-
దొంగ దాడిలో గాయపడిన మహిళ
-
బంగారం,నగదు అపహరణ
నెల్లిపాక:
ఎటపాక మండల పరిధిలోని నెల్లిపాకలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పెట్రోల్ బంక్ సెంటర్‌లో జాతీయ రహదారి పక్కనే నివాసం ఉంటున్న దుద్దుకూరి నాగరత్నం ఇంటి ముందు నిద్రిస్తోంది. తెల్లవారు జామున ఇంటి వెనుక తలుపు పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువాను తెరిచి అందులోని రూ 1.05 లక్షల విలువైన 116గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15వేల నగదును ఎత్తుకెళ్లాడు. అయితే ఇంట్లో ఏదో అలికిడి వస్తున్నదని గమనించిన నాగరత్నం ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగ ఉన్నట్లు గుర్తించి అడ్డగించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆ దొంగ ఇనుప రాడ్‌తో ఆమె తలపై కొట్టి గాయపర్చి అక్కడ నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎటపాక పోలీసులు ఘటన స్థలానికి వచ్చి విచారణ జరుపుతున్నారు.