jail punishment
-
మత స్వేచ్ఛ(సవరణ) బిల్లుకు ఆమోదం... బలవంతం చేస్తే 10 ఏళ్లు జైలు శిక్ష
Freedom of Religion (Amendment) Bill: హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీ మతస్వేచ్ఛ(సవరణ) బిల్లు 2022 ను ఏకగ్రీవం ఆమెదించింది. ఈ బిల్లులో సాముహిక మార్పిడిని నిషేధించింది. ఒకరు లేదా అంకంటే ఎక్కువ మంది ఒకేసారి మతం మార్చుకుంటున్నట్లు పేర్కొంది. బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడితే సుమారు ఏడేళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేసింది. ఇది కేవలం 18 నెలలు క్రితం అమల్లోకి వచ్చిన హిమచల్‌ప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం 2019కి మరింత కఠినమైన సంస్కరణ అని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నేతృత్వంలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశ పెట్టింది. 2019 చట్టంలో సాముహిక మత మార్పిడిని ఆరికట్టడానికి ఎటువంటి నిబంధన లేదని అందువల్లే ఈ చట్టాన్ని సవరించి రూపొందించడం జరిగిందని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ పేర్కొన్నారు. అంతేకాదు 2019 మత స్వేచ్ఛ చట్టం డిసెంబర్ 21 2020న సుమారు 15 నెలలు తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిందని, ఐతే ఇది అతి తక్కువ శిక్షలను సూచిస్తోందని చెప్పారు. (చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’) -
నాటుసారా కేసులో సంచలన తీర్పు
కాకినాడ లీగల్: నాటుసారా విక్రయిస్తున్న మహిళకు రెండేళ్ల జైలు, రూ.2 లక్షలు జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఎం.మాధవి శుక్రవారం సంచలన తీర్పునిచ్చారు. ఇప్పటివరకు సారా కేసుల్లో నెలల వ్యవధిలోనే జైలు శిక్షలు, వేల రూపాయల్లోనే జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చేవారు. మొట్టమొదటిసారిగా భారీగా జరిమానాతోపాటు శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కాకినాడ గొడారిగుంట కొండేలుపేటకు చెందిన చోడిపల్లి బంగారమ్మ 2020లో జి–కన్వెన్షన్ హాలు ప్రాంతంలో సారా విక్రయిస్తున్న ఆమెను పోలీసులు పట్టుకుని 10 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో బంగారమ్మపై నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు, రూ.2 లక్షలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. చదవండి👉బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు: ఉన్మాదికి ఉరి -
గుర్రంలా సకిలించినందుకు జైలుశిక్ష
డోలు.. డోలు కొట్టుకుంటే మధ్యలో ఉన్న మద్దెలను వాయించినట్లు... రష్యాలోని ఓ భార్యభర్తల గొడవ, వీధి ప్రజల నిద్రను మాయం చేసింది. అది కూడా సుమారు రెండున్నర సంవత్సరాల పాటు. కారణం, రోజూ వారి గొడవలు వినలేక కాదు, గుర్రం సకిలింతలు వినలేక. భార్యభర్తల గొడవల మధ్యలో గుర్రం సకిలింతలు ఏంటని ఆలోచిస్తున్నారా? నిజానికి ఆ భార్యభర్తలు గొడవపడి, విడిపోయి మూడు సంవత్సరాలు అవుతోంది. కానీ, అతను మాత్రం భార్య తనని వదిలేసి వెళ్లడాన్ని జీర్ణించుకోలేపోయాడు. ఆ అవమానం, బాధ తట్టుకోలేక కుమిలిపోయాడు. చివరకు మతిస్థిమితం కోల్పోయి, ఓ సైకోలా తయారయ్యాడు. ఎంతలా అంటే కేవలం వీధి ప్రజల నిద్ర చెడగొట్టడానికి వేల రూపాయలు ఖర్చు చేసి, ఓ పెద్ద సౌండ్ సిస్టమ్, స్పీకర్స్ కొన్నాడు. ఇక రోజూ వాటిని ఉపయోగించి, ప్రతిరోజూ గుర్రంలా సకిలిస్తూ, ఆ శబ్దాలతో హోరెత్తించేవాడు. అలా సుమారు రెండన్నర సంవత్సరాల పాటు కొనసాగించాడు. అతని బాధ చూడలేక కొంతమంది, అతన్ని మానసికవైద్యశాలలో చేర్పించాలని కూడా చూశారు. ఎటువంటి లాభం లేకపోయింది. దీంతో విసుగు చెందిన వీధి ప్రజలు ఎంతోమంది అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, కోర్టుకు అప్పగించారు. కోర్టు అతడికి మూడున్నర సంవత్సరాల జైలుశిక్ష విధించింది. -
కస్టడీ వ్యక్తి మృతి: ముగ్గురు పోలీసులకు పదేళ్ల జైలు
సాక్షి, చెన్నై: కస్టడీలో ఉన్న నిందితుడి మృతి కేసులో సబ్ ఇన్స్పెక్టర్ సహా ముగ్గురు పోలీసులకు పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ దిండుగల్ కోర్టు తీర్పు వెలువరించింది. దిండుగల్ జిల్లా వడమదురై పోలీసులు గతంలో మెట్టినా పట్టికి చెందిన సెంథిల్‌కుమార్‌ను బెదిరింపు కేసులో అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించే సమయంలో గుండెపోటు రావడంతో అతను మరణించాడు. అయితే పోలీసులు కొట్టి చంపేసినట్టుగా ఆరోపణలు రావడం, బంధువులు ఆందోళనకు దిగడంతో కేసు సీబీసీఐడీకి చేరింది. విచారణ ముగించిన సీబీసీఐడీ వడమదురై స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుమలై ముత్తుస్వామి, హెడ్ కానిస్టేబుళ్లు అరవిందన్, పొన్రాజ్, అబ్దుల్ వహబ్‌లపై మీద కేసు నమోదు చేసింది. దిండుగల్ కోర్టు న్యాయమూర్తి శరవణన్ ఈ కేసును విచారిస్తూ వచ్చారు. సీబీసీఐడీ సమర్పించిన చార్జ్ షీట్ మేరకు 60 మంది సాక్షులను విచారించారు. వాదనలు ముగించారు. విచారణలో సెంథిల్‌కుమార్‌ను అరెస్టు చేసిన సమయంలో మెట్టినాపట్టి నుంచి వడమదురై పోలీసు స్టేషన్ వరకు దారి పొడవునా కొట్టుకుంటూ తీసుకొచ్చినట్టు తేలింది. తీవ్ర రక్తస్త్రావం జరిగినా కప్పిపుచ్చి ఆగమేఘాలపై కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే ప్రయత్నం చేసినట్టు వెలుగు చూసింది. దీంతో ఈ కేసులో ఎస్ఐ తిరుమలైస్వామి, పొన్రాజ్, అరవిందన్‌లకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం సాయంత్రం న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అలాగే చెరో రూ.5 వేల జరిమానా విధించారు. అదే సమయంలో సబ్ ఇన్స్పెక్టర్కు అదనంగా ఏడాది జైలు, రూ. వెయ్యి జరిమానా విధించారు. చదవండి: 10 కిలోల బంగారు ఆభరణాలతో పరార్ -
శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెక్‌బౌన్స్ కేసులో నటుడు శరత్‌కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. వివరాలు ఇలా.. శరత్‌కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్ ఫ్రేమ్స్ సంస్థ ‘ఇదు ఎన్న మాయం’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్ర నిర్మాణం కోసం రాడియన్స్ అనే సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకున్నారు. 2015 మార్చిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అప్పు తీర్చని పక్షంలో టీవీ ప్రసార హక్కులు లేదా ఆ తరువాత నిర్మించే చిత్ర హక్కులను ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అదనంగా రూ.కోటి అప్పుతీసుకుని చెన్నై టీనగర్‌లోని ఆస్తిని తాకట్టుపెట్టారు. ఆ డబ్బుతో ‘పాంబు సట్టై’ అనే మరో చిత్రాన్ని నిర్మించి ఒప్పందానికి కట్టుబడనందున తమకు రావాల్సిన రూ. 2.50 కోట్లు వడ్డీ సహా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని, టీ నగర్ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. డబ్బు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పడంతో శరత్‌కుమార్, రాధిక కలిసి 7 చెక్కులను రాడియన్స్ సంస్థకు అందజేశారు. శరత్‌కుమార్ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్ అయింది. ఈ కారణంగా శరత్‌కుమార్ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్‌పై రాడియన్స్ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్‌కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్‌కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్‌కుమార్, స్టీఫెన్‌లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్ జారీచేసింది. -
మహిళా కండక్టర్‌కు నాలుగు నెలల జైలు
సాక్షి, సిటీబ్యూరో: పోలీసుల సమక్షంలోనే ఓ మహిళపై దాడి చేసిన ఆర్టీసీ మహిళా కండక్టర్‌కు నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పింది. ఆర్టీసీ మహిళా కండక్టర్ అనురా«ధ భర్త ఆశోక్, ఆమె కుటుంబసభ్యులు తనను వేధిస్తున్నారని 2016 అక్టోబర్ 12న మణి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి పోలీసు విచారణాధికారి వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇస్తుండగా కండక్టర్ అనురాధ, ఆమె తల్లి సరళ మణిపై దాడి చేశారు. ఈ కేసును విచారించిన హయత్‌నగర్‌లోని 14వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనురాధకు 4 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. చీటింగ్ కేసులో నిందితుడికి మూడేళ్లు.. యాచారం పోలీసు స్టేషన్ 2015లో నమోదైన మోసం, ఫోర్జరీ కేసులో నిందితుడు చౌదరిపల్లికి చెందిన శ్రీనివాస్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇబ్రహీంపట్నంలోని 16వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. మరో కేసులో 2017 ఫిబ్రవరి 14న రాంగ్రూట్లో ఆటో నడిపి ఇద్దరు గాయాలకు కారణమైన ఆగాపల్లికి చెందిన ఆటోడ్రైవర్ బాలయ్యకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిందని రాచకొండ పోలీసులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
కలెక్టర్ భాస్కర్‌కు జైలుశిక్ష, జరిమానా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎస్సీ కార్పొరేషన్లో ఉద్యోగులకు సంబంధించిన వివాదంలో హైకోర్టు తీర్పును అమలు చేయని కారణంగా జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్షను విధించడం సంచలనంగా మారింది. ఏడాది కాలంగా ఎస్సీ కార్పొరేషన్లో ఆరుగురు ఉద్యోగుల జీతాల విషయంలో వివాదం నెలకొనడం, గత ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆరుగురు ఉద్యోగులపై త్రీటౌన్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత ఉద్యోగులు న్యాయపోరాటం చేశారు. ఈ వ్యవహారంపై తామిచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని నిర్ధారిస్తూ కోర్టు ధిక్కారం కింద జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్‌కు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును ఆరువారాల పాటు నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ఎం.ఎస్.రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఎస్.వి.శేషగిరిరావు మరో ఐదుగురు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ వచ్చింది. ఆ మేరకు వారు వేతనాలు అందుకుంటున్నారు. అయితే వీరిని నిబంధనలకు విరుద్ధంగా పర్మినెంట్ చేశారని, అక్రమంగా పదోన్నతులు ఇచ్చారని నిర్ధారిస్తూ వారి వేతనాలు నిలిపివేశారు. దీనిపై తమ జీతాల విడుదలకు 2015లో హైకో ర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లకు జీతాలను విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తూ 2016లో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవడంతో శేషగిరిరావు తదితరులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఆ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సుప్రీంకోర్టు తమ ఆదేశాలపై స్టే ఇవ్వనందున, తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని భావిస్తూ జిల్లా ఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ హోదాలో ఉన్న కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు నెల రోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. అప్పీల్ నిమిత్తం తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేశారు. జిల్లా కలెక్టర్‌కు కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
అమెరికా జైళ్లలో 2,382 మంది భారతీయులు
వాషింగ్టన్: చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించి వివిధ అమెరికన్ జైళ్లలో దాదాపు 2,400 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తున్నారు. స్వదేశంలో వివక్షను, దాడులను ఎదుర్కొంటున్నామన్న కారణంతో అమెరికాలో ఆశ్రయం పొందేందుకు వీరంతా ప్రయత్నించినట్టు తెలిసింది. ఇలా శిక్ష అనుభవిస్తున్న వారిలో పంజాబీలో ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ‘ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్డ్’ద్వారా ఉత్తర అమెరికా పంజాబీ సంఘం (నాపా) ఈ గణాంకాలను సేకరించింది. అమెరికాలోని 86 జైళ్లలో 2,832 మంది శిక్ష అనుభవిస్తున్నారని నాపా వెల్లడించింది. -
నవాజ్ షరీఫ్‌కి భారీ ఊరట
-
నవాజ్ షరీఫ్ జైలు శిక్ష రద్దు: విడుదల
ఇస్లామాబాద్: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు.. ఇస్లామాబాద్ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. అవెన్‌ఫీల్డ్ కేసులో షరీఫ్ (68), ఆయన కూతురు మర్యం, అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ ముహ్మద్ సఫ్దార్‌ల జైలు శిక్షను నిలిపివేస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో బుధవారం రాత్రి ఈ ముగ్గురినీ విడుదల చేశారు. రావల్పిండి ఎయిర్‌బేస్ నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్‌కు పటిష్టమైన భద్రత నడుమ తరలించారు. విడుదలకు ముందు జైలు సూపరింటెండెంట్ గదిలో తన సన్నిహితులతో ‘నేనేం తప్పు చేయలేదు. అది నా అంతరాత్మకు తెలుసు. ఏది సత్యమో అల్లాకు తెలుసు’ అని షరీఫ్ అన్నట్లు పాక్ మీడియా పేర్కొంది. లండన్‌లోని అవెన్‌ఫీల్డ్ ప్రాంతంలో ఖరీదైన బంగళాలు కొన్నారన్న కేసులో తమను జైల్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ షరీఫ్, కూతురు, అల్లుడు ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. -
‘తలాక్’ను నిషేధిస్తూ ఆర్డినెన్స్
న్యూఢిల్లీ: ముస్లింలు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే ట్రిపుల్ తలాక్ పద్ధతిని నేరంగా పరిగణించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పడం నిషిద్ధం, చట్ట విరుద్ధం, శిక్షార్హం అవుతుంది. ఈ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదిస్తూ నిబంధనలు చేర్చారు. ఈ ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపిన తరువాత న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత కూడా ఆ కేసులు నమోదవుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామని తెలిపారు. ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం కాకుండా..విచారణకు ముందే నిందితులకు బెయిల్ మంజూరుచేసే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. నిందితులకు కొన్ని రక్షణలు చేకూరుస్తూ బిల్లులో చేసిన సవరణలకు కేబినెట్ ఆగస్టు 29నే ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది నా, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మద్దతు తెలపకపోవడం వల్లే బిల్లు అపరిష్కృతంగా ఉందని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. వచ్చే సమావేశాల్లోనైనా బిల్లుకు మద్దతివ్వాలని యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి విజ్ఞప్తి చేశారు. కాగా, తలాక్‌పై రూపొందించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాయంత్రం సంతకం చేశారు. సోనియా మౌనం సరికాదు.. ‘గతేడాది సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ తీర్పు చెప్పినా కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం. ఈ విషయంలో సోనియా గాంధీ మౌనం వహించడం సరికాదు. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యవహారం కాదు. లింగ సమానత్వం, మహిళల గౌరవానికి సంబంధించినది’ అని ప్రసాద్ అన్నారు. ఓటుబ్యాంక్ రాజకీయాల ఒత్తిడితోనే కాంగ్రెస్ రాజ్యసభలో బిల్లుకు మద్దతివ్వడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సహకారం కోరేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మను 5–6 సార్లు కలిశానని, అయినా ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 2017 జనవరి నుంచి 2018 సెప్టెంబర్ మధ్య కాలంలో 430 ట్రిపుల్ తలాక్ కేసులు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అందులో 229 కేసులు సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందు, 201 కేసులు ఆ తరువాత వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. సాధికారత దిశగా ముందడుగు: బీజేపీ మహిళా సాధికారత దిశగా ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ గొప్ప ముందడుగు అని అధికార బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో ఈ సంప్రదాయానికి మద్దతుగా వాదించారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని ముస్లిం మహిళలకు న్యాయం చేసే అంశంగా కాకుండా రాజకీయ కోణంలో చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. బాధిత మహిళకు పరిహారం చెల్లించని భర్త ఆస్తులను జప్తుచేయాలన్న తమ డిమాండ్‌కు బీజేపీ అంగీకరించలేదని ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. భార్యలను వదిలిపెడుతున్న హిందూ భర్తలను కూడా శిక్షించేలా చట్టాలు ఎందుకు చేయడంలేదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆర్డినెన్స్ ముస్లిం మహిళలకు వ్యతిరేకమని, అది వారికి మరింత అన్యాయం చేస్తుందన్నారు. ముస్లిం మహిళలకు ఎదురయ్యే అసలు సమస్యలను ఆర్డినెన్స్ విస్మరించిందని కొందరు మహిళా కార్యకర్తలు ఆరోపించగా, ఈ విషయంలో సమగ్ర చట్టం అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాల్లోనూ నిషిద్ధం తక్షణ ట్రిపుల్ తలాక్‌ను భారత్ సహా 22 దేశాలు నిషేధించాయి. ఈ జాబితాలో మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి.. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న కోర్టుకు, భార్యకు నోటీసులు పంపాలి. 1961లో చేసిన చట్టం ద్వారా పాకిస్తాన్లో తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించారు. ముస్లిం ప్రాబల్య దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు, సైప్రస్, ట్యూనీషియా, అల్జీరియా, మలేసియా, జోర్డాన్‌లలోనూ నిషేధించారు. ఆర్డినెన్స్‌లో ఏముందంటే.. ► తక్షణ ట్రిపుల్ తలాక్‌కే ఇది వర్తిస్తుంది. ► తనకు, తన మైనర్ పిల్లలకు జీవన భృతి కోరు తూ బాధిత మహిళ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు. ► పిల్లల సంరక్షణ తనకే అప్పగించాలని భార్య కోర చ్చు. మెజిస్ట్రేట్‌దే తుది నిర్ణయం. ► బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదుచేయాలి. ► ట్రిపుల్ తలాక్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా పేర్కొంటున్నా, నిందితుడు విచారణకు ముందే బెయిల్ కోరుతూ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు. ► భార్య వాదనలు విన్న తరువాత మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయొచ్చు. ► బిల్లు నిబంధనల ప్రకారం భార్యకు పరిహారం చెల్లించేందుకు అంగీకరించిన తరువాతే భర్తకు మెజిస్ట్రేట్ బెయిల్ ఇస్తారు. ► చెల్లించాల్సిన పరిహారం ఎంతో మెజిస్ట్రేట్ నిర్ణయిస్తారు. ► మెజిస్ట్రేట్ తన అధికారాలు ఉపయోగించి భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించొచ్చు. ► ట్రిపుల్ తలాక్ కాంపౌండబుల్ నేరం..అంటే, కేసును ఉపసంహరించుకునే స్వేచ్ఛ ఇరు వర్గాలకు ఉంటుంది. మార్పులు ఇలా.. ముమ్మారు తలాక్ లేదా.. అప్పటికప్పుడు ఈ–మెయిల్, వాట్సాప్ సందేశాలు, ఫోన్, లేఖల ద్వారా ఇచ్చే విడాకులు (ఇన్స్టంట్ తలాక్) రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తీర్పునిచ్చాక ఈ అంశం వేగం పుంజుకుంది. దీనిపై చోటుచేసుకున్న మార్పులను ఓసారి పరిశీలిస్తే.. ► 2015 అక్టోబర్ 16: విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు లింగవివక్షకు గురవుతున్నారా? అని పరిశీలించేందుకు బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సీజేఐని కోరిన సుప్రీంకోర్టు. ► 2016 జూన్ 29: రాజ్యాంగ పరిధిలోనే పరిశీలించాల్సి ఉందన్న అత్యున్నత న్యాయస్థానం ► డిసెంబర్ 9: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్ హైకోర్టు. ► 2017 ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. ► ఏప్రిల్ 16: ముస్లిం మహిళలకు ఈ సమస్య నుంచి విముక్తి కలగాలని మోదీ ప్రకటన. ► మే 15: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటిస్తే.. ముస్లిం వివాహాల క్రమబద్ధీకరణకు చట్టాన్ని తెచ్చేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ► ఆగస్టు 15: ఎర్రకోట ప్రసంగంలో ముస్లిం మహిళలకు మోదీ అభినందన ► ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటన ► డిసెంబర్ 28: లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం ► 2018 సెప్టెంబర్ 19: ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ ఆర్డినెన్సు జారీ. -
సాఫ్ట్వేర్ క్రిమినల్ లాయర్ జైలుకు..
బెంగళూరు: చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సకల ప్రయత్నాలుచేశాడు. అందుకోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వదిలేసి లా చదివి క్రిమినల్ లాయర్‌గా మారాడు. ఏంచేసినా ఫలితం శూన్యం. దీంతో పదేళ్ల కిందట కేసులో శిక్ష పడింది. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాకు చెందిన శివప్రసాద్ సజ్జన్ సాఫ్ట్వేర్ ఇంజనీ. ఓ మహిళకు అశ్లీల ఈ–మెయిల్స్ పంపుతూ, ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అందరికీ సర్క్యులేట్ చేస్తూ వేధించాడు. బాధిత మహిళ ఫిర్యాదుచేయంతో సజ్జన్‌ను 2008లో పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన సజ్జన్.. ఇంజనీరింగ్ జాబ్ వదిలి లా గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తిచేసి క్రిమినల్ లాయర్ అయ్యాడు. కేసును పొడిగించేందుకు చట్టంలోని లొసుగులను వాడాడు. తర్వాత కేసు సీఐడీకి బదిలీ అయ్యింది. తాజాగా కేసు విచారణ పూర్తయింది. సజ్జన్‌ను దోషిగా నిర్ధారించిన బెంగళూరులోని కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధించింది. -
రాయిటర్స్ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు
యాంగూన్: మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులకు అక్కడి న్యాయస్థానం సోమవారం ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లు అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని యాంగూన్ కోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది ఆగస్టులో అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్ఎస్ఏ)కి చెందిన కొందరు ఉగ్రవాదులు మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, ఆర్మీ కేంద్రాలపై దాడిచేశారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేత పేరిట మయన్మార్ సైన్యం ఊచకోత ప్రారంభించడంతో దాదాపు 7 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు అరచేత పట్టుకుని బంగ్లాదేశ్‌కు పారిపోయివచ్చారు. ఈ సందర్భంగా రఖైన్‌లోని ఇన్ డిన్ గ్రామంలో 10 మంది అమాయకుల్ని మయన్మార్ సైన్యం కాల్చిచంపిన విషయాన్ని వా లోన్, కా బయటపెట్టారు. అనంతరం యాంగూన్‌లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న వీరికి పోలీస్ అధికారి ఒకరు కొన్ని కాగితాలను రహస్యంగా అందించారు. వాటిని తీసుకుని హోటల్ నుంచి బయటకు రాగానే ఆర్మీ అధికారులు కా, లోన్లను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన యాంగూన్ కోర్టు ఇద్దరు జర్నలిస్టుల వద్ద దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయని తెలిపింది. తామిద్దరం ఎలాంటి తప్పు చేయలేదని జర్నలిస్టులు చేసిన వాదనను ఈ సందర్భంగా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరిద్దరికి ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు అనంతరం లోన్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ తీర్పును మేం దృఢచిత్తంతో, ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ప్రభుత్వం తమను అరెస్ట్ చేయగలదనీ, కానీ ప్రజల కళ్లు, చెవులను మాత్రం మూయలేదని కా అన్నారు. ఈ రోజు మయన్మార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాకు దుర్దినమని రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీఫెన్.జె.అడ్లర్ వ్యాఖ్యానించారు. మీడియా నోరు మూయించేందుకు, భయపెట్టేందుకు మయన్మార్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందన్నారు. కాగా ఇద్దరు జర్నలిస్టులను విడుదల చేయాలని మయన్మార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేశాయి. -
అడుగు పెట్టగానే అరెస్ట్!
లాహోర్: పాకిస్తాన్లో రాజకీయం మరింత ముదిరింది. ఎవన్‌ఫీల్డ్ అపార్ట్మెంట్ కేసులో పదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఏడేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె మర్యమ్ శుక్రవారం దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లాహోర్‌లో అల్లర్లు తలెత్తకుండా పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) పార్టీకి చెందిన 300 మంది నేతలు, కార్యకర్తల్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నేడు సాయంత్రం 6.15 గంటలకు నవాజ్, ఆయన కుమార్తె మర్యమ్ బ్రిటన్ నుంచి లాహోర్‌కు చేరుకోనున్న నేపథ్యంలో వీరిద్దరిని ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) చైర్మన్ జావేద్ ఇక్బాల్ ఆదేశించారు. అరెస్టుచేసి వీరిద్దరినీ రావల్పిండిలోని అదియాలా జైలుకు తరలించాలని చూస్తున్నారు. అరెస్ట్ సందర్భంగా నగరంలో అల్లర్లు తలెత్తకుండా 10,000 మంది పోలీసుల్ని అధికారులు మోహరించారు. -
ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రావుకు జైలు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాల్లోని ఓ మత్స్యకార సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించే విషయంలో తమ ఆదేశాలను అమలు చేయనందుకు ఎన్నికల అధికారి జి.శ్రీనివాసరావుపై హైకోర్టు మండిపడింది. కోర్టు ఉత్తర్వులంటే అధికారులకు జోక్ అయిపోయిందంటూ వ్యాఖ్యానించింది. ఆదేశాలను శ్రీనివాస్‌రావు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ 2 నెలల జైలు శిక్ష విధించింది. తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును 3 వారాలు నిలుపుదల చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. -
చెంఘీజ్ఖాన్నే అవమానిస్తావా?
బీజింగ్: మంగోల్ సామ్రాజ్యాధినేత చెంఘీజ్‌ఖాన్ చిత్రపటాన్ని కాలితో తొక్కి అవమానించడంతో పాటు దాన్ని వీడియోతీసి సోషల్‌మీడియాలో పోస్ట్చేసిన ఓ చైనా పౌరుడికి ఏడాది జైలుశిక్ష పడింది. చైనాలో స్వయంప్రతిపత్తి గల ఇన్నర్ మంగోలియాలోని ఇన్చువాన్ నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లువో అనే వ్యక్తి మే నెలలో చెంఘీజ్‌ఖాన్ చిత్రపటాన్ని తొక్కడంతో పాటు ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్చేశాడు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారడంతో పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లువోపై జాతుల మధ్య విద్వేషం, వివక్ష పెంచేందుకు కుట్రపన్నాడని కేసు నమోదుచేసిన పోలీసులు..అతడిని అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపర్చారు. మంగళవారం జరిగిన విచారణలో లువో తన నేరాన్ని అంగీకరించడంతో కోర్టు అతనికి ఏడాది జైలుశిక్ష విధించింది. మంగోల్ రాజ్య వ్యవస్థాపకుడైన చెంఘీజ్ను మంగోల్ జాతి ప్రజలు అత్యంత గౌరవిస్తారు. -
కుల దూషణ కేసులో సర్పంచికి జైలు
గుంటూరు లీగల్: అంగన్వాడీ కార్యకర్తను కులంపేరుతో దూషించి అవమాన పరచిన కేసులో నిందితుడైన ఓ పంచాయతీ సర్పంచ్‌కు జైలు శిక్ష ఖరారైంది. కోర్టు రెండేళ్ళ జైలు శిక్షతో పాటు రూ. 25 వేలు జరిమాన విధిస్తూ జరిమానలో రూ. 20 వేలు బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 4 వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. పెదనందిపాడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన దీపల నాగవేణి అలియాస్ గేరా నాగవేణి అదే గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన ఏసుపాగ అంజలి అంగన్వాడీ పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది. 2014 జనవరి 24న అంజలి తనకు రెండు నెలలు సెలæలవు కావాలని నాగవేణిని అడిగింది. అన్ని రోజులు సెలవులు ఇచ్చే అధికారం తనకు లేదని చైల్డ్ డెవలెప్ మెంట్ ఆఫీసర్ (సి.డి.పి.ఒ) బిల్లా మాణిక్యరావుకు ఆ అధికారం ఉందని ఆయనను అడగమని చెప్పింది. ఆయా ఆ పని చేయకుండా గ్రామ సర్పంచి నాగినేని శివశంకరరావు ఫిర్యాదు చేసింది. సర్పంచి సెలవు ఇవ్వాలని కోరగా అంగన్వాడీ సీడీపీవోను అడగమని సూచించింది. దీంతో కోపోద్రిక్తుడైన సర్పంచి నాగవేణిని కులంపేరుతో దూషించి అవమాన పరచాడు. ఘటనపై నాగవేణి భర్త 2014 నవంబర్ 8న పెదనందిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం శివశంకరరావుపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితునిపై నేరం రుజువు చేయడంతో జైలు శిక్ష, జరిమాన విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు చెప్పారు. ఏపీపీ నక్కా శారదామణి ప్రాసిక్యూషన్ నిర్వహించగా అప్పటి బాపట్ల డీఎస్పీ కె.సుధాకర్ కేసు దర్యాప్తు చేశారు. -
బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి జైలు
మాచర్ల: బాలిక కిడ్నాప్ కేసులో నిందితునికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పింది. మాచర్ల అర్బన్ సీఐ సత్యకైలాష్‌నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గి మండలం అడిగొప్పలలో నివాసముండే షేక్ హుస్సేన్ తన మకాంను 2013లో మాచర్ల మార్చాడు. నెహ్రూనగర్‌లో నివాసముండే ఓ బాలికకు మాయ మాటలు చెప్పి అదే సంవత్సరం అక్టోబర్ మొదటి వారంలో అపహరించి అడిగొప్పలకు తీసుకెళ్లాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. విచారణ అనంతరం నిందితుడు నేరానికి పాల్పడినట్టు గురజాల అసిస్టెంట్ సెషన్స్ కోర్టు మేజిస్ట్రేట్ ఎం. గురునా«థ్ మంగళవారం తీర్పు చెప్పారు. నిందితునికి రెండు సంవత్సరాలు జైలు, రూ.3 వేలు జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కాశీవిశ్వనాథం వాదించారు. -
మూగజీవుల పట్ల క్రూరత్వం తగదు: ఓజా
-
మూగజీవుల పట్ల క్రూరత్వం తగదు: ఓజా
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: జంతు ప్రదర్శనశాలల్లో జంతువులను బంధిస్తూ ఒక రకంగా వాటికి జైలు శిక్ష వేస్తున్నారని హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆందోళన వ్యక్తం చేశాడు. మూగజీవుల పట్ల క్రూరత్వం తగదన్నాడు. ఈ రకమైన చర్యలకు నిరసనగా పెటా ఆధ్వర్యంలో ఓజా తనను తాను ఓ బోనులో బంధించుకుని నిరసన వ్యక్తం చేశాడు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెం. 5లోని అన్నపూర్ణ స్టూడి యోస్ గ్రాండ్ బాల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతను మాట్లాడుతూ... స్వేచ్ఛగా అడవుల్లో తిరగాల్సిన జంతువులను ప్రదర్శనశాలల్లో బంధిస్తూ ఆనందాన్ని పొందుతున్నారని... దీంతో అవి మానసికంగా ఎంతో కుంగిపోతున్నాయని వాపోయాడు. నిర్వాహకుల క్రూరత్వం వల్ల మూగజీవులు తమ సహజ జీవన విధానానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయని చెప్పాడు. ‘తలరాతలు మార్చడం-జంతుశాలలకు తరలించడానికి స్వస్తి పలకండి అనే నినాదాన్ని అతను ప్రదర్శించాడు. జంతుప్రదర్శన శాలలకు వెళ్లవద్దని తన అభిమానులను ఈ సందర్భంగా ఓజా కోరాడు. కొద్ది సమయమే తాను బోనులో లాక్ చేసుకుంటే తలతిరుగుతోందని... అలాంటిది జీవితాంతం బోనులో ఉంచే జంతువుల పరిస్థితిని ఆలోచించాలన్నాడు. బోనులో తనను తాను బంధించుకొని నిరసన వ్యక్తం చేస్తున్న క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా -
కంపెనీ మోసంతో కటకటాలకు..
బూర్గుపల్లి(గంగాధర), న్యూస్‌లైన్: మలేసియాలో మంచి ఉద్యోగమని నమ్మి వెళ్తే కంపెనీ చేసిన మోసంతో ఏడుగురు వలసజీవులు కటకటాలపాలయ్యారు. తమవారు ఎంతోకొంత సంపాదించుకొని వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు పిడుగులాంటి వార్తవిని కుమిలిపోయారు. సంపాదన దేవుడెరుగు.. తమ వారిని విడిపించుకోవడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. మలేసియా జైల్లో శిక్ష అనుభవించిన ఆరుగురు వ్యక్తులు ఇటీవల స్వగ్రామాలకు చేరుకోగా.. వారితో వెళ్లిన దూస రవి మాత్రం జైల్లోనే ఉండిపోయాడు. తన భర్తను విడిపించుకునే స్తోమత లేక .. సర్కారు సాయం అందక అతడి భార్య శ్రీదీప గొల్లుమంటోంది. ‘సారూ.. నా భర్తను విడిపించండి’ అంటూ కన్నీటితో వేడుకుంటోంది. మలేసియాలో ఉద్యోగం.. నెలకు పాతిక వేల జీతం.. మూడేళ్లు పనిచేస్తే ఆరు లక్షలు వెనుకేసుకోవచ్చు.. ఇక్కడ రెక్కలు ముక్కలు చేసుకుంటే పైసా మిగిలింది లేదు.. అంటూ ఓ కంపెనీ చెప్పిన తియ్యటి మాటలకు ఆకర్షితులై గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన.. ఆరుగురు వ్యక్తులతోపాటు దూస రాజేశ్వర్ ఏడాదిన్నర క్రితం మలేసియా వెళ్లారు. ఆరు నెలలకోసారి రెండుసార్లు వీసా స్టాంపింగ్ చేసిన కంపెనీ ఆ తర్వాత చేతులెత్తేసింది. అక్కడి పోలీసుల తనిఖీలో వీరు ఏడుగురు పట్టుబడ్డారు. వీసా లేనందున డెబ్బై రోజుల జైలు శిక్ష విధించారు. శిక్ష ముగిసిన తర్వాత సంపత్ మినహా మిగతావారికి కుటుంబసభ్యులు విమాన టిక్కెట్లు పంపించడంతో ఆరుగురు వారం క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. సంపత్ పాస్‌పోర్టు రెన్యూవల్ కాకపోవడం, ఔట్‌పాస్ లేకపోవడంతో శిక్షముగిసినా జైల్లోనే ఉన్నాడు. భర్తను రప్పించడం కోసం సంపత్ భార్య శ్రీదీప పడరాని పాట్లు పడుతోంది. సంపత్ పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్లిన ‘న్యూస్‌లైన్’ ముందు తన బాధ చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. నాలుగు నెలల నుంచి ఫోన్ కూడా లేదని, జైలు నుంచి వచ్చిన వారితో కొడుకును మంచిగ చూసుకోమని చిన్న చిట్టి రాసి పంపాడని ఆమె కన్నీరు పెట్టుకుంది. తన భర్తను జైలు నుంచి ఇంటికి రప్పించడానికి కంపెనీ మేనేజరు గానీ, ఏజెంట్ గానీ పట్టించుకోవడం లేదని పేర్కొంది. అధికారులెవరైనా ఔట్‌పాస్ ఇప్పించి తన భర్తను జైలు నుంచి విడిపించాలని శ్రీదీప వేడుకుంటోంది.