వైఎస్సార్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.
చాపాడు: వైఎస్సార్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చాపాడు మండలం ఖాదర్‌పల్లె గ్రామంలో చోరికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మునీరా ఇంటికి తాళాలు వేసి అందరూ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న దాదాపు 135 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.40వేల నగదును ఎత్తుకుపోయారు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో డీఎస్పీ పూజిత సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.