బాలిక కిడ్నాప్ కేసులో నిందితునికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పింది.
బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి జైలు
Published Tue, Oct 18 2016 9:02 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
మాచర్ల: బాలిక కిడ్నాప్ కేసులో నిందితునికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పింది. మాచర్ల అర్బన్ సీఐ సత్యకైలాష్‌నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గి మండలం అడిగొప్పలలో నివాసముండే షేక్ హుస్సేన్ తన మకాంను 2013లో మాచర్ల మార్చాడు. నెహ్రూనగర్‌లో నివాసముండే ఓ బాలికకు మాయ మాటలు చెప్పి అదే సంవత్సరం అక్టోబర్ మొదటి వారంలో అపహరించి అడిగొప్పలకు తీసుకెళ్లాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. విచారణ అనంతరం నిందితుడు నేరానికి పాల్పడినట్టు గురజాల అసిస్టెంట్ సెషన్స్ కోర్టు మేజిస్ట్రేట్ ఎం. గురునా«థ్ మంగళవారం తీర్పు చెప్పారు. నిందితునికి రెండు సంవత్సరాలు జైలు, రూ.3 వేలు జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కాశీవిశ్వనాథం వాదించారు.
Advertisement
Advertisement