రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం స్వాధీనం
Published Fri, Jul 14 2017 2:49 PM | Last Updated on Thu, Aug 2 2018 4:35 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో పెద్ద మొత్తంలో బంగారం బయటపడింది. సరైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో బంగారం తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపడుతున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఓ వ్యక్తి వద్ద నుంచి 25.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 7.54 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని నిందితుడు నేపాల్ నుంచి దొంగచాటుగా తీసుకువస్తున్నట్లు తెలుసుకున్నారు. దీని వెనుక బంగారం స్మగ్లింగ్ ముఠా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి నుంచి మరిన్ని వివరాలు రాబట్టి మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement