న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు శుక్రవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ ఎంపీల పట్ల విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పోలీసుల దురుసు ప్రవర్తనపై వారు స్పీకర్ మహాజన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టాలని కోరారు.
విశాఖపట్నంలో ప్రత్యేకహోదాకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ జగన్, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలపై పోలీసులు అత్యంత దురుసుగా, నిరంకుశంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. విశాఖ విమానాశ్రయంలోనే వైఎస్ జగన్, పార్టీ ఎంపీలను నిర్బంధించి పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వైఎస్ జగన్‌ను ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఆయనను, పార్టీ నేతలను బలవంతంగా హైదరాబాద్‌కు పంపించిన సంగతి తెలిసిందే.