నెల్లిపాకలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. | gas cylinder blast in east godavari district | Sakshi
Sakshi News home page

నెల్లిపాకలో గ్యాస్ సిలిండర్ పేలుడు..

Published Sun, Apr 17 2016 9:33 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

నెల్లిపాకలో గ్యాస్ సిలిండర్ పేలుడు..

నెల్లిపాకలో గ్యాస్ సిలిండర్ పేలుడు..

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించింది. ఏటపాక మండలం నెల్లిపాక గ్రామంలో చీమల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటల వేడికి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలిడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. సిలిండర్ పేలుడుకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆ శబ్దానికి గ్రామస్తులందరూ భయభ్రాంతులకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement