
సాక్షి, గుటూరు : విలాసాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి బైకుల మీద తిరుగుతూ దోపిడీలకు పాల్పడే ఐదుగురి యువకులను తెనాలి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బులు జల్సాలకు సరిపడవని చోరీలకు పాల్పతుండేవారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని వారిని బెదిరిస్తూ వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్లు లాక్కెళ్తుంటారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి మూడు బైకులు, ఒక బంగారు గొలుసు, నాలుగు సెల్‌పోన్లు స్వాధినం చేసుకునట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment