గాజువాక: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని కైలాస్ నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. కైలాస్ నగర్లోని ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు 65 తులాల బంగారం, రూ. 20 వేల నగదు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.