నెల్లిపాక : కారులో తరలిస్తున్న గంజాయిని శనివారం తెల్లవారు జామున అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అటవీశాఖ చింతూరు డీఎఫ్‌ఓ ఎంవీ ప్రసాద్, సబ్ డిఎఫ్‌ఓ దేవరాజ్ విజయవాడ నుంచి చింతూరు కారులో వెళ్తున్నారు. ఈక్రమంలో చింతూరు నుంచి భద్రాచలం వైపు ఏపీ 20 క్యూ 6008 నంబరు గల అంబాసిడర్ కారు వెళ్తుండి. దీనిని తెల్లవారు జామున చింతూరు మండలంలోని కాటుకపల్లి సమీపంలో గమనించిన అటవీశాఖ అధికారులకు అనుమానం కలిగి దానిని ఆపేందుకు ప్రయత్నించగా.. డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు.
ఈక్రమంలో అటవీశాఖ అధికారులు కారును వెంబడించి మండల పరిదిలోని గుండాల సమీపంలో అడ్డగించటంతో కారులో ఉన్న వ్యక్తి కారును నిలిపి పరారయ్యాడు. కారును పరిశీలించిన వారు కారు సీట్లలో 2 కేజీల బరువుగల 80 ప్యాకెట్ల గంజాయిని దాచి తరలిస్తున్నట్లు గమనించారు. దీంతో కారును స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందికి అప్పగించి రాత్రి పోలీసుస్టేషన్‌లో కేసునమోదు చేసి గంజాయిని,కారును పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని సమాచారం.
20 కిలోల గంజాయితో మహిళ అరెస్టు
రాజవొమ్మంగి : ట్రాలీ సూట్‌కేసు, మరో చిన్న బ్యాగ్‌లో గంజాయిని పొట్లాల(బండిళ్లు) మాదిరిగా సర్దుకుని వెళుతున్న ఓ మహిళను రాజవొమ్మంగి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి శనివారం కోర్టుకు తరలించారు. రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన మార్ని విజయకుమారి చేతిలో రెండు బ్యాగ్‌లతో రాజవొమ్మంగి బస్‌స్టాప్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు ఆమెను ప్రశ్నించి ఆమె వద్దగల బ్యాగ్‌లను తనిఖీ చేయగా 10 బండిళ్లలోని దాదాపు 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎస్సై స్వామినాయుడు శనివారం మధ్యాహ్నం విలేకరులకు తెలిపారు. విజయకుమారి విశాఖ జిల్లా జీకే వీధి నుంచి గంజాయిని రాజమండ్రి మీదుగా తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఆమెను స్థానిక తహశీల్దార్ పద్మావతి వద్ద హాజరుపరచామని, పంచనామా అనంతరం కోర్టుకు తరలించామని వెల్లడించారు.
రూ.8లక్షల గంజాయి పట్టివేత
Published Sun, Jun 28 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement
Advertisement