
జల్సాలకు అలవాటు పడి దొంగతనాల బాట పట్టిన ఓ దొంగను యదాద్రి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
సాక్షి, యాదగిరిగుట్ట: జల్సాలకు అలవాటు పడి దొంగతనాల బాట పట్టిన ఓ దొంగను యదాద్రి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి అరకిలో బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులతో పాటు రూ. 4 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వలిగొండ మండలం సుంకిశాలకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు.
యాదగిరిగుట్ట బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు డీసీపీ యాదగిరి ఈ రోజు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.