Another Chance To Police Aspirants In Telangana - Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలిస్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఆ ‘హైట్‌’ ఉన్నవారికి మరో ఛాన్స్‌!

Published Thu, Feb 9 2023 6:00 AM | Last Updated on Thu, Feb 9 2023 9:25 AM

Another Chance to Police Aspirants - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాల భర్తీలో భాగంగా అభ్యర్థులకు నిర్వహించిన ఎత్తు కొలతల్లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైన అభ్యర్థులకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మరో అవకాశం కల్పించనుంది. ఒక సెంటీమీటర్, ఆ లోపు తేడాతో అనర్హులైన అభ్యర్థులకు మరోమారు ఎత్తు కొలతలు తీయా­లని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌ఎలీ్పఆర్బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఎత్తు కొలతలో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు  www.tslprb.in వెబ్‌సైట్‌ ఈనెల 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు లాగిన్‌ ఐడీల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ అంబర్‌పేట్, 8వ బెటాలియన్‌ కొండాపూర్‌లలో ఈ ఎత్తు కొలతలను తీయనున్నట్లు వెల్లడించారు. భౌతిక కొలతలకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను తీసుకురావాల్సి ఉంటుందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయకుండా వినతిపత్రాలు రాసి తెచ్చే వారిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement