
విజయవాడ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడి శ్రీనివాసరావుకు ఎన్‌ఐఏ కోర్టు ఈ నెల 22 వరకూ రిమాండ్ పొడిగించింది. శ్రీనివాసరావుకు నేటితో రిమాండ్ ముగియడంతో అతడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కేసు ఛార్జ్‌షీట్ మీడియాలో రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు నిందితుడు శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై కత్తితో శ్రీనివాస్ దాడి చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment