స్పీకర్ను కలవనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు | ysrcp mp's meets parliament speaker over visakha airport issue | Sakshi
Sakshi News home page

స్పీకర్ను కలవనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు

Published Fri, Feb 3 2017 10:27 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

స్పీకర్ను కలవనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు - Sakshi

స్పీకర్ను కలవనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు

ఢిల్లీ : లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు శుక్రవారం ఉదయం కలవనున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో పోలీసుల ప్రవర్తనపై స్పీకర్కు ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు.

విశాఖ ఆర్కే బీచ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ విమానాశ్రయంలోనే వైఎస్ జగన్, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లను నిర్బంధించి వెనుకకు పంపారు. వైఎస్ జగన్, ఎంపీల పట్ల పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేయాలని ఎంపీలు స్పీకర్ను కోరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement