పట్టణంలోని కృష్ణానగర్‌లో భారీ దొంగతనం జరిగింది. కృష్ణానగర్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి దొంగలు కిలో బంగారం, రూ. 4 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ కాలనీలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. అయినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల భయంతో తాము హడలిపోతున్నామని అంటున్నారు.
Published Sat, Jan 13 2018 8:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM