srinivasarao
-
తెలంగాణ పోలిస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ ‘హైట్’ ఉన్నవారికి మరో ఛాన్స్!
సాక్షి, హైదరాబాద్ : యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా అభ్యర్థులకు నిర్వహించిన ఎత్తు కొలతల్లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైన అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో అవకాశం కల్పించనుంది. ఒక సెంటీమీటర్, ఆ లోపు తేడాతో అనర్హులైన అభ్యర్థులకు మరోమారు ఎత్తు కొలతలు తీయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ఎలీ్పఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎత్తు కొలతలో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు www.tslprb.in వెబ్సైట్ ఈనెల 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు లాగిన్ ఐడీల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఎస్ఏఆర్ సీపీఎల్ అంబర్పేట్, 8వ బెటాలియన్ కొండాపూర్‌లలో ఈ ఎత్తు కొలతలను తీయనున్నట్లు వెల్లడించారు. భౌతిక కొలతలకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను తీసుకురావాల్సి ఉంటుందని, ఆన్లైన్లో దరఖాస్తు చేయకుండా వినతిపత్రాలు రాసి తెచ్చే వారిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. -
ఎన్నిసార్లయినా కేసీఆర్ పాదాలకు నమస్కరిస్తా : డీహెచ్ శ్రీనివాసరావు
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఫస్ట్ వికెట్.. ఈడీ అదుపులో గోల్డ్‌మైన్ శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారిగా అనుమానిస్తూ గోల్డ్‌మైన్ శ్రీనివాసరావు అలియాస్ వెన్నమనేని శ్రీనివాసరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకు సోదాలకు పరిమితమైన ఈడీ సోమవారం ఒకరిని అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు, అకస్మాత్తుగా శ్రీనివాసరావు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడమే కాకుండా ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించడాన్ని బట్టి చూస్తే.. ఈ ఉదంతం మరింత సంచలనానికి దారితీసే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. అకస్మాత్తుగా తెరపైకి.. సోమవారం వరకు శ్రీనివాసరావు పేరు గానీ, ప్రస్తావన గానీ లిక్కర్ స్కామ్‌లో బయటకు రాలేదు. ఈ స్కామ్‌లో 14వ నిందితుడిగా ఆరోపణలెదుర్కొంటున్న అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో పాటు ఆయనకు చెందిన రాబిన్ డిస్టిలరీలో డైరెక్టర్లుగా ఉన్న బోయినిపల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్‌సాగర్‌రావు, ఆడిటర్ బుచ్చిబాబు నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ బృందాలు గత వారం సోదాలు నిర్వహించాయి. ఇక్కడ లభించిన కీలక ఆధారాల నేపథ్యంలోనే శ్రీనివాసరావుపై దృష్టి సారించినట్టు తెలిసింది. సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు.. శ్రీనివాసరావు కేంద్రంగా జరిగిన మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి ఆయన కార్యాలయాలున్న హైదరాబాద్‌లోని రామాంతపూర్ (సాలిగ్రామ్ టెక్నాలజీస్), మాదాపూర్ (వరుణ్ సన్), బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ (శ్రీనివాసరావు కార్యాలయం)తో పాటు మరో రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. రూ.కోట్ల లావాదేవీలపై ఆధారాలు లభ్యం శ్రీనివాసరావు ద్వారా కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగినట్టు బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లై విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు వారివద్ద ఆధారాలు కూడా లభించినట్లు తెలుస్తోంది. సోదాల్లో బయటపడ్డ కంపెనీల ఏర్పాటు సంబంధిత డాక్యుమెంట్లు, కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఒప్పంద పత్రాల ద్వారా ఈడీకి కీలక సమాచారం అందినట్లు సమాచారం. సంభాషణలు రిట్రైవ్ చేసిన ఈడీ పిళ్లై విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్టు ఈడీ వర్గాల ద్వారా తెలిసింది. అతని ఫోన్లోని సిగ్నల్ యాప్ ద్వారా జరిగిన సంభాషణను ఈడీ అధికారులు రిట్రైవ్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా శ్రీనివాసరావుతో సాగిన సంభాషణలు ఈడీకి కీలక సమాచారాన్ని ఇచ్చినట్టు తెలిసింది. వీరిద్దరి చాటింగ్‌కు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు స్కామ్‌లో వినిపిస్తున్న ప్రముఖుల మొబైల్‌కు పంపించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. పంజాబ్‌కు వెళ్లిన రూ.200 కోట్లెక్కడివి? ఈడీ అధికారుల సోదాలో మరో సంచలనాత్మక అంశానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతకు రూ.200 కోట్లు ఇచ్చినట్టుగా ఆధారాలు లభించినట్లు సమాచారం. కాగా ఆ డబ్బులు శ్రీనివాసరావు ద్వారానే అక్కడికి చేరాయా? అన్న అంశంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ డబ్బు ఏ ఒప్పందంలో భాగంగా ఇచ్చారు, లిక్కర్ టెండర్ల కోసమేనా? లేక మరేదైనా కారణముందా? అన్న కోణంలో ఈడీ విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ డబ్బు ఎవరి ఆదేశాల మేరకు వెళ్లింది? కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిందా? లేక లెక్కల్లో లేని డబ్బా? అన్న కోణంలో ఈడీ అధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఆడిటర్ బుచ్చిబాబు నివాసాల్లో జరిగిన సోదాల్లో ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అడ్వాన్స్ అని, పర్సంటేజీ అన్న పేరుతో సాగిన ఓ వాట్సాప్ సందేశంపై ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్టు తెలిసింది. అక్కడ పిళ్లై.. ఇక్కడ శ్రీనివాసరావు.. మధ్యలో? ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేజిక్కించుకునేందుకు ఆ రంగంలో ప్రావీణ్యం ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లైని రంగంలోకి దించారు. ఆయన ఢిల్లీలోని పలువురిని కలిసి లంచాలు ముట్టజెప్పారని సీబీఐ ఆరోపిస్తోంది. అదే విధంగా లిక్కర్ దందాకు కావాల్సిన కంపెనీలు, వేయాల్సిన టెండర్లు, ముట్టాల్సిన సొమ్ము.. కట్టాల్సిన సొమ్ము సమీకరణ బాధ్యత శ్రీనివాసరావుకు అప్పగించారని తెలుస్తోంది. అయితే.. హైదరాబాద్ టూ ఢిల్లీ అన్నట్టుగా సాగిన ఈ దందాలో మధ్యవర్తిత్వం చేసిందెవరు? వారికి ఈ వ్యవహారంతో ఉన్న సంబంధం ఏమిటి? అన్నదానిపై ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దూకుడు పెంచడం కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి వరకు సుమారు ఆరు గంటల పాటు శ్రీనివాసరావును ఈడీ ప్రశ్నించింది. ఎవరీ శ్రీనివాసరావు? శ్రీనివాసరావుది ప్రస్తుత సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతగల్ గ్రామం. అధికార పక్ష ముఖ్య నేతల అండదండలతో ఆర్థికంగా ఎదిగినట్లు తెలుస్తోంది. ఆయనకు పవిత్ర పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఇటీవలే రామాంతపూర్‌లో సాలిగ్రామ్ ఐటీ కంపెనీ ప్రారంభించారు. మాదాపూర్‌లోని వరుణ్ సన్ షోరూమ్‌లో వాటాలున్నట్లు, రంగారెడ్డి జిల్లాలో గోల్డ్ స్టార్ మైన్స్ అండ్ మినరల్స్ పేరిట మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. రూ. 2 వేల కోట్లతో 18 జోన్లు కైవసం! ఢిల్లీలోని 32 జోన్లలో లిక్కర్ దందా కోసం నిధుల సమీకరణ, లావాదేవీల వ్యవహారం మొత్తం వెన్నమనేని శ్రీనివాసరావు ద్వారానే జరిగినట్టుగా ఈడీ ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. రూ.2 వేల కోట్లకు పైగా నగదును 9 కంపెనీలకు మళ్లించి, ఆ కంపెనీల ద్వారా టెండర్ల దాఖలుకు దగ్గరుండి ఏర్పాట్లు చేసినట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంపెనీలకు సంబంధించి ఆడిటర్ బుచ్చిబాబు, శ్రీనివాసరావు మధ్య జరిగిన లావాదేవీల వ్యవహారం కూడా తాజాగా బయటపడుతోందని వెల్లడించాయి. రూ.2 వేల కోట్లతో దాదాపు 18 జోన్లలో లిక్కర్ దందాను చేజిక్కించుకున్నట్టు ఈడీ అనుమానిస్తోంది. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ఖాతాల ద్వారా సంబంధిత కంపెనీల్లోకి మళ్లించారు? తదితర అంశాలపై శ్రీనివాసరావును ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. -
బీజేపీ నుంచి పవన్ కల్యాణ్ బయటకొచ్చి పోరాడాలి
సాక్షి, అమరావతి/ఒంగోలు/మంగళగిరి: ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం పవన్ కల్యాణ్ బీజేపీ నుంచి బయటకు వచ్చి పోరాడాలని సీపీఎం, సీపీఐ సూచించాయి. బీజేపీతో దోస్తీ చేసిన ఏ ప్రాంతీయ పార్టీ బాగుపడలేదని పేర్కొన్నాయి. మంగళవారం ఒంగోలులో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీలను జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న లోటు బడ్జెట్ పూడ్చేందుకు ఎలాంటి సాయం చేయని కేంద్రం.. విశాఖ ఉక్కు పరిశ్రమను మాత్రం అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా సాధన కమిటీ చైర్మన్ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఐసీయూలో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇవ్వాలన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ రాష్ట్రానికి ఏ మాత్రం ఉపయోగపడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రానికి బీజేపీ పాచిపోయిన లడ్డూలిచ్చిందన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు వాటి కోసమే పాకులాడుతున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి.మధు విమర్శించారు. మంగళవారం గుంటూరు జిల్లా నిడమర్రులో ఆయన ‘అమరావతి ప్రజాబాట’ను ఆయన ప్రారంభించారు. -
పాస్‌పోర్ట్ రద్దు.. పుకార్లు మాత్రమే
సాక్షి, అమరావతి: ఉద్యమాల్లో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లు రద్దు చేస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డీఎస్ఎస్ శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని అమరావతిని తరలిస్తున్నారంటూ ఉద్యమం చేస్తున్న వారి పాస్‌పోర్ట్‌లు రద్దు చేస్తున్నారంటూ రెండ్రోజులుగా ఎవరో పుకార్లు పుట్టించారని తెలిపారు. ఒక్కసారి పాస్‌పోర్టు జారీ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారం తమకుగానీ, పోలీసులకు గానీ ఉండదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు, రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేసి.. స్వయానా కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పుడే పాస్‌పోర్ట్ రద్దు సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. -
శ్రీనివాస్‌కు 22వరకూ రిమాండ్ పొడిగింపు
విజయవాడ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడి శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు ఈ నెల 22 వరకూ రిమాండ్ పొడిగించింది. శ్రీనివాసరావుకు నేటితో రిమాండ్ ముగియడంతో అతడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కేసు ఛార్జ్‌షీట్ మీడియాలో రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు నిందితుడు శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై కత్తితో శ్రీనివాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. -
శ్రీనివాసరావు రిమాండ్ పొడగింపు
-
జగన్‌పై హత్యాయత్నం కేసు: కోర్టులో ఛార్జీషీట్ దాఖలు
-
సిట్ సహాయ నిరాకరణపై కోర్టు ఆగ్రహం..
-
సిట్ సహాయ నిరాకరణపై కోర్టు ఆగ్రహం..
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో సిట్ సహాయ నిరాకరణపై ఎన్ఐఎ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సిట్ సహకరించడం లేదని ఎన్ఐఎ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఆధారాలను ఎన్ఐఎకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సిట్ ఏసీసీ నాగేశ్వరరావుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే ఎన్ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈనెల 23న వింటామని పేర్కొంది. వారం రోజుల ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావుకు అంతకుముందు అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత అతడిని కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని అతడి తరపు న్యాయవాది సలీమ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరగా రక్షణ కల్పించలేమని ఒప్పుకున్నారు. దీంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో శ్రీనివాసరావును రాజమండ్రి జైలుకు తరలించారు. -
శ్రీనివాసరావుకు జ్యుడిషియల్ రిమాండ్
-
శ్రీనివాసరావుకు జ్యుడిషియల్ రిమాండ్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దర్యాప్తుకు రాష్ట్ర పోలీసులు, సిట్ అధికారులు సహకరించడం లేదని ఎన్ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈనెల 23న వింటామని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏ, సిట్ అధికారులను ఆదేశించింది. (ఎన్ఐఏకు సిట్ సహాయ నిరాకరణ) వారం రోజుల ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావుకు అంతకుముందు అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఎన్ఐఏ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి అడగ్గా.. ఏం లేదని శ్రీనివాసరావు సమాధానమిచ్చాడు. మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలన్న నిందితుడి విజ్ఞప్తిని తిరస్కరించారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని అతడి తరపు న్యాయవాది సలీమ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరగా రక్షణ కల్పించలేమని ఒప్పుకున్నారు. దీంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పటిష్ట భద్రత నడుమ నిందితుడిని రాజమండ్రికి తీసుకెళుతున్నారు. (ఎన్ఐఏ విచారణకు హర్షవర్ధన్ గైర్హాజరు) -
‘ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది.. ఎవరు తెచ్చారు’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐదోరోజు విచారించింది. నిందితుడి విచారణ న్యాయవాదుల సమక్షంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐదోరోజు విచారణలో భాగంగా నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును న్యాయవాది సలీం సమక్షంలో విశాఖపట్నంలోని కైలాసగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విచారించారు. (కొనసాగుతున్న శ్రీనివాస్ విచారణ) శ్రీనివాస్ 20 మంది యువతులతో మాట్లాడిన కాల్ డేటా వివరాలపై ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారని న్యాయవాది సలీం తెలిపారు. ‘ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది. ఎవరు తెచ్చారు’ అనే అంశాలపై శ్రీనివాస్‌కు ప్రశ్నించారని పేర్కొన్నారు. శ్రీనివాస్ కాల్ డేటాను అధికారులు పరిశీలించారని చెప్పారు. మిగిలిన రెండు రోజులు శ్రీనివాస్‌ను ఎక్కడ విచారస్తారనేది ఎన్ఐఏ ఇంకా చెప్పలేదని సలీం బుధవారం మీడియాకు చెప్పారు. కాగా, వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన రోజు ఎయిర్ పోర్ట్ లాంజ్ వద్ద ఉన్న ఇద్దరి వ్యక్తుల నుంచి ఎన్ఐఏ అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం. -
కొనసాగుతున్న శ్రీనివాస్ విచారణ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తమ కార్యాలయంలో నాలుగో రోజు విచారిస్తోంది. న్యాయవాదుల సమక్షంలో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావుతో పాటు పలువురిని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఆధారాలు ముందుంచి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావు చెప్పే విషయాలను రికార్డ్ చేస్తున్నారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. మరో మూడు రోజుల పాటు నిందితుడు ఎన్ఐఏ కస్టడీలో ఉండనున్నాడు. ఎన్ఐఏ అధికారులతో కూడిన మరో బృందం విశాఖపట్నంలో విచారణ జరుపుతోంది. శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి బాగుందని అతడి తరపు న్యాయవాది సలీం తెలిపారు. విచారణ కోసం శ్రీనివాస్‌ను మరోసారి విశాఖపట్నం తీసుకెళ్లే అవకాశం లేదని, మిగతా మూడు రోజులు హైదరాబాద్‌లోనే విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. (వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?) -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?
సాక్షి, అమరావతి/సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారించింది. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ మూడో రోజు పలు కీలక అంశాలపై ప్రశ్నించినట్టు సమాచారం. తొలుత హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాక విచారణ కొనసాగించారు. మాదాపూర్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో శ్రీనివాస్‌రావును అతని న్యాయవాది సమక్షంలోనే ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. జగన్‌పై హత్యాయత్నం ఎందుకు చేశావు.. వెనుక ఎవరున్నారనే దానిపై విచారించారు. శ్రీనివాసరావు కాల్ డేటాను పరిశీలించి, వాటికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఒక్క సంవత్సరంలో వందలాది సిమ్ కార్డులు, పదుల సంఖ్యలో సెల్ఫోన్లు మార్చడం వెనకున్న ఆంతర్యమేంటని ప్రశ్నించినట్టు తెలిసింది. టీడీపీ నేతతో శ్రీనివాసరావు ఫోన్ కాల్స్‌పై దృష్టి: జగన్‌పై హత్యాయత్నం చేయడానికి ముందుగా జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసినట్టు తెలిసింది. ఎయిర్ పోర్టులో ఫ్యూజన్‌ఫుడ్స్ యజమాని వద్ద పనికి కుదిర్చిందెవరు? సంబంధిత టీడీపీ నేతతో శ్రీనివాస్‌రావుకు జరిగినట్టు భావిస్తున్న ఫోన్ కాల్స్ సంభాషణలపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేందుకు ఇచ్చే అనుమతి పాస్ తాత్కాలికమైనా క్రిమినల్ కేసులున్న వ్యక్తికి ఎలా ఇచ్చారు? తాత్కాలిక పాస్ ఇప్పించిందెవరన్న అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పాస్‌కు సిఫారసు లేఖతో పాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులు ఎవరన్నది ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. హత్యాయత్నం చేయడానికి ఎవరైనా పురిగొల్పారా? అనే కోణంపై దృష్టి సారించినట్టు తెలిసింది. విచారణలో భాగంగా నిందితుడు చెప్పిన వివరాలను రికార్డు చేశారు. శ్రీనివాసరావు కస్టడీలో నాల్గో రోజైన మంగళవారం మరోసారి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లేందుకు ఎన్ఐఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం శ్రీనివాసరావును తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. నేర స్థలంలో మరికొన్ని అదనపు వివరాలు సేకరించే విషయంపై ఎన్ఐఏ అధికారులు దృష్టిసారించారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. -
లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోమవారం హైదరాబాద్‌లో విచారించారు. న్యాయవాదుల సమక్షంలో అతడిని ప్రశ్నించారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. నిందితుడి స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. వైఎస్ జగన్‌పై దాడి ఎందుకు చేశావు, దాడి వెనుక ఎవరున్నారనే దానిపై లోతుగా విచారించారు. శ్రీనివాసరావు కాల్ డేటాను పరిశీలించి, దీనిపై ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. నేటితో నిందితుడి మూడో రోజు కస్టడీ ముగిసింది. క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా రేపు మరోసారి విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకెళ్లి విచారించే అవకాశముందని తెలుస్తోంది. నిందితుడిని వారం రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం ఉదయం అతడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విశాఖపట్నంలో అతడిని విచారించారు. (శ్రీనివాసరావుపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం) -
ఎన్ఐఏ అదుపులో శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక భద్రత నడుమ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. (ఎన్ఐఏ కస్టడీకి శ్రీనివాసరావు) శ్రీనివాసరావును విచారణ నిమిత్తం రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించనున్నారు. అక్కడే వారం రోజుల పాటు నిందితుడిని అధికారులు విచారించనున్నారు. నిందితుడిని వారం రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిందితుడికి మూడురోజులకోసారి వైద్యపరీక్షలు చేయించాలని, అతని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
శ్రీనివాసరావుని కోర్టులో హాజరుపరిచిన ఎన్ఐఏ
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ అధికారులు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుని విజయవాడ ఎంఎస్‌జే కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు. ఈ నెల 25 వరకు నిందితుడికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడి తరుపు న్యాయవాదులు ఎవరూ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయక పోవడంతో కస్టడీ పిటిషన్ కాపీని నిందితుడికి కోర్టు అందజేసింది. (శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ డిస్మిస్) -
కట్టు కథలకు పదును!
(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం కేసులో రోజుకో అసత్యాన్ని వల్లె వేస్తూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు తాజాగా మరో అంకానికి తెరతీశారు. అసలిది హత్యాయత్నం కాదు కదా దాడి కూడా కాదంటూ సరికొత్త కట్టుకథను తెరపైకి తెచ్చారు. ఈ కేసులో హైకోర్టు క్రియాశీలంగా వ్యవహరిస్తుండంతోపాటు ఢిల్లీలోని బీసీఏఎస్ డీజీ ఇచ్చిన నివేదికతో కలవరపాటుకు గురై కేసును తప్పుదారి పట్టించేందుకు మార్గాలను అన్వేషిస్తూ అసలు జగన్‌పై దాడే జరగలేదన్న అసత్య ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చేందుకు తెగించారు. తమ నియంత్రణలో ఉన్న నిందితుడు శ్రీనివాసరావు కుటుంబీకులను ఈ కట్టుకథలో పావులుగా వాడుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. అదే డ్రామా...కొత్త కోణంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై పక్కా పన్నాగంతో జరిగిన హత్యాయత్నాన్ని కోడి కత్తితో దాడి అంటూ హేళనగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఈ కేసు తీవ్రతను తగ్గించి చూపించేందుకు ప్రయత్నించారు. ఈ ఎత్తుగడ ఫలించకపోవడంతో తమ నియంత్రణలో ఉన్న నిందితుడి కుటుంబ సభ్యులను వ్యూహాత్మకంగా రప్పించి మరో అసత్య ప్రచారానికి సిద్ధమయ్యారు. నిందితుడు శ్రీనివాసరావును అతడి తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు, సమీప బంధువు రామకృష్ణ ప్రసాద్ గురువారం విశాఖ సెంట్రల్ జైలులో కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడిన మాటలు ప్రభుత్వ పెదల కపట నాటకాన్ని వెల్లడిస్తున్నాయి. ‘యాధృచ్ఛికంగా జరిగిన సంఘటనలో వైఎస్ జగన్‌కు చిన్న గాయమై రక్తం కారింది. అంతేగానీ అసలు కత్తినే వాడలేదు’ అని ములాఖత్ సందర్భంగా శ్రీనివాస్ తమకు చెప్పినట్లు వారు పేర్కొనటం విస్మయపరుస్తోంది. మరి శ్రీనివాస్ ఇంకేదైనా ఆయుధం వాడాడా? అని మీడియా ప్రశ్నించగా వారు సమాధానం దాటవేశారు. హత్యాయత్నం అనంతరం నిందితుడు వినియోగించిన పదునైన కత్తిని సైతం ఘటనాస్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నా, ప్రభుత్వ పెద్దలే పక్కా వ్యూహంతో శ్రీనివాస్ కుటుంబీకులను తాజాగా జైలుకు రప్పించి వారితో ఈ మాటలు పలికించినట్లు స్పష్టమవుతోంది. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు గతంలో చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా తాజాగా మాట్లాడటం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. కుటుంబం పరువు తీశావని నాడు మందలింపు గతంలో ఈ కేసు విచారణకు సంబంధించి పోలీసులు నిందితుడు శ్రీనివాసరావు తల్లిదండ్రులను ఓసారి విశాఖకు రప్పించారు. ఆ సందర్భంగా వారు శ్రీనివాసరావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కుటుంబం పరువు తీశావు. ఎందుకీ పని చేశావు? ఇప్పటికైనా నిజం చెప్పు’ అని కొడుకును తీవ్రంగా మందలించారు. తమ బిడ్డ ఎందుకు ఈ హత్యాయత్నం చేశాడో తెలియడం లేదని అనంతరం పోలీసుల వద్ద వాపోయారు. శ్రీనివాసరావు స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ఠాణేలంకలో అతడి సోదరి రత్నకుమారి విలేకరులతో మాట్లాడుతూ ‘మా తమ్ముడు శ్రీనివాసరావు వద్ద డబ్బులుండేవి కావు. ఈ హత్యాయత్నం వాడికి పుట్టిన బుద్ధి కాదు. ఎవరో డబ్బు ఆశ చూపించి వాడితో ఈ పని చేయించారు’ అని వాస్తవాన్ని కుండబద్ధలు కొట్టినట్టుగా చెప్పారు. దీనికి పూర్తి విరుద్ధంగా శ్రీనివాసరావు తల్లి, సోదరుడు, సమీప బంధువు తాజాగా విశాఖ సెంట్రల్ జైలు వద్ద మాట్లాడటం గమనార్హం. నిందితుడిని జైలుకు తరలించాక అతడి కుటుంబ సభ్యులు ఎవరూ ములాఖత్‌కు రాలేదు. నిందితుడిని ఎవరూ కలవకుండా టీడీపీ పెద్దలే కట్టడి చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలే వ్యూహాత్మకంగా శ్రీనివాసరావు కుటుంబీకులను మరోసారి తెరపైకి తెచ్చారని సమాచారం. పెద్దల ఆదేశాలతోనే ములాఖత్‌కు! ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగిన వెంటనే డీజీపీ, సీఎం చేసిన వ్యాఖ్యలతో ఈ కేసును రాష్ట్ర పోలీసులు పారదర్శకంగా విచారించే అవకాశమే లేదన్న విషయం తేలిపోయింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కేసును కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారించాలని కోరుతూ వైఎస్ జగన్, మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు ప్రభుత్వ, పోలీసుల లోపాలను ప్రశ్నించింది. విమానాశ్రయంలో మూడు నెలలుగా సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదని నిలదీస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఎంపీ వి.విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక వివరణలో ఢిల్లీలోని బీసీఏఎస్ డీజీ కుమార్ రాజేష్‌చంద్ర కీలక విషయాలను వెల్లడించారు. నిందితుడు గానీ, ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని అయిన టీడీపీ నేత హర్షవర్థన్గానీ విమానాశ్రయంలో ప్రవేశించేందుకు అవసరమైన ఏరోడ్రోమ్ ఏంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు కూడా చేయలేదని తెలిపారు. దీంతో ప్రభుత్వ పెద్దల్లో కలవరం మొదలైంది. ఈ కేసు విచారణను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే తమ కుట్ర బయటపడుతుందని ఆందోళన చెందారు. దీంతో అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పక్కా స్క్రిప్ట్ రచించారు. అందుకు శ్రీనివాసరావు కుటుంబీకులను పావులుగా వాడుకుంటూ దిగజారుడు రాజకీయాలకు తెగించారు. శ్రీనివాసరావు బెయిల్‌పై నేడు నిర్ణయం విశాఖ లీగల్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జె.శ్రీనివాసరావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పు శుక్రవారానికి వాయిదా పడింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయలక్ష్మి తన వాదనలను మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించారు. మరికొంత మందిని విచారించాల్సిన అవసరముందని.. అలాగే హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నందున బెయిల్ మంజూరు చేయడం సరైంది కాదని వివరించారు. అనంతరం న్యాయమూర్తి తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు. -
శ్రీనివాసరావుకు మానసిక వైద్యం పిటిషన్ తిరస్కరణ
సాక్షి, విశాఖపట్నం/విశాఖ లీగల్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. శ్రీనివాసరావుకు జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. పోలీసులు నిందితుడిని శుక్రవారం అడవివరం జైలు నుంచి ప్రత్యేక బందోబస్తు మధ్య విశాఖపట్నం మూడో అదనపు మెజిస్ట్రేట్ న్యాయస్థానానికి తీసుకువచ్చారు. ఈ కేసును విచారించిన మెజిస్ట్రేట్ ఈనెల 23 వరకు నిందితుడి రిమాండ్‌కు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు అతడిని సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఈ కేసులో శ్రీనివాసరావు తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ జిల్లా కోర్టు నుంచి మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. ఈ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముందని నిందితుడి తరఫు న్యాయవాది సలీమ్ విలేకరులకు తెలిపారు. నిందితుడి మానసిక పరిస్థితి బాగా లేనందున విశాఖ మానసిక ఆస్పత్రి నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ తాను వేసిన సీఆర్పీసీ 328 పిటిషన్‌ను మెజిస్ట్రేట్ తిరస్కరించారని ఆయన వెల్లడించారు. నిందితునికి ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు, ప్రత్యేక వైద్య పరీక్షలు కావాలనుకున్నప్పుడు నిందితుడే స్వయంగా పిటిషన్ వేయాలి తప్ప నిందితుని తరుఫున పిటిషన్ ఇస్తే పరిగణనలోకి తీసుకోబోమని కోర్టు పేర్కొన్నట్లు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల విచారణ కోసం మెమో ఈ కేసులో ఇప్పటివరకు వాంగ్మూలం ఇవ్వని ప్రత్యక్ష సాక్షులకు సీఆర్పీసీ 164 కింద నోటీసులు ఇచ్చేందుకు అనుమతినివ్వాలని సిట్ తరుఫున మెమో ఫైల్ చేశారు. తమ ఎదుట వాంగ్మూలం ఇవ్వని వారు మెజిస్ట్రేట్ ఎదుట వారి వాంగ్మూలం రికార్డు చేసేందుకు వీలుగా పోలీసులు నోటీసులు జారీ చేస్తారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు నిందితుడికి లేఖరాసేందుకు సహకరించినవారికి, ఫ్లెక్సీ తయారు చేసినవారు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, తనతో పాటు పనిచేసిన సహచర ఉద్యోగుల నుంచి కూడా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం తీసుకొనే వీలుగా సీఆర్పీసీ 164 కింద నోటీసులు ఇవ్వనున్నారు. ఈ విధంగా సాక్షులతో పాటు 30 మందికి నోటీసులు ఇచ్చేందుకు అనుమతి కోరారు. -
వైఎస్ జగన్‌పై దాడి కేసు: సిట్ విచారణలో ఊహించిందే జరిగింది
-
వైఎస్ఆర్సీపీతో ఎలాంటి సంబంధం లేదు
-
ఇదీ అసలు కథ
సాక్షి, విశాఖపట్నం: పోలీస్ బాస్ ఏం చెప్పారో అవే మాటలు నిందితుడు శ్రీనివాసరావు నోటి వెంట చెప్పించేందుకు ‘సిట్’ బృందం తమదైన పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఆసుపత్రికి తీసుకెళ్లే ముందురోజు ఎవరికంటా పడకుండా రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి పోలీస్ శైలిలో కోటింగ్ ఇచ్చి తాము చెప్పినట్లే మీడియాకు చెప్పాలని కోచింగ్ ఇచ్చినట్లు తెలిసింది. కస్టడీకి తీసుకున్న మూడోరోజు ప్రైవేటు వైద్యుడు సూచించాడంటూ కేజీహెచ్‌కు తరలిస్తూ హైడ్రామా ఆడారు. పోలీస్‌స్టేషన్ లోపలినుంచి గుమ్మం వరకు తనంతట తానుగా నడిచి వచ్చిన అతడు ఉన్నట్టుండి కూలబడి పోయాడు. ('పిచ్చి’ కుట్రలు) పోలీసులు రెండు చేతులు పట్టుకుని జీపు ఎక్కించడం.. ఆ వెంటనే నేను ప్రజలతో మాట్లాడాలి.. అంటూ అతను కేకలు వేయడం.. అక్కడనుంచి మీడియాను ఏమారుస్తూ కేజీహెచ్‌కు తరలించడం. అక్కడ అతనితో మీడియాకు చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. తాను జగన్ అభిమానని, జగన్ కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని, అతనితో పోలీసులు చెప్పించేందుకు విఫల యత్నం చేశారు. చివరకు తనకు ప్రాణహాని ఉందని, తనను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. (‘బాస్’ల నివేదిక సిద్ధం) వెలుగులోకి వచ్చిన హైడ్రామా... ఈ కథ వెనుక పోలీసులు ఆడిన హైడ్రామా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి సీపీ మహేష్ చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా నిందితుణ్ని గాజువాక సబ్ డివిజన్ పరిధిలోని ఓ మారుమూల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెల్లవారు జామువరకు పోలీసులు తమదైన శైలిలో కోటింగ్, కోచింగ్ ఇచ్చి ‘రేపు కేజీహెచ్‌కు తీసుకెళ్తాం.. మీడియాకు మేము చెప్పినట్టు చెప్పు’ అంటూ ఒత్తిడి తీసుకొచ్చారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. (జగన్‌ను చంపేయాలనుకున్నా) మీడియా వెళ్లిపోయిన తర్వాత వేరే పోలీస్ స్టేషన్‌కు తరలించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న తలెత్తగా... కస్టడీకి ఇచ్చే సమయంలో కోర్టు నిబంధనల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే విచారణ సాగించాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే అతని కదలికలు పూర్తిగా రికార్డు చేయాల్సి ఉంది. ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో కూడా కెమెరాల పర్యవేక్షణలోనే విచారణ సాగిస్తున్నారు. ఇక్కడ తమదైన శైలిలో నిందితుడిపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో అర్ధరాత్రి తర్వాత లైట్లన్నీ ఆర్పేసి ఆ తర్వాత నిందితుడ్ని వేరే స్టేషన్‌కు తీసుకెళ్లి మరీ తమ బాస్ చెప్పిన ఆ నాలుగు మాటలు చెప్పించేందుకు లాఠీలకు పని చెప్పారని చెబుతున్నారు. -
వైఎస్సార్సీపీతో సంబంధం లేనేలేదు
సాక్షి, విశాఖపట్నం: తమ కుమారుడికి వైఎస్సార్సీపీతో అసలు సంబంధాలు లేనేలేవని వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు తల్లిదండ్రులు స్పష్టం చేశారు. మాకు కూడా ఆపార్టీతో ఎటువంటి అనుబంధం లేదని తెలిపారు. విచారణ కోసం ముమ్మిడివరం మండలం ఠానేలంక నుంచి బుధవారం రాత్రి పోలీసులు శ్రీనివాసరావు తల్లిదండ్రులు సావిత్రమ్మ, తాతారావులను విశాఖకు తీసుకొచ్చారు. తొలుత గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో విచారించిన సిట్ అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. గురువారం రోజంతా అక్కడ వివిధ కోణాల్లో విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు... గ్రామంలో రాజకీయంగా ఏ పార్టీ వారితో తిరిగేవాడు, చురుగ్గా పాల్గొనే వాడా? వంటి విషయాలపై వారిని సిట్ ఆరా తీయగా... వాడు ఎప్పుడూ ఊళ్లో సరిగా ఉండనేలేదు.. వైఎస్సార్సీపీలో లేనే లేడు. ఆ పార్టీ నేతలతో పరిచయం కూడా లేదని వారు చెప్పారు. తొలుత వారిని వేర్వేరుగా విచారించిన సిట్ అధికారులు ఆ తర్వాత ఇద్దర్ని ఒకే రూమ్‌లో పెట్టి శ్రీనివాసరావు ప్రవర్తన, నడవడిక, గుణగణాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత శ్రీనివాసరావును వారి ఎదురుగా పెట్టి అడిగారు. నిందితుని ప్రవర్తన, ఆలోచనా విధానాలే కాకుండా, ఎవరెవరితో ఎక్కువగా ఉండేవాడని అడిగారు. ఎంతపని చేశావ్... ఏరా ఎందుకింత పనిచేశావ్.. ఏం సాధించాలని చేశావ్.. ఎవరి కోసం చేశావ్? తలదించుకునేలా చేశావ్.. ఊళ్లో తల ఎత్తుకోలేకపోతున్నాం..నీ వల్ల అందరి పరువు పోయిందిరా.. అంటూ తాతారావు, సావిత్రమ్మలు కుమారుడిని నిలదీశారు. రాజకీయంగా ఎంతో పేరున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హత్యాయత్నం కేసులో నిందితునిగా నిలబడిన తన కొడుకును చూసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నీకు ఈ పాడు బుద్ధి ఎందుకు పుట్టిందిరా? ఎవరుచెయ్యమన్నారు ? అసలెందుకు చేశావ్? అంటూ కొట్టినంత పనిచేశారు. మందలించినా కనిపించని పశ్చాత్తాపం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొడుకు ఉన్న గదిలోకి ఇద్దర్ని తీసుకెళ్లగానే వారు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. గదిలో ఓ మూలన చేతికి బేడీలు వేసు కుని కూర్చొన్న కొడుకును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తమ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నా అతనిలో కనీస పశ్చాత్తాపం కూడా కన్పించలేదు. మౌనంగా నిల్చుని ఏం సమాధానం చెప్పలేదు. కొనసాగిన విచారణ నిందితుడు శ్రీనివాసరావుపై విచారణ ఐదో రోజు గురువారం నిందితుని కాల్ డేటా చుట్టూనే తిరిగింది. కాల్ డేటా ఆధారంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి తీసుకొచ్చిన సయ్యద్ బీ షేక్, అమ్మాజీ షేక్, నాగర్ వల్లీ, రసూల్‌ను మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేసుకుని గురువారం తెల్లవారు జామున పంపించేశారు. ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరితో పాటు ఆ రెస్టారెంట్లో పనిచేసిన ముగ్గురు యువతులను విచారించారు. పాదయాత్ర సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్టుమీదుగా వైఎస్ జగన్ రాకపోకలు సాగించడం మొదలు పెట్టినప్పటి నుంచి సీసీ కెమెరాల పుటేజ్‌ను విశ్లేషిస్తున్నారు. మరో వైపు శ్రీనావాసరావు ఫోన్లో 321 మందితో గడిచిన నెల రోజులుగా ఎక్కువసార్లు మాట్లాడినట్టుగా నిర్ధారణకు వచ్చారు. వారిలో వందమందికి పైగా పేర్లను నిందితుడు చెప్పడంతో వారి వివరాలు ఆరా తీస్తున్నారు.ఇప్పటి వరకు 40 మందిని విచారించగా, వారిలో 25 మంది మహిళలే కావడం గమనార్హం. నిందితుడికి కేజీహెచ్ వైద్యలు పరీక్షలు నిర్వహించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని ప్రకటిం చారు. కస్టడీ ముగియనుండడంతో శుక్రవారం నిందితుడిని తిరిగి సెంట్రల్ జైలుకు తరలించాల్సి ఉంది. -
జగన్‌పై హత్యాయత్నం ఘటనలో సిట్ విచారణ
-
నాకు ప్రాణహాని ఉంది సర్: నిందితుడు శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం బాగాలేదని పోలీసులకు తెలపడంతో కేజీహెచ్‌కు శ్రీనివాసరావును పోలీసులు తరలించారు. పోలీసులు శ్రీనివాసరావును భూజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లి వ్యాన్‌లో కూర్చోబెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి శ్రీనివాసరావు ఆహారం తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లే సందర్భంగా ‘నాకు ప్రాణహాని ఉంది సర్’ అని శ్రీనివాసరావు పేర్కొనడం గమనార్హం. ఎడమ చేయి బాగా నొప్పి వస్తుందని, ఛాతిలో దడగా ఉందని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పడంతో వైద్యులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు వచ్చి పరీక్షలు చేసిన వైద్యుల సూచనల మేరకు శ్రీనివాసరావును కేజీహెచ్‌కు తరలించారు. తన అవయవాలను దానం చేయాలంటూ నిందితుడు డాక్టర్లతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టు సమాచారం. సమస్య ఏంటి అని అడిగితే.. నాకు వైద్యం కాదు.. అవయవ దానం చేయడానికి సహకరించాలంటూ వైద్యులతో శ్రీనివాసరావు చెప్పినట్టు తెలుస్తోంది. బీపీ, పల్స్ రేట్లు నార్మల్‌గానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కేజీహెచ్ నుంచి నిందితుడు శ్రీనివాస్‌ను డిశ్చార్జ్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని సిట్ అధికారులు తెలిపారు. ప్రతి 48 గంటలకు కస్టడీలో ఉన్న నిందితుడికి వైద్య పరీక్షలు చేయించాలి. అందులో భాగంగానే ప్రైవేట్ వైద్యునితో పరీక్షించామన్నారు. కోర్టుకి వైద్య పరీక్షల నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వ కేజీహెచ్‌కి వైద్య పరీక్షల కోసం తరలించామని పేర్కొన్నారు. విచారణ సాఫీగా సాగుతోందని చెప్పారు. -
ఏడాదిగా పక్కాప్రణాళికతో హత్యాయత్నం!
-
చంద్రబాబు అలా.. శ్రీనివాసరావు సోదరుడు ఇలా
-
ఆరు నెలల తర్వాత కుటుంబసభ్యుల చెంతకు
ఖమ్మంఅర్బన్ : నగరంలోని ప్రశాంతినగర్‌లోని అన్నం ఫౌండేషన్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని 6 నెలల తర్వాత కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. అతడి ఆరోగ్యం కుదుట పడటంతో చిరునామా తెలిపాడు. దీంతో అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు బాగం మోహన్‌రావు, అశోక్‌రెడ్డిల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. ఆరు నెలల కిందట పచ్చిమగోదావరి జిల్లా (ఐ) పంగిడి మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన ఎంఎల్ సుబ్రహ్మణ్యం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొంతకాలం కిందట ఖమ్మం నగరంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో రోడ్డుపై తిరుగుతుండగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నం ఫౌండేషన్ అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావు తీసుకొచ్చి తన ఆశ్రమంలో చేర్పించాడు. వైద్య పరీక్షలు చేయించాడు. దీంతో అతడి ఆరోగ్యం కుదుట పడింది. అనంతరం తన కుటుంబ వివరాలు, గ్రామం పేరు.. ఇతర వివరాలన్నీ చెప్పడంతో వారికి సమాచారం అందించారు. దీంతో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు శ్రీరాములు, కృష్ణకుమారి రావడంతో పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. మంచి మనిషిగా తీర్చిదిద్దిన ఫౌండేషన్ అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
అభిమాన నాయకుడి కోసం..!
జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పని చేసే నారాయణ’ ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 24న రిలీజ్‌కి రెడీ అయ్యింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభిమాని అయిన హీరో హరికృష్ణ జగన్ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘ఎదురు లేని మనిషి జననేత జగన్ అన్న’ అనే ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఆ పాటను వైస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా... చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘జగన్ గారి అభిమాని అయిన మా హీరో హరి కోరిక మేరకు ఎదురు లేని మనిషి జననేత జగనన్న అనే పాటను చేయడం జరిగింది. ఈ పాట ప్రతీ వైఎస్సార్ అభిమాని, వైఎస్ జగన్‌ను ప్రేమించే ప్రతీ వ్యక్తికి నచ్చే విధంగా రూపొందించడం జరిగింది. ఈ పాట సీడీలను జగన్ గారు ఆవిష్కరించి మా హీరో హరిని చిత్ర యూనిట్ ను అభినందించార’ని తెలిపారు. హీరో హరి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గారు విడుదల చేసిన మా సినిమా ఆడియో పెద్ద హిట్ అయ్యింది. ఆయన ఎంతో బిజీగా వున్నా కూడా ఆడియోను విడుదల చేయటం నా జీవితంలో మరచిపోలేని విషయం. జగన్ గారికి ఎంతో రుణపడి ఉన్నాను. ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న నా అభిమాన నాయకుడికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలి అనుకొని ఆ ప్రజా నాయకుడి మీద ఓ పాట రూపొందించే ఆలోచన వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక గీతాన్నిరూపొందించాం. త్వరలోనే మా సినిమాతో మీ ముందుకు వస్తున్నాను.. ప్రేక్షకులు నా ప్రయత్నాన్ని మెచ్చి నన్ను దీవిస్తారు అని ఆశిస్తున్నా’ అని తెలిపారు. -
నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ 10న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీన నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో దీనికి సంబంధించిన ఆల్బెండజోల్ మాత్రలను ఇస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు గైర్హాజరైన విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన మాత్రలు ఇస్తామన్నారు. 1–19 ఏళ్ల మధ్య వయసు కలిగిన 99.56 లక్షల మంది పిల్లలకు ఈ మాత్రలు అందజేస్తామని పేర్కొన్నారు. పిల్లల్లో సాధారణంగా ఏలిక, నులి, కొంకి పురుగులు కనిపిస్తుంటాయని, ఇవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి వృద్ధి చెందుతాయన్నారు. ఈ పురుగులు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణాలు బహిరంగ మల విసర్జన, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడమేనని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 41,337 మంది ఉపాధ్యాయులు, 35,700 అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆల్బెండజో ల్ మాత్ర వేయడంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మాత్ర వేసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవని, నులిపురుగుల సంక్రమణ ఎక్కువగా ఉన్న పిల్ల ల్లో వికారం, వాంతులు, కళ్లు తిరగడం లాంటివి ఉండే అవకాశముందన్నారు. ప్రతికూల ప్రభావాల కు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రావుకు జైలు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాల్లోని ఓ మత్స్యకార సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించే విషయంలో తమ ఆదేశాలను అమలు చేయనందుకు ఎన్నికల అధికారి జి.శ్రీనివాసరావుపై హైకోర్టు మండిపడింది. కోర్టు ఉత్తర్వులంటే అధికారులకు జోక్ అయిపోయిందంటూ వ్యాఖ్యానించింది. ఆదేశాలను శ్రీనివాస్‌రావు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ 2 నెలల జైలు శిక్ష విధించింది. తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును 3 వారాలు నిలుపుదల చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. -
‘హుండీ’ దందా.. వెయ్యి కోట్లు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమంగా ద్రవ్యమార్పిడికి పాల్పడే హవాలా, హుండీ ముఠాల వార్షిక టర్నోవర్ రూ.వెయ్యి కోట్లు ఉండొచ్చని సిటీ పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికీ గుర్తించిన ఐదు ముఠాల్లో ఓ గ్యాంగ్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. వీరి టర్నోవరే ఏడాదికి రూ.200 కోట్ల వరకు ఉంటుందన్నారు. మొత్తం ఆరుగురు నిందితుల్ని పట్టుకుని వారి నుంచి రూ.1.4 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోమవారంతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ‘వజ్రాల’కన్నా ‘హుండీ’మేలని... రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్యమార్పిడిని హవాలా అని, దేశంలోని రెండు ప్రాంతాల మధ్య జరిగే దాన్ని హుండీ అని అంటారు. గుజరాత్‌కు చెందిన జయేశ్ కుమార్ పటేల్ అలియాస్ అతుల్ 2009లో హైదరాబాద్‌కు వలసవచ్చాడు. అబిడ్స్ కేంద్రంగా వజ్రాలు, బంగారం వ్యాపారం చేసే సమయంలో కొన్ని అక్రమ ద్రవ్యమార్పిడి ముఠాలతో పరిచయం ఏర్పడింది. దీంట్లో లాభాల గురించి తెలుసుకుని చిరాగ్ అలీ లైన్లో ఓ కార్యాలయం అద్దెకు తీసుకుని ఏకంగా హుండీ దందా చేసే కంపెనీ తెరిచాడు. దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న హుండీ వ్యాపారులు, ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 2013 నుంచి ఈ దందా చేస్తున్న పటేల్‌ను 2014లో ఓసారి ఐటీ అధికారులు పట్టుకున్నా తీరు మార్చుకోలేదు. వాట్సాప్‌ను విరివిగా వాడేసుకుంటూ... ప్రధానంగా బడా వ్యాపారులు పన్ను ఎగ్గొట్టడానికి, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి హవాలా, హుండీ మార్గాలను ఆశ్రయిస్తుంటారు. నగరానికి చెందిన రియల్టర్లు, బంగారం వ్యాపారులతో పాటు బడా వ్యాపారులకు పటేల్ సహకరిస్తున్నాడు. నగదు తీసుకునే పటేల్ రూ.50 లేదా రూ.100 నోటు నంబర్‌ను చెప్పడమో, వాట్సాప్ ద్వారా షేర్ చేయడమో చేస్తాడు. దీన్ని సదరు సంస్థకు చెందిన వ్యక్తులు నగదు రిసీవ్ చేసుకోవాల్సిన వారికి వాట్సాప్ ద్వారా పంపిస్తారు. పటేల్ సైతం అదే నంబర్‌ను ఆయా నగరాల్లో ఉన్న తమ ఏజెంట్‌కు పంపిస్తాడు. నగదు తీసుకోవాల్సిన సంస్థ ప్రతినిధి ఈ నంబర్‌ను అక్కడి ఏజెంట్‌కు చెప్తే చాలు ఆ మొత్తం అతడికి అందుతుంది. రూ.లక్షకు 600 వరకు కమీషన్... దందా చేసినందుకు హవాలా, హుండీ ఏజెంట్లు రూ.లక్షకు రూ.600 వరకు కమీషన్ తీసుకుంటారు. ఈ పర్సెంటేజ్లో నగదు తీసుకున్న ఏజెంట్, డెలివరీ ఇచ్చిన ఏజెంట్ చెరి సగం తీసుకుంటారు. హవాలా, హుండీ ఏజెంట్ల మధ్య లావాదేవీలన్నీ 3 నెలలకోసారి జరుగుతాయి. ఈ మొత్తాన్ని నగదు, విలువైన వస్తువుల రూపంలో మార్పిడి చేసుకుంటారు. పటేల్ గ్యాంగ్ ప్రతి ఏడాదీ రూ.200 కోట్ల వరకు టర్నోవర్ చేస్తోంది. మిగిలిన ముఠాలూ ఇలాగే రెచ్చిపోతున్నాయి. పటేల్ దందాపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు ఉప్పందడంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్ వారం రోజులుగా నిఘా ముమ్మరం చేశారు. కంపెనీలకు డెలివరీ చేయగా... నగరానికి చెందిన కన్నయ్య అగర్వాల్ రాయలసీమ స్టీల్ రీ–రోలింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఒడిశాకు చెందిన నిమిశ్.. స్కాన్ ఎనర్జీ అండ్ పవర్ లిమిటెడ్ సంస్థకు యజమాని. దీనికి బంజారాహిల్స్‌లో ఓ బ్రాంచ్ ఉంది. ఈ సంస్థలూ ఇటీవల రాయ్‌పూర్, ఒడిశాల్లోని హోల్‌సేల్ వ్యాపారులకు ఐరన్ డెలివరీ చేశాయి. వాటి నుంచి రావాల్సిన చెల్లింపులు హుండీ రూపంలో పటేల్ కంపెనీకి వచ్చాయి. ఈ మొత్తాన్ని డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ‘స్కాన్ ఎనర్జీ’ఉద్యోగి బి.విఘ్నేశ్వర్, రాయలసీమ సంస్థ ఉద్యోగి గణేశ్ సత్యనారాయణ సబూ వేర్వేరుగా పటేల్ నుంచి డబ్బు తీసుకుని వస్తుండగా టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. 2 వాహనాలతో పాటు రూ.75 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. వీరిచ్చిన సమాచారంతో పటేల్ కార్యాలయంతో పాటు స్కాన్ సంస్థలో టాస్క్‌ఫోర్స్ సోదాలు చేసింది. అప్పటికే కొంత మొత్తం డెలివరీ... విఘ్నేశ్వర్ అప్పటికే కొంత నగదును తన కార్యాలయంలోని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ధడ్చీకి అప్పగించినట్లు చెప్పాడు. అరుణ్‌ను పట్టుకున్న అధికారులు రూ.47.35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పటేల్ కంపెనీపై దాడి చేసి అతడితో పాటు ఉద్యోగి ప్రదీప్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని రూ.18.45 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్నవారితో పాటు స్వాధీనం చేసుకున్న నగదునూ ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వర్‌రెడ్డికి అప్పగిస్తున్నామని పోలీసు కమిషనర్ చెప్పారు. సిటీలో ఉన్న మిగిలిన అక్రమ ద్రవ్యమార్పిడి ముఠాల కోసం గాలిస్తున్నామని తెలిపారు. కన్నయ్య, నిమిశ్కూ నోటీసులు జారీ చేస్తామని రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. -
సిన్సియర్ ప్రేమ
‘‘శీనుగాడి ప్రేమ’ సినిమా పాటలు, టీజర్ బాగున్నాయి. నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా నటించారు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఆర్.కేని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీనివాసరావు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘శీనుగాడి ప్రేమ’. ‘సిన్సియర్ రా మామా’ అన్నది ట్యాగ్ లైన్. ప్రణవి, కావేరి, చాందిని కథానాయికలు. రమణ సాకే స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నేను డైలాగ్స్ చెప్పే విధానం చూసిన డైరెక్టర్ హీరోగా నటించమన్నారు. కథ కూడా బాగుండటంతో నటించి, నేనే నిర్మించాను’’ అన్నారు. ‘‘శీను పేరున్న వారికి కనెక్టయ్యే కథాంశంతో ఈ సినిమా చేశాం. లవ్, కామెడీ, ఎమోషన్.. ఇలా ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలుంటాయి’’ అన్నారు ఆర్.కె. -
సిన్సియర్ రా మామా
శ్రీనివాసరావు, ప్రణవి, కావేరి, చాందినీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘శీనుగాడి ప్రేమ’. ‘సిన్సియర్ రా మామా’ అన్నది ఉపశీర్షిక. ఆర్.కె.డి. దర్శకత్వంలో సుష్మా ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై ధరిమిశెట్టి సత్యేశ్వరి నిర్మించిన ఈ సినిమా డబ్బింగ్ జరుపుకుంటోంది. నిర్మాత సత్యేశ్వరి మాట్లాడుతూ– ‘‘లవ్, సెంటిమెంట్, యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. వినోదానికీ పెద్దపీట వేశాం. ఆర్.కె.డి. చెప్పిన కథను తెరపై చక్కగా ఆవిష్కరించారు. హైదరాబాద్, అరకు, వైజాగ్, కాణిపాకం, తిరుపతి, చెన్నైలోని అందమైన ప్రదేశాల్లో ఐదు పాటలు చిత్రీకరించాం. త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అన్నివర్గాల ప్రేక్షకులను మా చిత్రం ఆకట్టుకుని, విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. రాంపల్లి వెంకటరమణ, రమ్య, భవాని తదితరులు నటించిన ఈ చిత్రా నికి కెమెరా: సతీష్, సంగీతం: రమణ. -
హైదరాబాద్‌లో 48 గంటల పాటు 144 సెక్షన్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో రేపటి నుంచి 48 గంటల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. డిసెంబర్ 6న బ్లాక్ డే సందర్భంగా నగరంలో నిషేదాజ్ఞలు విధిస్తూ పోలీస్ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ర్యాలీలు, ప్రదర్శనలు, పబ్లిక్ మీటింగ్‌లు, సమావేశాలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతాల్లో నలుగురు లేదా అంతకుమించి ఒకేచోట గుమికూడి ఉండటం, సభలు, సమావేశాల్లో ఉద్రేకపూరిత, ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం నిషేధమన్నారు. సభలు, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ ఉత్తర్వులకు విరుద్దంగా వ్యవహరించేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదని సీపీ సూచించారు. ఈ నిషేధాజ్ఞలు నెల 5న ఉదయం 6.00 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6.00 అమలులో ఉంటాయని చెప్పారు. -
మానవత్వాన్ని చాటుకున్న న్యాయమూర్తి
► గుండెనొప్పితో కిందపడిన నిందితుడు ► జైలుకు కాకుండా ఆస్పత్రికి తరలించాలని ఆదేశం హైదరాబాద్: కోర్టులో ముద్దాయిలకు శిక్ష వేసే న్యాయమూర్తులకు గుండె కటువుగా ఉంటుందంటారు. వారు న్యాయన్యాయల గురించి మాత్రమే ఆలోచిస్తారని చాలా మంది నమ్మకం. కానీ వారిలో కూడా సున్నిత మనస్తత్వం ఉంటుంది. ఎదుటి వారికి ఏదైనా జరిగితే చలించే గుణం ఉంటుంది. సరిగ్గా అలాంటి సంఘటన హైదరాబాద్నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో జరిగింది. కేసు విచారణలో ఉన్న సమయంలో గుండెనొప్పితో కిందపడిపోయిన ఓ నిందితుడిని ఆస్పత్రికి తరలించాలని ఆదేశించి ప్రాణాలు నిలిపారు. వివరాల్లోకి వెళ్తే నాంపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ అష్రఫ్(70)కు మోజంజాహీ మార్కెట్లో షాలిమార్ వీడియో క్యాసెట్ దుకాణం ఉంది. ఈ దుకాణంలో వాటాల కోసం అతని తమ్ముడి భార్య షమీనా భాను ఈ ఏడాది ఫిబ్రవరి 24న బేగంబజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అష్రఫ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి శుక్రవారం 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బి. శ్రీనివాస్‌రావు ఎదుట హాజరుపరిచారు. దీంతో అతడిని రిమాండ్‌కు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో అకస్మాత్తుగా నిందితుడు గుండెపోటుకు గురై కిందపడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించాలని మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలు పోయేవని వైద్యులు చెప్పారు. సకాలంలో స్పందించిన న్యాయమూర్తికి అష్రఫ్ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మానవతా దృక్పథంతో స్పందించిన న్యాయమూర్తి సమయస్ఫూర్తికి అక్కడున్న వారంతా చలించిపోయారు. -
భూకుంభకోణం నిందితులకు రిమాండ్
హైదరాబాద్: నగరంలో సంచలనం రేపిన ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో ముగ్గురు నిందితులను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.587కోట్ల విలువైన 693 ఎకరాల ప్రభుత్వ భూమిని పారిశ్రామిక వేత్తలకు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని మూసాపేట రిజిస్టార్ శ్రీనివాసరావు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా అప్పనంగా భూములను పొందిన గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా ప్రతినిధి పార్థసారథిని, అకౌంటెంట్ శర్మలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు నిందితులకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించాని కోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణ కోసం ముగ్గురు నిందితులను పదిరోజుల కస్టడీకి అనుమతినివ్వాలిని పోలీసులు పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఈభూముల అక్రమ రిజిస్ట్రేషన్లలో సుమారు పదివేల కోట్ల కుంభకోణం జరిగినట్లు అధికారులు, భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఇప్పటి వరకూ జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
పార్టీ మారినందుకు చెప్పు దెబ్బ
-
పార్టీ మారినందుకు చెప్పు దెబ్బ
కృష్ణా: గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో శనివారం రగడ జరిగింది. వైఎస్సార్సీపీ టిక్కెట్టుపై గెలిచి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీని వీడి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రవికాంత్ చెప్పుతో కొట్టారు. పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కౌన్సిల్ హాల్ లో గందరగోళం ఏర్పడింది. -
సీబీఐ వలలో ఐటీ అధికారి
విశాఖపట్నం: ఆదాయపు పన్ను శాఖాధికారి ఒకరు సీబీఐ వలకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఐటీ అధికారి శ్రీనివాసరావును సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.2.03 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ అధికారులు శ్రీనివాసరావును గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు. -
తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత
-
తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వేధింపులకు గురిచేస్తున్నాడని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావుపై ఉద్యోగులు చేయిచేసుకున్నారు. అతడిని సీట్లో నుంచి బయటకు లాక్కొచ్చి ఆందోళన చేశారు. అవినీతికి పాల్పడటమే కాకుండా తమను వేధిస్తున్నాడని, అటెండర్ నుంచి పై స్థాయి ఉద్యోగులపైనా అతడి వేధింపులు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. సర్వీసులు, సెలవులకు సంబంధించి కూడా ఆయన వేధిస్తున్నాడని చెప్పారు. గత కొద్ది రోజులుగా పద్దతి మార్చుకోవాలని చెబుతున్నా అతడు తీరు మార్చుకోకపోవడంతో తాము నేడు చేయిచేసుకున్నామని వారు అంటున్నారు. అయితే, ఉద్యోగుల విభజన అంశమే వివాదానికి దారి తీసిందని సచివాలయ వర్గాలు అంటున్నాయి. శ్రీనివాసరావుది ఆంధ్రప్రదేశ్ స్థానికత అని చెప్తున్నారు. -
12న కలెక్టరేట్ ఎదుట ధర్నా
హత్నూర: కంట్రిబ్యూషనరీ పింఛన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలని కోరుతూ ఈ నెల 12న సంగారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా నాయకుడు శ్రీనివాస్‌రావు అన్నారు. బుధవారం దౌల్తాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. సీపీఎస్ రద్దు కోసం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో దశలవారీగా కార్యక్రమాలకు ఎస్టీఎఫ్ఐ పిలుపునిచ్చిందన్నారు. -
డీఎస్డీవోగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ
గుంటూరు స్పోర్ట్స్: గుంటూరు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా బి.శ్రీనివాసరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. ఉదయం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను కలిసి రిపోర్ట్ చేశారు. ఇన్చార్జి జేసీ ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్వో నాగబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో శాప్ ఓఎస్డీ, ఇన్చార్జ్ డీఎస్yీ వో పి.రామకృష్ణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. -
కెటినా ప్రారంభం
రాయికల్: అంతర్జాతీయ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న కెటిన కార్యాలయాన్ని గురువారం సికింద్రాబాద్‌లో జిల్లాకు చెందిన శ్రీనివాస్‌శర్మ, చీటి సతీశ్‌రావుతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన గుండపనేని చక్రధర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌శర్మ మాట్లాడుతూ, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ∙కెనడలో నిర్వహించిన సమ్మెట్లో తాము పాల్గొని పలు వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఫార్మా, ఫుడ్, ఫాస్టింగ్ మూవీ, కంస్యూమింగ్ గూడ్స్ రంగాల్లో ఉపాధి కల్పించేందుకే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. -
నెల్లిపాకలో గ్యాస్ సిలిండర్ పేలుడు..
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించింది. ఏటపాక మండలం నెల్లిపాక గ్రామంలో చీమల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల వేడికి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలిడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. సిలిండర్ పేలుడుకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆ శబ్దానికి గ్రామస్తులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. -
'లాబీయింగ్ చేయండి, ఒత్తిడి తీసుకురండి'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కోసమే వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నారని సీపీఎం జాతీయ నేత శ్రీనివాసరావు అన్నారు. వామపక్షాలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాయని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అధికార టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు ఆపి ప్రత్యేక హోదాకు సహకరించాలని కోరారు. ప్రత్యేక హోదాకు అడ్డంకులుంటే లాబీయింగ్ చేయాలని, కేంద్రంపై ఒత్తడి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల్లో సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఊదరగొట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు మాట తప్పడం చేతగానితనం అవుతుందని విమర్శించారు. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
బొబ్బిలి(విజయనగరం జిల్లా): పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసరావు రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కేంద్రంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో జరిగింది. వివరాలు.. మండలంలోని చింతలవానిపేట గ్రామ సర్పంచ్ భర్త యామలగోపీ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని ఏఈ శ్రీనివాసరావును సంప్రదించాడు. కాగా, ఏఈ రూ. 5వేలు లంచం ఇవ్వాలని గోపీని డిమాండ్ చేశాడు. దీంతో ఈ విషయంపై గోపీ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం గోపీ వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈ శ్రీనివాసరావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు
సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాస రావు నూనెపల్లె: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాసరావు ఆరోపించారు. సీపీఎం 20వ జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా శుక్రవారం సాయంత్రం పట్టణంలోని మున్సిపల్ టౌన్హాల్లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభలో శ్రీనివాసరావు మాట్లాడతూ.. ప్రధాని మోడీ విదేశీ పెట్టుబడులతో కార్పొరేట్ సంస్థలకు ఆహ్వానించాలని చూడడం సరికాదన్నారు. ఎఫ్‌డీఐలతో దేశంతో 40వేల మంది చిల్లర వ్యాపారులు రోడ్డున పడతారన్నారు. విదేశాల సొమ్ముకు సీఎం చంద్రబాబు నాయుడు కక్కుర్తి పడుతున్నారని, ఇందుకు దావోస్‌లో జరిగిన దేశాల ఆర్థిక సమావేశానికి వెళ్లడమే ఉదాహరణగా చెప్పారు. వాల్‌మార్ట్ సంస్థకు వ్యాపారాలు చేయాలని బాబు చెబుతున్నారని, దీంతో చిన్న సన్నకారు రైతులు పంటలు సాగు మానుకోవాల్సిందేనన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ మాట్లాడుతూ..రాష్ట్ర విభజనకు బీజేపీ, టీడీపీ మద్దతిచ్చాయన్నారు. విభజన రాష్ట్రాలకు అప్పట్లో ప్యాకేజీలు ఇస్తామని నాయకులు చెప్పిన మాటలు మరిచారన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని రాష్ట్ర కమిటీ సభ్యుడు షడ్రక్ డిమాండ్ చేశారు. సీమ సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రామాంజనేయులు, రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, నాయకులు శంకరయ్య, మస్తాన్‌వలి, మద్దులు తదితరులు పాల్గొన్నారు. -
డబ్లింగ్ కరెన్సీ ముఠా అరెస్ట్
తాడేపల్లిగూడెం లక్షకు రెండు లక్షలిస్తాం.. మూడు లక్షలిస్తామని మాయమాటలు చెప్పి చివరకు చిన్నపిల్లలు ఆడుకునే రంగునోట్లను అంటగట్టి పరారయ్యే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడేపల్లిగూడెం సీఐ ఎంవీఆర్ఎల్ఎస్ఎస్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కడకట్ల సమీపంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగాడుతుండగా పోలీ సులు పట్టుకున్నారు. వారినుంచి రూ.500 నోట్లను పోలిన 1,198రంగు కాగితాలు, రెండు అసలు నోట్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో తాడేపల్లిగూడెంలోని జువ్వలపాలెంకు చెందిన ముద్దాల శ్రీనివాసరావు, మసీద్ సెంటర్‌కు చెందిన కేసనపల్లి రమేష్‌కుమార్, భీమడోలు మండలం అంబర్‌పేటకు చెందిన ఏలూరి ఆనంద్ , నిడమర్రు మండలానికి చెందిన జంగం రంగారావు ఉన్నారు. నిందితుల్లో ఒకరైన శ్రీనివాసరావు గతంలోనూ డబ్లింగ్ కరెన్సీ కేసులో నిందితుడు. ఈ ముఠా చేతిలో మోసపోయిన చాలామంది ఆ విషయూన్ని ఎవరికీ చెప్పుకోలేక ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. డబ్బుకు ఆశపడి మాయగాళ్ల చేతుల్లో మోసపోవద్దని, ఎవరైనా మోసపోయి ఉంటే తమకు ఫిర్యాదు చేయూలని కోరారు. సీఐ వెంట ఎస్సై కొండలరావు ఉన్నారు. -
కలకలం..!
పట్టణంలోని బొత్సపేట వద్ద మంగళవారం సాయంత్రం 5 గంట ల సమయంలో ఒక్కసారిగా కలక లం రేగింది. కారులో నుంచి దిగిన నలుగురు వ్యక్తులు..అక్కడే దుకాణంలో ఉన్న వ్యక్తిని తమ వద్దకు రమ్మని పిలిచి, కారులోకి ఎ క్కించేందుకు ప్రయత్నించారు. .ఈ సమయంలో ఆయన పెద్దగా కేకలు వేసినా.. విడిచిపెట్టకుండా వారు ఆయన్ను కారులో ఎక్కించుకుని పరారయ్యారు. ఈ సంఘటన స్థానికుల్లో ఒక్కసారిగా కలకలంరేపింది. పట్టణంలోని తోటపాలెం బొత్సపేటలో బండారు శ్రీనివాసరావు నివాసం ఉంటున్నారు. ఈయన శ్రీ సాయిగిరిజ కిరాణా, బుక్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5. 30 గంటల సమమంలో దుకాణం ముందు స్కార్పియో కారు ఆగింది. కారులో ఉన్న వ్యక్తులు శ్రీనివాసరావును కారు వద్దకు రావాలని పిలిచారు. కారు వద్దకు వెళ్లిన శ్రీనివాసరావును కారు ఎక్కాలని బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేశారు.ఈ సమయం లో శ్రీనివాసరావు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న అక్క వెంకటలక్ష్మి వచ్చి శ్రీనివాసరావును లాగే ప్రయత్నం చేసింది. కానీ కారులో ఉన్న వ్య క్తులు వారిని పక్కకు నెట్టి శ్రీనివాసరావును తీసుకుని పరారయ్యారు. కుటుంబ సభ్యు లు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ పోలీ సులు వెంబడించగా కారులో ఉన్న వ్యక్తులు పోలీ సులకు చెందిన ఐడెంటీ కార్డులు చూపించడంతో వదిలివేసినట్టు చెబుతున్నారు. కాగా ఈ సంఘట నపై భిన్న కథనాలు వినిపిస్తున్నారుు. శ్రీనివాసరా వు దొంగల నుంచి బంగారం కొనుగోలు చేసినట్టు గా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన క్రైం పోలీసులు స్కార్పియోలో వచ్చి శ్రీని వాసరావును తీసుకువెళ్లినట్టు సమాచారం. కారు లో పోలీసులతో పాటు ఇద్దరు దొంగలు ఉన్నట్టు కొందరు చెబుతున్నారు. వారే శ్రీనివాసరావును చూపించిన ట్టు తెలుస్తోంది. అయితే స్కార్పియో లో ఎనిమిది మంది వ్యక్తులతో పాటు ఓ యువతి కూడా ఉం దని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై ఒక టో పట్టణ సీఐ కె. రామారావును ప్రశ్నించగా ఎం దుకు తీసుకువెళ్లారన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు. సీఆర్పీఎప్ పోలీసులు చెప్పిన మేరకు విచారణ కోసం పోలీసులే తీసుకువెళ్లినట్టు తెలుస్తోందన్నారు. -
ట్రావెల్స్ బస్సులపై దాడులు ఆపండి
అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్: ప్రైవేటు ట్రావెల్స్‌పై అక్రమ దాడులను వెంటనే నిలిపివేయాలని ట్రావెల్స్‌లో పనిచేస్తున్న కార్మికులు డిమాండ్‌చేశారు. అక్రమ దాడులతో వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీవో కార్యాలయం ఎదుట కార్మికులు, నిర్వాహకులు ధర్నా చేశారు. బస్సులతోసహా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని, తమ జీవనోపాధికి గండి కొట్టవద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులు సాంబశివరావు, శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రతిరోజూ ప్రైవేటు ట్రావెల్స్‌పై దాడులు చేస్తున్నారని, దీంతో కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో సుమారు 500 కుటుంబాల వరకు ఈ ట్రావెల్స్‌పై జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. రవాణాశాఖ అధికారుల తీరుతో తమకు ఉపాధి ఉండడం లేదన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని డిమాండ్‌చేశారు. ఈ రంగంలో అనేక మంది మెకానిక్‌లు, క్లీనర్లు, సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం డీటీసీ సుందర్‌ను కలిసి తమకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్మికులకు వైఎస్సార్ సీపీ అండ.. ట్రావెల్స్ బస్సు కార్మికులు ఆర్టీవో కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా, నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గం కన్వీనర్ నసీర్ అహ్మద్, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ గులాం రసూల్, ఎస్సీ విభాగం నగర కన్వీనర్ విజయ్‌కిషోర్, పార్టీ నాయకులు జూలూరి హేమంగద గుప్తా, శ్రీకాంత్‌యాదవ్, తిరుపతి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం డీటీసీ సుందర్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ట్రావెల్స్ బస్సులు ఆపడంతో కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. నగరంలోనే వందల కుటుంబాలు దీనిపై జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిల మధ్య నెలకొన్న వివాదాలకు కార్మికులు, నిర్వాహకులు బలవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. డీటీసీ సుందర్ మాట్లాడుతూ కార్మిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని, మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. కార్మికులకు న్యాయం చేయకుంటే ఈనెల 27న మళ్లీ ఆందోళన చేపడతామని నాయకులు తెలిపారు. -
బాలా త్రిపురసుందరి ఆలయంపై 15 విగ్రహాలు ధ్వంసం
త్రిపురాంతకం, న్యూస్‌లైన్ : పిడుగుపాటుకు పాక్షికంగా దెబ్బతిన్న బాలా త్రిపురసుందరీదేవి ఆలయ గోపురాన్ని దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. బాలా త్రిపురసుందరి ఆలయ గోపురంపై గురువారం రాత్రి పిడుగుపడిన విషయం విధితమే. పిడుగుపాటుకు ఆలయ గోపురం పగుళ్లిచ్చింది. కొన్ని విగ్రహాలు పూర్తిగా ధ్వంసం కాగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తం 15 విగ్రహాలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న గోపురాన్ని జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, మార్కాపురం ఆర్డీఓ సత్యనారాయణ, తహసీల్దార్ వరప్రసాద్ పరిశీలించారు. దేవాదాయ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గోపురంపై దెబ్బతిన్న 15 విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గోపుర నిర్మాణానికి వెంటనే మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఆలయంపై పిడుగుపాటు సంఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపడతారా అని విలేకర్లు ప్రశ్నించగా.. ఆగమ శాస్త్ర పండితుల సలహాతో చర్యలు చేపడతామని చెప్పారు. నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆర్డీఓ సత్యనారాయణ తెలిపారు. ఆలయ గోపుర నిర్మాణ పనులను త్వరగా పూర్తిగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేశారు. ‘ఇది అతి పురాతనమైన చరిత్ర గల ఆలయమైనందున అరిష్టం జరిగిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే పనులు వెంటనే చేపట్టాల’ని డేవిడ్‌రాజు కోరారు. త్వరలోనే పనులు చేపడతామని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆలయాల కార్యనిర్వహణాధికారి పప్పు వెంకట్రావు, శ్రీనివాసరెడ్డి ఉన్నారు. -
మళ్లీ గబ్బర్ టెర్రర్
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: పోలీసుల వైఫ్యలం కారణంగా జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో రౌడీల దందాలు, దాడులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కొద్దినెలల క్రితం వరకు పట్టణంలో రౌడీరాజ్యం చెలాయించి, పత్రికల్లో వార్తలు రావడం.. పోలీసులు ఏవో కొన్ని చర్యలు తీసుకోవడంతో కొద్దికాలంపాటు మౌనం వహించిన పంచ భూతాల్లో ఒకడైన గబ్బర్ గ్యాంగ్ మళ్లీ దాడులకు తెగబడుతోంది. తనపై రౌడీ షీట్ ఉన్నా ఏమాత్రం భయపడకుండా గబ్బర్ దాడులకు దిగుతుండటం గమనార్హం. దమ్మల వీధికి చెందిన ఈ గ్యాంగ్ తాజాగా ఆదివారం అర్ధరాత్రి ప్రశ్నించిన పాపానికి ఓ ఆటో డ్రైవర్‌పై దాడి చేసి చితక్కొట్టారు. పట్టణంలోని బొడెమ్మ కోవెల సమీపంలో నివాసముంటున్న ఆటో డ్రైవర్ మైలపిల్లి భీమారావు ఆదివారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో తన పని ముగించుకుని ఆటోలో ఇంటికి వెళుతుండగా పందుంపుల్ల సెంటర్ వద్ద గబ్బర్, అతని సోదరుడు శ్రీనివాసరావు, మరికొందరు అనుచరులు ఆపి ఆటోలో తమను ఇళ్ల వద్ద దిగబెట్టాలని డిమాండ్ చేశారు. మీ అందరి వద్ద బళ్లు ఉన్నాయి కదా.. ఆటోలో దిగబెట్టడమేమిటని భీమారావు వారిని ప్రశ్నించాడు. అంతే.. మమ్మల్నే ఎదురు ప్రశ్నిస్తావా అంటూ ఆ గ్యాంగ్ భీమారావుపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.దాంతో అతని శరీరంపై చాలా చోట అవుకు దెబ్బలు తగలగా, కింది పెదవి పూర్తిగా చిట్లిపోయింది. గాయాలతో రిమ్స్‌లో చేరిన బాధితుడి నుంచి అక్కడి ఔట్ పోస్టు పోలీసులు వివరాలు సేకరించారు. తనపై దమ్మల వీధికి చెందిన రాయితి గబ్బర్, రాయితి శ్రీనివాసరావు, దుమ్ము అప్పన్న(కలస అప్పన్న), వాడల రాంబాబు(పొట్టి రాంబాబు)తో పాటు మరికొంత మంది దాడి చేశారని భీమారావు పోలీసులకు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గబ్బర్ ముఠా ఆస్పత్రికి వచ్చి కేసు విత్‌డ్రా చేసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. ‘మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. ఏ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫర్వాలేదు.. ఎంతైనా ఖర్చు పెట్టి బయటకు రాగలమంటూనే కేసు విత్‌డ్రా చేసుకోకపోతే నిన్ను చంపేసి కేసు లేకుండా చేసుకోగలమని’ బెదరించారు. దీంతో రిమ్స్‌లో తనకు రక్షణ ఉండదని భయపడిన భీమరావు సోమవారం ఉదయం శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేశాడు. తనను కొట్టిన వారిలో బర్రి మురళీ, తోటయ్య కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెలుగులోకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం గబ్బర్ ముఠా ఆగడాలు ప్రజలను ఎంతగా భయపెడుతున్నాయో చెప్పడానికి మరో ఉదాహరణ.. వీరి కారణంగానే ఇటీవల ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన. శ్రీకాకుళం ఒకటో పట్టణ పరిధిలో పని చేస్తున్న ఓ హోంగార్డు భార్య పట్ల ఇటీవల గబ్బర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకున్నారు. దీనిపై ఆ హోంగార్డు వెంటనే ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం. అయితే ఏం జరిగిందో గానీ.. ఆ సంఘటనపై కేసే లేకుండా పోయింది. వెలుగులోకి రాని ఇటువంటి దారుణాలు ఎన్నో గబ్బర్ ముఠా ఖాతాలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ముఠా దాడులు, ఆగడాలతో బయట తిరగాలంటేనే భయమేస్తోందని దమ్మల వీధి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ ఈ ముఠా జోక్యం చేసుకుని అమాయకులను చితకబాదేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసులు నమోదై, అరెస్టు అయినా.. ఇలా వెళ్లి.. అలా బయటకు వచ్చేసి.. మరింతగా రెచ్చిపోతున్నారని.. అందువల్ల పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న భయమేస్తోందని వాపోతున్నారు. నిందితుల అరెస్టు కాగా ఆటో డ్రైవర్ భీమరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయితి గబ్బర్, రాయితి శ్రీనివాసరావు, దుమ్ము అప్పన్న, వాడల రాంబాబులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్సై భాస్కరరావు తెలిపారు.