హైదరాబాద్ : నమ్మకంగా ఉంటూ పని చేస్తున్న చోటే దొంగతనానికి పాల్పడిన మహిళను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. తూర్పు గోదావరి జిల్లా మూలాపేట కొత్తపల్లి మండలం ఇంద్రకొలిమి గ్రామానికి చెందిన ఏడిద లక్ష్మి(37) కొంత కాలంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-10 ఎమ్మెల్యే, ఎంపీల కాలనీకి చెందిన అనిల్ గగ్గర్ నివాసంలో పని చేస్తోంది.
ఈ నెల 6వ తేదీన యజమాని కప్‌బోర్డ్‌లో ఉన్న రూ.2 లక్షలను కాజేసి, సొంతూరుకు వెళ్లిపోయింది. 8వ తేదీన యజమాని డబ్బు కోసం కప్‌బోర్డులో చూడగా కనిపించలేదు. అప్పటి నుంచి లక్ష్మి ఫోన్‌లో కూడా అందుబాటులో లేకుండాపోయింది. దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీని అంగీకరించింది. రూ.1.75 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు సోమవారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇంటి యజమాని కళ్లుగప్పి చోరీ..అరెస్ట్
Published Mon, Nov 28 2016 5:34 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM