శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 350 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 350 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన చెన్నై వాసి (32) లగేజీలో 350 గ్రాముల బంగారం బయటపడింది. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.