nellipaka
-
భయం గుప్పెట్లో నెల్లిపాక
-
క్షుద్రపూజలు చేయడం వల్ల పిల్లలు చనిపోతున్నారని
సాక్షి, తూర్పుగోదావరి: మూఢ నమ్మకాల కారణంగా సొంత బంధువులే ఓ గిరిజనుడిని హతమార్చిన సంఘటన జిల్లాలోని ఎటపాక మండలం అయ్యవారిపేట గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ గీతా రామకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వేల్పుల సత్యనారాయణకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటి వరకు మూడుసార్లు పిల్లలు పుట్టి, కొద్ది రోజుల్లోనే మరణించారు. వరుసకు బాబాయి అయిన వేల్పుల రత్తయ్యే (55) దీనికి కారణమని సత్యనారాయణకు అనుమానం వచ్చింది. ఓ అమావాస్య రాత్రి గ్రామ సమీపంలోని ఓ చెట్టు వద్ద రత్తయ్య నగ్నంగా పూజలు చేస్తున్నట్టు గమనించి, తాము వెళ్లగా దుస్తులు చేతబట్టుకుని అతడు పారిపోయాడని సత్యనారాయణ చెబుతున్నాడు. రత్తయ్య క్షుద్రపూజలు చేస్తున్నందు వల్లే తన పిల్లలు చనిపోతున్నారని సత్యనారాయణ భయపడ్డాడు. ఈ నేపథ్యంలో రత్తయ్యను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన అన్న ప్రసాద్ సాయంతో పథకం వేశాడు. ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం రత్తయ్య కంచె వేసేందుకు ఇంటి సమీపంలోని జామాయిల్ తోటకు వెళ్లాడు. అదే రోజు సత్యనారాయణ, ప్రసాద్‌లు మిర్చి బస్తాలు తొక్కేందుకు సమీప గ్రామానికి వెళ్లారు. కూలి పనుల అనంతరం వచ్చిన అన్నదమ్ములిద్దరూ చేనులో రత్తయ్య ఒంటరిగా ఉన్నాడని తెలుసుకున్నారు. పథకం ప్రకారం అక్కడికి వెళ్లి రత్తయ్యపై కత్తితో దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని సమీపంలోని పొదల్లో దాచి ఇంటికి వచ్చేశారు. రాత్రయినా తన తండ్రి ఇంటికి రాకపోవడంతో రత్తయ్య కుమారులు వెంకటేష్, సుధాకర్ చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. రత్తయ్య పని చేసిన పొలం వద్ద మృతదేహాన్ని నేలపై ఈడ్చుకు వెళ్లిన ఆనవాళ్లు, అక్కడికి కొద్ది దూరంలో పొదల మధ్య రక్తం ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల రత్తయ్యకు, సత్యనారాయణ, ప్రసాద్ కుటుంబాల మధ్య రహదారి నిర్మాణం, పంట పొలంలో బోరు వేసే విషయంలో తగాదాలు జరిగాయి. ఈ కోణంలో పోలీసులు విచారణ జరిపారు. దగ్గరి బంధువులే ఈ హత్య చేసి ఉంటారని అనుమానించి, అన్నదమ్ములిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా రత్తయ్యను తామే చంపినట్టు సత్యనారాయణ, ప్రసాద్ అంగీకరించారు. హత్య చేసిన రాత్రే మరో ముగ్గురి సాయంతో రత్తయ్య మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకుని సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని గొమ్ముకొత్తగూడెం వద్ద గోదావరి నదిలో ఇసుక ర్యాంపు సమీపాన పాతి పెట్టారు. ఈ సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని బుధవారం గుర్తించారు. గురువారం రత్తయ్య మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. కాగా, తన తండ్రికి క్షుద్రపూజలు రావని, నిందితులు కావాలనే ఇలా చెబుతున్నారని రత్తయ్య కుమారులు అంటున్నారు. -
అశ్వాపురం, నెల్లిపాకల్లో ఏకగ్రీవాల హవా..
సాక్షి, అశ్వాపురం: ఏళ్లు కాదు..దశాబ్దాల చరిత్ర ఉన్న ఆ సంఘాల్లో ప్రతిసారీ తీవ్ర పోటీనే. కానీ..ఈసారి ఏకగ్రీవమై ప్రత్యేకత సంతరించుకున్నాయి. అవే..అశ్వాపురం, నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. 1957లో ఏర్పాటైన ఈ రెండు సహకార సంఘాల్లో గత ఎన్నికల వరకు హోరాహోరీ పోరు ఉండేది. ఈ సారి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఏకగ్రీవమయ్యేట్లు చూశారు. జిల్లాలోని 20 సహకార సంఘాల్లో 13కు 13 వార్డులు ఏకగ్రీవమైన సంఘాలుగా అశ్వాపురం, నెల్లిపాక సహకార సంఘాలు నిలిచాయి. ఈ రెండు సంఘాల అధ్యక్షులుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నిక కానున్నారు. అశ్వాపురం పీఏసీఎస్ అధ్యక్షుడిగా తుళ్లూరి బ్రహ్మయ్య మూడో సారి ఎన్నిక కానున్నారు. నెల్లిపాక పీఏసీఎస్ అధ్యక్షుడిగా తుక్కని మధుసూదన్ రెడ్డి ఎన్నిక కానున్నారు. గతంలో బ్రహ్మయ్య డీసీసీబీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. గత ఎన్నికల్లో అశ్వాపురం పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికై డీసీసీబీ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలోనే అశ్వాపురం, నెల్లిపాక సహకార సంఘాలు ఏకగగ్రీవమయ్యేలా రాజకీయ పార్టీలను ఒప్పించి మండల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. జిల్లాలోని సహకార సంఘాల్లో అశ్వాపురం, నెల్లిపాక సొసైటీలకు ప్రత్యేక స్థానం ఉంది. 3,232 మంది సభ్యులతో ఏడాదికి రూ.10 కోట్ల టర్నోవర్‌తో అశ్వాపురం పీఏసీఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నెల్లిపాక పీఏసీఎస్‌కి జిల్లాలోని మొదటి మూడు సహకార సంఘాల్లో ఒకటిగా ఉంటు పలుమార్లు ఉత్తమ సంఘంగా అవార్డు పొందింది. -
గంజాయి తరలిస్తున్న లారీ పట్టివేత
నెల్లిపాక (రంపచోడవరం) : గంజాయి తరలిస్తున్న ఓ లారీని శుక్రవారం ఎటపాక మండలంలోని నెల్లిపాక అటవీ చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. సీలేరు ప్రాంతం నుంచి లారీలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో చెక్‌పోస్టు వద్ద నిఘా ఉంచి భద్రాచలం వైపు వస్తున్న లారీని తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించి లారీని ఎటపాక పోలీస్టేష¯ŒSకు తరలించారు. లారీలో రహస్య అరను తయారు చేసి అందులో సుమారు 300 వరకు గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్నట్లు సమాచారం.1200 కేజీలకు పైగా గంజాయి ఉన్నట్లు తెలిసింది. గంజాయిని హైదరాబాదుకు తరలిస్తున్నట్లు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. -
నెల్లిపాకలో చోరీ
దొంగ దాడిలో గాయపడిన మహిళ బంగారం,నగదు అపహరణ నెల్లిపాక: ఎటపాక మండల పరిధిలోని నెల్లిపాకలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పెట్రోల్ బంక్ సెంటర్లో జాతీయ రహదారి పక్కనే నివాసం ఉంటున్న దుద్దుకూరి నాగరత్నం ఇంటి ముందు నిద్రిస్తోంది. తెల్లవారు జామున ఇంటి వెనుక తలుపు పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువాను తెరిచి అందులోని రూ 1.05 లక్షల విలువైన 116గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15వేల నగదును ఎత్తుకెళ్లాడు. అయితే ఇంట్లో ఏదో అలికిడి వస్తున్నదని గమనించిన నాగరత్నం ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగ ఉన్నట్లు గుర్తించి అడ్డగించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆ దొంగ ఇనుప రాడ్‌తో ఆమె తలపై కొట్టి గాయపర్చి అక్కడ నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎటపాక పోలీసులు ఘటన స్థలానికి వచ్చి విచారణ జరుపుతున్నారు. -
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి
తూర్పుగోదావరి: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై దాడిచేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు ఆమెపై దాడి చేసి ఇంట్లో ఉన్న రూ. 3 లక్షల విలువైన బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
కొలువులపై విభజన క్రీనీడ
విలీన మండలాల డీఎస్సీ అభ్యర్థుల ఆక్రోశం స్థానికులు కాదంటూ నియామకాలకు అడ్డంకి కోర్టు కరుణించినా ఖాతరు చేయని ఐటీడీఏ! నెల్లిపాక : రాష్ట్ర విభజన గిరిజన నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. కష్టపడి చదివిన వారిని స్థానికత కష్టాల పాలు చేసింది. అర్హత ఉన్నా వారికి ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారాయి. విలీన మండలాల ఏజెన్సీ డీఎస్సీలో ఆ మండలాల అభ్యర్థుల పట్ల ప్రభుత్వ నిర్ణయం వారికి తీరని ఆవేదనను మిగుల్చుతోంది. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో 2016 అక్టోబర్ 29న ప్రత్యేక డీఎస్సీ అర్హత పరీక్షను నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారిని గత ఏడాది డిసెంబర్ 29న ఉపాధ్యాయ ఉద్యోగాల్లో నియమించారు. అయితే రాష్ట్ర విభజనతో తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన నాలుగు విలీన మండలాల్లోని కొందరు అభ్యర్థులు అర్హత సాధించినా స్థానికత పేరుతో నియామకాలను నిలిపివేశారు. దీంతో వారు గత మూడు నెలలుగా ఉద్యోగాల కోసం పోరాటం చేసూ్తనే ఉన్నారు. కోర్టును కూడా ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు సాధించుకున్నా అధికారుల నుంచి స్పందన లేదని వారు వాపోతున్నారు. విలీన మండలాల్లో మొత్తం 10 మంది అభ్యర్థుల నియామకాలను ప్రస్తుతం నిలిపివేశారు. వీరిలో ఎటపాక మండలంలోని ఆదివాసీ తెగకు చెందిన ముగ్గురు మహిళా అభ్యర్థులు, నలుగురు లంబాడా తెగకు చెందిన వారు కాగా చింతూరు మండలంలో ఒకరు, వీఆర్ పురం మండలంలో ఇద్దరు ఆదివాసీ అభ్యర్థులు ఉన్నారు. వీరి నియామకాలను స్థానికత లేదనే కారణంగా నియామకపు ఉత్తర్వులు ఇవ్వలేదు. కోడళ్లుగా వచ్చిన వారికీ అడ్డంకే ఆరుగురు ఆదివాïసీ అభ్యర్థులకు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ స్థానికత లేదని ఉద్యోగావకాశం కల్పించలేదు. అయితే వీరిలో ఎటపాకకు చెందిన కోర్స సుజాత, పొడియం కౌసల్య, వీఆర్‌పురానికి చెందిన కారం అరుణ, సీహెచ్ వెంకటలక్ష్మి ఈ ప్రాంతానికి కోడళ్లుగా వచ్చారు. మిగతా ఇద్దరు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నవారే. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఏజెన్సీలోనే ఉంటూ వీరి చదువులు పూర్తి చేశారు. వివాహాలు కూడా రాష్ట్ర విభజనకు ముందే జరిగాయి. ప్రత్యేక డీఎస్సీలో కొలువులు సాధించేందుకు అహర్నిశలు కష్టపడి చదివి అర్హత పొందారు. కానీ వీరిని ఈ ప్రాంతానికి చెందిన వారు కాదని నియామకాలు నిలిపివేయటం పట్ల తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సాధించుకున్న ఉద్యోగాలు గత మూడునెలలుగా దూరం కావటంతో వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. -
వీడిన మర్డర్ మిస్టరీ
నెల్లిపాక : మిస్టరీగా మారిన చెన్నూరి శంకర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎటపాక సీఐ వీరయ్యగౌడ్ మంగళవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎటపాక మండలంలోని తునికిచెరువు అటవీ ప్రాంతంలో ఓ మృతదేహం ఉందని ఈ నెల 6న పోలీసులకు సమాచారం అందింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్గా గుర్తించి చెన్నూరి శంకర్ అనే వ్యక్తిని తామే హతమార్చామని వారం రోజుల తర్వాత పత్రికలకు మావోయిస్టుల పేరిట లేఖలు అందాయి. చాలా రోజుల తర్వాత లేఖలు రావడంపై అనుమానం కలిగిన పోలీసులు ఇది మావోయిస్టులు చేసిన హత్య కాదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మార్చి 30న భద్రాచలంలోని తనసోదరుడి రూం నుంచి శంకర్ బయటకు వెళ్లాడు. అతడి సోదరుడిని పోలీసులు విచారణ చేయగా, తాను స్నేహితులతో మందు పార్టీలో ఉన్నానని ఫోన్లో శంకర్ చెప్పినట్టు తెలిపాడు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శంకర్‌తో ఆ రోజు మందు పార్టీలో నందిగామ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ దుర్గం నరేందర్, ఎటపాకకు చెందిన పలకల ధర్మారావు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, వాస్తవాలు వెలుగు చూశాయి. హత్యకు దారితీసిన పరిస్థితులు శంకర్, నరేందర్ వరంగల్ జిల్లాకు చెందిన సమీప బంధువులు. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లిలో ఉంటూ శంకర్ జిరాక్స్ షాపు నడుపుతున్నాడు. నరేందర్ ఎటపాక మండలంలోని నందిగామలో ఆర్ఎంపీగా జీవనం సాగిస్తున్నాడు. శంకర్ తరచూ నరేం దర్ ఇంటికి వస్తున్న క్రమంలో నరేందర్ భార్య కవితపై అతడి కన్నుపడింది. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పడంతో, నరేందర్ స్నేహితుడు ధర్మారావుతో కలిసి వారిద్దరూ శంకర్‌ను హతమార్చేందుకు పథకం వేశారు. మార్చి 30న సాయంత్రం మందు పార్టీకి శంకర్‌ను పిలిచారు. బీరు బాటిళ్లు తీసుకుని శంకర్, నరేందర్, ధర్మారావు కలిసి ఎటపాక-పిచుకలపాడు మధ్య ఉన్న కల్వర్టు వద్దకు చేరుకున్నారు. పథకం ప్రకారం బీరు బాటిల్లో నిద్రమాత్రలు కలిపి శంకర్‌కు ఇచ్చారు. దానిని తాగి అపస్మారక స్థితికి చేరుకున్న శంకర్‌ను తునికిచెరువు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, కర్రలతో అతడి తలపై కొట్టి హతమార్చారు. మృతదేహాన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయారు. వీరిద్దరితో పాటు నరేందర్ భార్య కవితను కూడా అరెస్ట్ చేశారు. -
నెల్లిపాకలో గ్యాస్ సిలిండర్ పేలుడు..
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించింది. ఏటపాక మండలం నెల్లిపాక గ్రామంలో చీమల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల వేడికి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలిడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. సిలిండర్ పేలుడుకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆ శబ్దానికి గ్రామస్తులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. -
వేసవిలోనే.. వ్యాధుల పంజా
గిరిజనుల ఆరోగ్యంపై సర్కారు ఉదాసీనత ఏజెన్సీలో విజృంభిస్తున్న విషజ్వరాలు 922 మలేరియా కేసుల కు 900 గిరిసీమలోనే.. రుగ్మతల నివారణకు కానరాని చర్యలు నాలుగేళ్లుగా పంపిణీ కాని దోమతెరలు దోమలమందు పిచికారీ అంతంత మాత్రమే.. లేళ్లపై పంజాలు విసురుతున్న పులుల్లా.. ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో గిరిజనులపై వేసవిలోనే విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అయినా మందపు చర్మంపై దోమ కుట్టిన మాదిరి ప్రభుత్వం చలించడం లేదు. విషజ్వరాలకు మూలమైన దోమల నివారణకు తగు చర్యలు చేపట్టకుండా ఉదాసీనతతో వ్యవహరిస్తోంది. దోమల మందు పిచికారీ, సకాలంలో దోమతెరల పంపిణీ చేయకుండా వనసీమవాసుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకుంటే వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత మరింత పెరిగే ముప్పు ఉంది. నెల్లిపాక:జిల్లాలోని 119 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 26 ఏజెన్సీ పరిధిలోనే ఉన్నాయి. వీటితో పాటు ఒక ఏరియా ఆసుపత్రి, నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా సుమారు 1,050 గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందించాలనేది లక్ష్యం. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు జిల్లా మలేరియా శాఖాధికారి కార్యాలయంతో పాటు అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కూడా రంపచోడవరంలోనే ఉన్నారు. ఇంత యంత్రాంగం ఉన్నా ఏటా వర్షాకాలం మొదలు చలికాలం వెళ్లేంత వరకూ సీజనల్ వ్యాధులు ఏజెన్సీని అతలాకుతలం చేస్తూనే ఉంటాయి. చింతూరు మండలం తులసిపాక పీహెచ్సీ మలేరియా కేసుల నమోదులో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. దాని తర్వాత ఏజెన్సీలో ఏడుగురాళ్లపల్లి, కూటూరు, జీడిగుప్ప పీహెచ్‌సీల్లో మలే రియా కేసులు ఎక్కువగా నమోదవుతాయి. ఈఏడాది జనవరి నుంచిమార్చి వరకు జిల్లా వ్యాప్తంగా 922 మలేరియా కేసులు నమోదు కాగా వాటిలో ఏజెన్సీలోనే సుమారు 900 కేసులు గుర్తించినట్లు అధికారులు చెపుతున్నారు. ఎటపాక డివిజన్లో చింతూరు మండలం తులసిపాక, ఏడుగురాళ్లపల్లి, కూనవరం మండలంలోని కూటూరు, వీఆర్‌పురం మండలంలోని జీడిగుప్ప, వై.రామవరం మండలంలోని మంగంపాడు, చేడుదిబ్బల, వై.రామవరం పీహెచ్‌సీల పరిధిలోనే మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పారిశుధ్యలేమీ, కలుషిత జలాలే కారణం.. ఏజెన్సీలో విషజ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలటానికి ప్రధానకారణం గ్రామాల్లో పారిశుధ్యలోపంతో దోమలు పెరగటం, కలుషిత నీరు తాగటం. నలత చేసిన గిరిజనులకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడిన సంఘటనలు అనేకం. ఎటపాక డివిజన్లో సుమారు 30 వలస ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. పలు గ్రామాల ప్రజలకు రక్షిత మంచినీరు లేక వాగులు, వంకల్లోని చెలమనీటినే తాగుతున్నారు. ఆ నీరు కలుషితం కావటంతో విషజ్వరాలు, డయేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు. వీఆర్‌పురం, ఎటపాక, చింతూరు మండలాల్లోని పలు ఆదివాసీ గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొంది. వ్యాధులు వస్తే సకాలంలో ప్రభుత్వాస్పత్రులకు వచ్చి వైద్యం చేయించుకునేందుకు సరైన రహదారి సౌకర్యం కూడా లేకపోవటం గిరిజనులకు శాపంగా మారింది. తులసిపాక పీహెచ్సీ పరిధిలోని నేలకోట,దబ్బగూడెం, గొందిగూడెం, వేములరాయి, చవులూరు, ఎర్రగొండపాకల, చదలవాడ, ఏరువాడ, మిట్టవాడ, గవల్లకోట, ఎటపాక మండలం గౌరిదేవిపేట, లక్ష్మీపురం పీహెచ్సీ పరిధిలోని సంగంపాడు, కామన్‌తోగు, జగ్గవరం, గొల్లగుప్ప తదితర గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. వర్షాకాలం వస్తే వాగులు, వంకలు వరదనీటితో పొంగటంతో ఆయాగ్రామాల ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. కొరవడ్డ ముందస్తు చర్యలు వర్షాకాలానికి ముందే విషజ్వరాలు, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. వందలాది గిరిజన గ్రామాలకు రక్షిత మంచినీరు, రహదారి సౌకర్యం లేదు. పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారింది. 2012 నుంచి ఇప్పటి వరకు దోమతెరలు పంపిణీ చేయలేదు. దోమల మందు పిచికారీ కూడా తూతూ మంత్రంగా జరుగుతోంది. గత ఏడాది చివర్లో వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు విలీన మండలాల్లో పర్యటించి ఏజెన్సీలో మెరుగైన వైద్యం అందిస్తామని, చింతూరులో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు నేటికీ ఆచరణలోకి రాలేదు. దోమతెరల పంపిణీకి చర్యలు.. ఎటపాక డివిజన్లో మలేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయని జిల్లా మలేరియా అధికారి ప్రసాద్ అంగీకరించారు. దోమతెరల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఏప్రిల్ 15 నుంచి 26 పీహెచ్‌సీల పరిధిలోని 935 గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు మొదలు పెడతామని చెప్పారు. -
రూ.8లక్షల గంజాయి పట్టివేత
నెల్లిపాక : కారులో తరలిస్తున్న గంజాయిని శనివారం తెల్లవారు జామున అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అటవీశాఖ చింతూరు డీఎఫ్ఓ ఎంవీ ప్రసాద్, సబ్ డిఎఫ్ఓ దేవరాజ్ విజయవాడ నుంచి చింతూరు కారులో వెళ్తున్నారు. ఈక్రమంలో చింతూరు నుంచి భద్రాచలం వైపు ఏపీ 20 క్యూ 6008 నంబరు గల అంబాసిడర్ కారు వెళ్తుండి. దీనిని తెల్లవారు జామున చింతూరు మండలంలోని కాటుకపల్లి సమీపంలో గమనించిన అటవీశాఖ అధికారులకు అనుమానం కలిగి దానిని ఆపేందుకు ప్రయత్నించగా.. డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. ఈక్రమంలో అటవీశాఖ అధికారులు కారును వెంబడించి మండల పరిదిలోని గుండాల సమీపంలో అడ్డగించటంతో కారులో ఉన్న వ్యక్తి కారును నిలిపి పరారయ్యాడు. కారును పరిశీలించిన వారు కారు సీట్లలో 2 కేజీల బరువుగల 80 ప్యాకెట్ల గంజాయిని దాచి తరలిస్తున్నట్లు గమనించారు. దీంతో కారును స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందికి అప్పగించి రాత్రి పోలీసుస్టేషన్లో కేసునమోదు చేసి గంజాయిని,కారును పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని సమాచారం. 20 కిలోల గంజాయితో మహిళ అరెస్టు రాజవొమ్మంగి : ట్రాలీ సూట్‌కేసు, మరో చిన్న బ్యాగ్‌లో గంజాయిని పొట్లాల(బండిళ్లు) మాదిరిగా సర్దుకుని వెళుతున్న ఓ మహిళను రాజవొమ్మంగి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి శనివారం కోర్టుకు తరలించారు. రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన మార్ని విజయకుమారి చేతిలో రెండు బ్యాగ్‌లతో రాజవొమ్మంగి బస్‌స్టాప్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు ఆమెను ప్రశ్నించి ఆమె వద్దగల బ్యాగ్‌లను తనిఖీ చేయగా 10 బండిళ్లలోని దాదాపు 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎస్సై స్వామినాయుడు శనివారం మధ్యాహ్నం విలేకరులకు తెలిపారు. విజయకుమారి విశాఖ జిల్లా జీకే వీధి నుంచి గంజాయిని రాజమండ్రి మీదుగా తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఆమెను స్థానిక తహశీల్దార్ పద్మావతి వద్ద హాజరుపరచామని, పంచనామా అనంతరం కోర్టుకు తరలించామని వెల్లడించారు.