ల్సిందే. ఆయన కథానాయకుడా, ప్రతినాయకుడా, విదూషకుడా, విదూషకత్వంతో కూడిన ప్రతినాయకుడా అన్నదానిపై భిన్నాభి ప్రాయాలు ఉన్నాయి. అయితే, పులిగోరు విద్యల్లో ఆయనంత ఆరి తేరిన రాజకీయ నేత మరెవ్వరూ లేరని మాత్రం అందరూ అంగీ కరిస్తారు. పీవీ నరసింహారావుగారు ప్రధానిగా వున్న సమయంలో ఎంతో దూరదృష్టితో హైదరాబాద్‌ను కంప్యూటర్ రంగానికి కేంద్రంగా చేయడానికి పునాదులు వేశారు. ఆ రంగంలో హైదరాబాద్ నగరం చేత తొలి అడుగును ఆయనే వేయించారు. తొలి అడుగు వేసిన ఈ నగరం ఐటీలో అగ్రస్థానంలో ఉండాల్సింది. కానీ, కథ ఇక్కడే మలుపు తిరి గింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఎన్నికల చరిత్రను తిరగరాస్తూ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. అనతికాలంలోనే, మీడియా రంగాన్ని శాసిస్తున్న గురువులు–లఘువుల సహకారంతో చంద్రబాబు ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కోటరీ సాయంతో కత్తి వాడకుండానే, నెత్తురు కారకుండానే పూర్తి అహింసా పద్ధతుల్లో ఎన్టీఆర్ గుండెకాయను కోసేయడం, అధికారాన్ని హస్తగతం చేసుకోవ డం జరిగిపోయింది. చంద్రబాబు తొమ్మిదేళ్లు పరిపాలించారు. భారత దేశంలో గుప్తుల స్వర్ణయుగాన్ని తలదన్నే ఆంధ్రుల స్వర్ణయుగంగా ఓ వర్గం వారు ఈ కాలాన్ని పేర్కొంటారు. అందుకు తందానాగా మీడి యాలోని గురువులూ, లఘువులూ దరువులేసి మరీ ప్రచారంలో పెట్టారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో పక్కనున్న కర్ణాటకలో ముగ్గురు ముఖ్య మంత్రులు మారిపోయారు. దేవెగౌడ రెండేళ్లు, హెచ్‌జే పటేల్ రెండేళ్లు, ఎస్.ఎమ్. కృష్ణ ఐదేళ్లు అధికారంలో వున్నారు. అదేం చిత్రమో గాని ఇక్కడ మన స్వర్ణయుగం ముగిసేనాటికి (అక్కడ ముగ్గురు మారిన ప్పటికీ) హైదరాబాద్ అందుకోలేనంత దూరం ఐటీ రంగంలో బెంగ ళూరు పరిగెత్తింది. కానీ, సైబర్ టవర్స్ అనే బిల్డింగ్ ఆకారంలో ఓ పులిగోరు చంద్రబాబు మెడలో చేరిపోయింది. భారతదేశంలో ఐటీ రంగానికి ఆద్యుడెవరు? కంప్యూటర్ను ప్రవేశపెట్టిందెవరు?... ఇంకె వరు!... భజంత్రీలూ వాయించండర్రా...! వాయించేశారు. గురువులు, లఘువులూ స్తోత్రకైవారాలు గావించారు. భారతదేశంలో మరే నగరానికీ లేని ప్రత్యేకత హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎనిమిది వరుసలలో రూపొందిన ఈ రహదారి మౌలిక వసతుల రంగంలో హైదరాబాద్‌ను అగ్రస్థానానికి చేర్చింది. ఈ రహదారి ప్లానింగూ, భూసేకరణ, నిర్మాణం అంతా వైఎస్ హయాంలోనే జరిగింది. అప్పుడు జరిపిన భూసేకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం భజన బృందం పెద్ద దుమారాన్నే లేవ దీసింది. అయినాసరే దీన్ని కూడా ‘స్వర్ణయుగం కోటరీ’ బాబు ఖాతా లోనే వేసింది. బాబు కూడా సిగ్గుపడకుండా, భయపడకుండా తన ఘన తగానే మరో పులిగోరు మెడలో వేసుకున్నారు. వాయిద్యాలూ మోగాయి. స్తోత్ర పఠనం కూడా జరిగింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కథ కూడా ‘షేమ్ టు షేమ్’. ఆ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన జరిగింది వై.ఎస్. హయాంలోనే. ప్రారంభోత్సవం జరిగిందీ ఆయన ఆధ్వర్యంలోనే. అయినా సరే దాని పేరుతో కూడా ఓ పులిగోరు బాబుగారి దగ్గరుంది. విమానాశ్రయాన్ని కట్టింది చంద్రబాబేనంటూ ‘స్వర్ణయుగ’ చరిత్రకారులు రాసి పెట్టారు. ఎల్లో సిండికేట్ ఆధ్వర్యంలో యధాశక్తి వాద్యం! యథాశక్తి స్తోత్రం!! ఇలా చెప్పుకుంటూపోతే ఈ పులిగోళ్ల పురాణం ఓ గ్రంథమవు తుంది. అందుకని, వ్యాస విస్తరణ భీతివల్ల ఇంతటితో ముగించి, తాజా పరిపాలనాకాలం ముగుస్తున్న వేళ ఉన్న పరిస్థితిని పలకరిద్దాం. అధి కారాంతమున ఆయన ఆర్డర్ చేసిన పులిగోళ్లు మరీ ముచ్చటగా ఉన్నాయి. ఎన్నికల రణరంగంలో అలంకరించుకునేందుకు బంగారు తొడుగుల పులిగోళ్లను ఆయన సిద్ధం చేశారు. ఐదేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఆయనిచ్చిన డబ్బులు వడ్డీకి కూడా సరిపోలేదని ఓ పక్క రైతులంతా గగ్గోలుపెడుతున్నా ఆయ నకు పట్టలేదు. సరిగ్గా మళ్లీ ఎన్నికలొచ్చేసరికి ‘అన్నదాతా సుఖీభవ’ అంటూ మరో పులిగోరు ఆభరణం తగిలించుకున్నారు. మోడల్ కూడా తన తెలివికాదు. రెండేళ్ల కింద ప్రతిపక్ష నేత ప్రకటించిన రైతు భరోసాను లేపేశాడు. అదీ వెంటనే లేపలేదు. ఆయన ఉద్దేశం ఎన్నికల ముందు అలంకరించుకోవడమే కనుక రెండు నెలల ముచ్చటకో సమే ఈ మురిపెం. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎగనామం పెట్టారు. మామూలు మనిషన్నవాడైతే చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాడు. కానీ, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చి, పసుపు– కుంకుమ అనే సెంటిమెంటు పులిగోళ్లను బయటకు తీశాడు. రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్–సావిత్రి మధ్య నడిచిన సిస్టర్ సెంటిమెంట్‌కు దీటుగా ఈ రెండు నెలలు పసుపు కుంకుమ అనే నాటకాన్ని నడిపించేందుకు తైనాతీలు య«థాశక్తి తాపత్రయపడు తున్నారు. నిరుద్యోగ సమస్యపైనా అదే డ్రామా. ఇంటికో ఉద్యోగం ఇస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మండలానికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి చివరిదాకా ఇవ్వలేదు. రెండు నెలల ఎన్నికల వేషంకోసం ఇప్పుడా పులిగోరు కూడా సిద్ధమైంది. పూర్వం రాజులు యుద్ధాల్లో గెలిచినప్పుడు విజయసూచ కంగా శిలాశాసనాలను ప్రతిష్ఠించే వాళ్లు. కానీ బాబుగారు ఎక్కడా గెలవకుండానే గెలిచినట్టు ప్రచారం చేసుకునే విద్యలో రాటుదే లారు. బతికి వున్న పులి దగ్గరికే పోకుండా చచ్చిన తర్వాత గోళ్లు ఎత్తుకొచ్చి అమ్ముకునేవాళ్ల మాదిరిగా. వ్యక్తిత్వ వికాస పాఠాల్లోని ఓ ప్రాథమిక సూత్రాన్ని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. అది ‘సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాల’ని! కానీ ఈ సూత్రాన్ని కొంత భిన్నమైన రీతిలో ఆయన ఆచరించారు. వైఫ ల్యాలను కూడా విజయాలుగా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు ఉనికి రహస్యం. కొసమెరుపు చివరి పులిగోరు కొంచెం తేడా. ఇంతకుముందు తాను చేయని పనులను చేసినట్టుగా చూపించుకునే పులిగోళ్లు. తాజాగా తాను చేసిన పాపానికి ఒప్పుకోలు పులిగోరు. వై.ఎస్. రాజశేఖ రరెడ్డి దురదృష్టకర మరణం తర్వాత ఆయన కుమారుడిని పార్టీ నుంచి బయటకు పంపి తప్పుడు కేసులు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానంతో చంద్రబాబు స్నేహం ముసుగు జారి బహిరంగమయింది. జగన్‌కు వ్యతి రేకంగా కుట్రలు నడపడంలో తోడ్పడిన కిరణ్‌కుమార్‌రెడ్డిని మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేర్పించింది బాబే. ఆయన తమ్ముడికి అసెంబ్లీ టికెట్ కూడా టీడీపీ తరఫునే ఖాయం చేశారు. కిరణ్‌ను కూడా పార్లమెంట్ బరిలో నిలపాలనే ముచ్చట కూడా వుందట బాబుకు. కానీ, ఆ వీరుడికి కత్తిపట్టడం చాతనవుద్దో, కాదోనన్న సందేహం పీడిస్తోందట. కాంగ్రెస్ పార్టీ సహకారంతో తాను, తన ఎల్లో సిండికేట్ రచించి దర్శకత్వం వహించిన జగన్ కేసుల నాటకంలో కీలక పాత్ర పోషించిన అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ టికెట్ కేటాయించడానికి సిద్ధపడి కథను చంద్రబాబు క్లైమాక్స్‌కు చేర్చారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ తప్పుడు కేసుల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందని జేడీ మొర పెట్టుకున్నందువల్లనే పదవీ విరమణ చేయించి రాజకీయ ప్రవేశం చేయించారని లోకం కోడై కూస్తోంది. చంద్రబాబు మెడలో తాజా ముద్దుల పులిగోరు జేడీ లక్ష్మీ నారాయణ. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
సివిల్స్‌లో సత్తా చాటిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తనయుడు
-
వాళ్లింట్లో నగల గురించి నాకేం తెలుసు?
బంజారాహిల్స్: వాళ్లింట్లో నగల గురించి నాకేం తెలుసంటూ చోరీ కేసులో నిందితురాలు పోలీసులకు సమాధానం చెబుతుంటే అర్థంకాక పోలీసులు తలపట్టుకుంటున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ నివాసంలో బంగారు ఆభరణాలు చోరీ అయిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసులు పనిమనిషి సుజాతను శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు ఆమె స్వగ్రామానికి వెళ్లి చోరీ చేసిన ఆభరణాల గురించి వాకబు చేయగా ఆమె పోలీసులకు సహకరించకుండా గంటకోమాట మాట్లాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండు రోజులుగా ఆమెను విచారిస్తుండగా చోరీ చేసిన ఆభరణాలు ఎక్కడ దాచిన విషయం సరిగ్గా చెప్పడం లేదు. రోజుకొక మాట మాట్లాడుతూ పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నట్లు సమాచారం. లక్ష్మినారాయణ నివాసంలో కేవలం నెల రోజులు మాత్రమే పనిచే నగలబాక్స్ను మాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దోచిన నగలను కొంత మందికి విక్రయించినట్లు తెలియగా వారి వద్దకు వెళ్తే తాము కొనుగోలు చేయలేదంటూ ఎదురు తిరుగుతున్నారు. ఒక వైపు నిందితురాలు సహకరించకపోగా మరోవైపు నగలు కొనుగోలు చేసిన వారుకూడా తలోమాట మాట్లాడుతుండటంతో ఈ కేసు ముందుకు సాగడం లేదు. దొంగను పట్టుకున్నామన్న ఆనందం పోలీసులకు లేకుండా పోయింది. -
పనిమనుషుల పనే..?
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్‌నెం–12లోని ఎమ్మెల్యే కాలనీ ఉంటున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నివాసంలో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటనలో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 6న లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ ఓ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చి ఆభరణాలను నగల పెట్టెలో పెట్టి బీరువాలో భద్రపర్చింది. శుక్రవారం రాత్రి మరో శుభకార్యానికి వెళ్ళేందుకు ముస్తాబై ఆభరణాల కోసం చూడగా కనిపించలేదు. ఈ నెల 8న పనిమనిషి నగల పెట్టెను తస్కరించినట్లు అనుమినించిన పోలీసులు ఇద్దరు పని మనుషులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ మిస్టరీ వీడినట్లేనని ఓ అధికారి తెలిపారు. ఆభరణాలు యథాతథంగా నిందితులు దాచిపెట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. నేడో రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. -
థానే జాయింట్ సీపీగా లక్ష్మీనారాయణ
సాక్షి, హైదరాబాద్: సీబీఐ హైదరాబాద్ విభాగం జాయింట్ డెరైక్టర్‌గా విధులు నిర్వహించి రిలీవ్ అయిన లక్ష్మీనారాయణను మహారాష్ట్రలోని థానే నగర జాయింట్ పోలీసు కమిషనర్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ మహారాష్ట్ర కేడర్‌లో ఐపీఎస్ అధికారి. ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయన డిప్యుటేషన్‌పై సీబీఐలో హైదరాబాద్ జాయింట్ డెరైక్టర్‌గా వచ్చారు. ఇక్కడ పనిచేసిన కాలంలో సత్యం కంప్యూటర్స్ కుంభకోణంతో పాటు పలు కేసుల దర్యాప్తును పర్యవేక్షించారు. లక్ష్మీనారాయణకు ఐజీగా పదోన్నతి లభించడంతో గత జూన్‌లో ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. దీంతోపాటు కేంద్ర సర్వీసులో డిప్యుటేషన్ గడువు ముగియడంతో.. ఆయన మహారాష్ట్ర పోలీసు శాఖకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న లక్ష్మీనారాయణను మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా థానే జాయింట్ సీపీగా నియమించింది. -
బాధ్యతాయుత ప్రభుత్వాలను ఎన్నుకోవాలి
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: ప్రజల బాగు కోసం ఆలోచించే బాధ్యతాయుత ప్రభుత్వాలు ఏర్పడాలంటే ఓటు అనే ఆయుధంతోనే సాధ్యమని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం విద్యార్థులకు ‘లెట్స్ ఓట్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘ఓటు హక్కు’పై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించని వారికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. దేశ భవిష్యత్తు యువత తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు. కాలయాపనతో విలువైన సమయాన్ని వృథా చేయవద్దన్నారు. సినిమా ప్రభావం నేటి యువతను పెడదారి పట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన ం చేసే పని వల్ల తల్లిదండ్రులు, ఊరికి మంచి పేరు రావాలన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మౌనం వీడండి... ఆక్రందన చేసే వాడి కన్నా దుర్మార్గాలను చూస్తూ మౌనంగా ఉండే మంచి వాడే సమాజానికి చేటు అని లెట్స్ ఓట్ సంస్థ ప్రతినిధి, ఇస్రో మాజీ శాస్త్రవేత్త జె.ఆది శేషయ్య చౌదరి అన్నారు. యువత మౌనం వీడి దేశ భవిష్యతు కోసం నడుం బిగించాలన్నారు. సమర్థుడైన నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. సరైన నాయకత్వం లేకుంటే అభివృద్ధి కుంటుపడి, శాంతి భద్రతలకు విఘాతం కలగడమే కాకుండా నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. కార్యక్రమంలో పర్యావరణ వేత్త పురుషోత్తంరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జేవీఆర్ రవీంద్ర పాల్గొన్నారు.