
సాక్షి, ఒంగోలు : ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఎదుట హాజరు కానున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ.. తమ రాజీనామాలపై లోక్ సభ స్పీకర్ నుంచి లేఖ వచ్చినట్లు వెల్లడించారు. తమ రాజీనామాలు ఆమోదించాలని కోరతామన్నారు. నెల దాటినా రాజీనామాలు ఆమోదించకపోవడం 5 కోట్ల ఆంధ్రులను అవమానించడమేనని ఇప్పటికే తెలిపామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఐదుగురు వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment