నలుగురు స్మగ్లర్ల అరెస్టు, ఆయుధాలు స్వాధీనం | BSF nabs four arms, gold smugglers in west Bengal | Sakshi
Sakshi News home page

నలుగురు స్మగ్లర్ల అరెస్టు, ఆయుధాలు స్వాధీనం

Published Sun, Jun 21 2015 5:48 PM | Last Updated on Thu, Aug 2 2018 4:35 PM

నలుగురు స్మగ్లర్ల అరెస్టు, ఆయుధాలు స్వాధీనం - Sakshi

నలుగురు స్మగ్లర్ల అరెస్టు, ఆయుధాలు స్వాధీనం

కోల్ కతా: ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను, బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న మరో వ్యక్తిని బీఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని మల్దా జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగింది. మొత్తంగా రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు ఆయుధాలు తరలిస్తుండగా సైఫుల్ మండల్, బుడేబ్ రాయ్, నిర్మల్ సర్కార్ లను 31 వ బెటాలియన్ వారిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి 2 పిస్తోళ్లు, 10 సిమ్ కార్డులు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులకు అప్పగించారు.

రతన్ బిస్వాస్ అనే వ్యక్తి రూ.84 లక్షల విలువ చేసే 29 బంగారు బిస్కట్లును తరలిస్తుంటే, అతడిని అదుపులోకి తీసుకుని బిస్కట్లను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ కి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ ఏడాది దక్షిణ బెంగాల్ ప్రాంతంలో ఇప్పటి వరకూ రూ.5.5 కోట్ల విలువ చేసే బంగారాన్ని 13 మంది నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement