ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
Published Tue, Jul 25 2017 12:50 PM | Last Updated on Thu, Aug 2 2018 4:35 PM
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కిలోపైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇండిగో విమానంలో ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడు భారీగా బంగారం తెస్లున్నట్టు ముంబై ఐటీ అధికారులు ఇక్కడి అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి 1076.25 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదనపు సమచారం కోసం విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement