
వాషింగ్టన్: చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించి వివిధ అమెరికన్ జైళ్లలో దాదాపు 2,400 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తున్నారు. స్వదేశంలో వివక్షను, దాడులను ఎదుర్కొంటున్నామన్న కారణంతో అమెరికాలో ఆశ్రయం పొందేందుకు వీరంతా ప్రయత్నించినట్టు తెలిసింది. ఇలా శిక్ష అనుభవిస్తున్న వారిలో పంజాబీలో ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ‘ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్డ్’ద్వారా ఉత్తర అమెరికా పంజాబీ సంఘం (నాపా) ఈ గణాంకాలను సేకరించింది. అమెరికాలోని 86 జైళ్లలో 2,832 మంది శిక్ష అనుభవిస్తున్నారని నాపా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment