
డబ్లింగ్ కరెన్సీ ముఠా అరెస్ట్
తాడేపల్లిగూడెం లక్షకు రెండు లక్షలిస్తాం.. మూడు లక్షలిస్తామని మాయమాటలు చెప్పి చివరకు చిన్నపిల్లలు ఆడుకునే రంగునోట్లను అంటగట్టి పరారయ్యే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాడేపల్లిగూడెం లక్షకు రెండు లక్షలిస్తాం.. మూడు లక్షలిస్తామని మాయమాటలు చెప్పి చివరకు చిన్నపిల్లలు ఆడుకునే రంగునోట్లను అంటగట్టి పరారయ్యే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాడేపల్లిగూడెం సీఐ ఎంవీఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కడకట్ల సమీపంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగాడుతుండగా పోలీ సులు పట్టుకున్నారు. వారినుంచి రూ.500 నోట్లను పోలిన 1,198రంగు కాగితాలు, రెండు అసలు నోట్లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిలో తాడేపల్లిగూడెంలోని జువ్వలపాలెంకు చెందిన ముద్దాల శ్రీనివాసరావు, మసీద్ సెంటర్‌కు చెందిన కేసనపల్లి రమేష్‌కుమార్, భీమడోలు మండలం అంబర్‌పేటకు చెందిన ఏలూరి ఆనంద్ , నిడమర్రు మండలానికి చెందిన జంగం రంగారావు ఉన్నారు. నిందితుల్లో ఒకరైన శ్రీనివాసరావు గతంలోనూ డబ్లింగ్ కరెన్సీ కేసులో నిందితుడు. ఈ ముఠా చేతిలో మోసపోయిన చాలామంది ఆ విషయూన్ని ఎవరికీ చెప్పుకోలేక ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు.
డబ్బుకు ఆశపడి మాయగాళ్ల చేతుల్లో మోసపోవద్దని, ఎవరైనా మోసపోయి ఉంటే తమకు ఫిర్యాదు చేయూలని కోరారు. సీఐ వెంట ఎస్సై కొండలరావు ఉన్నారు.