
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాల్లోని ఓ మత్స్యకార సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించే విషయంలో తమ ఆదేశాలను అమలు చేయనందుకు ఎన్నికల అధికారి జి.శ్రీనివాసరావుపై హైకోర్టు మండిపడింది. కోర్టు ఉత్తర్వులంటే అధికారులకు జోక్ అయిపోయిందంటూ వ్యాఖ్యానించింది.
ఆదేశాలను శ్రీనివాస్‌రావు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ 2 నెలల జైలు శిక్ష విధించింది. తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును 3 వారాలు నిలుపుదల చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment