visakha airport issue
-
శ్రీనివాస్‌కు 22వరకూ రిమాండ్ పొడిగింపు
విజయవాడ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడి శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు ఈ నెల 22 వరకూ రిమాండ్ పొడిగించింది. శ్రీనివాసరావుకు నేటితో రిమాండ్ ముగియడంతో అతడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కేసు ఛార్జ్‌షీట్ మీడియాలో రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు నిందితుడు శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై కత్తితో శ్రీనివాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. -
విశాఖ పోలీసుల తీరుపై స్పీకర్‌కు ఫిర్యాదు
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు శుక్రవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ ఎంపీల పట్ల విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పోలీసుల దురుసు ప్రవర్తనపై వారు స్పీకర్ మహాజన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టాలని కోరారు. విశాఖపట్నంలో ప్రత్యేకహోదాకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ ఎంపీలపై పోలీసులు అత్యంత దురుసుగా, నిరంకుశంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. విశాఖ విమానాశ్రయంలోనే వైఎస్ జగన్, పార్టీ ఎంపీలను నిర్బంధించి పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వైఎస్ జగన్‌ను ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఆయనను, పార్టీ నేతలను బలవంతంగా హైదరాబాద్‌కు పంపించిన సంగతి తెలిసిందే. -
స్పీకర్‌ను కలవనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు
ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు శుక్రవారం ఉదయం కలవనున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో పోలీసుల ప్రవర్తనపై స్పీకర్‌కు ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. విశాఖ ఆర్కే బీచ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ విమానాశ్రయంలోనే వైఎస్ జగన్, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లను నిర్బంధించి వెనుకకు పంపారు. వైఎస్ జగన్, ఎంపీల పట్ల పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేయాలని ఎంపీలు స్పీకర్‌ను కోరనున్నారు.