సాక్షి, సిటీబ్యూరో: పోలీసుల సమక్షంలోనే ఓ మహిళపై దాడి చేసిన ఆర్‌టీసీ మహిళా కండక్టర్‌కు నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పింది. ఆర్‌టీసీ మహిళా కండక్టర్ అనురా«ధ భర్త ఆశోక్, ఆమె కుటుంబసభ్యులు తనను వేధిస్తున్నారని 2016 అక్టోబర్ 12న మణి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి పోలీసు విచారణాధికారి వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇస్తుండగా కండక్టర్ అనురాధ, ఆమె తల్లి సరళ మణిపై దాడి చేశారు. ఈ కేసును విచారించిన హయత్‌నగర్‌లోని 14వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనురాధకు 4 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
చీటింగ్ కేసులో నిందితుడికి మూడేళ్లు..
యాచారం పోలీసు స్టేషన్ 2015లో నమోదైన మోసం, ఫోర్జరీ కేసులో నిందితుడు చౌదరిపల్లికి చెందిన శ్రీనివాస్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇబ్రహీంపట్నంలోని 16వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు.
మరో కేసులో 2017 ఫిబ్రవరి 14న రాంగ్‌రూట్‌లో ఆటో నడిపి ఇద్దరు గాయాలకు కారణమైన ఆగాపల్లికి చెందిన ఆటోడ్రైవర్ బాలయ్యకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిందని రాచకొండ పోలీసులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment